Free SMS And Earn Part Time Money







9/9/09

ఉదయభాను ( నటి, యాంకర్) మసాజ్

నటీమణుల స్నాన ఘట్టాలు, మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్లో దర్శనమివ్వటం కొత్తకాదు. తాజాగా ఉదయభాను ( నటి, యాంకర్) మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయట.
Anchor Udayabhanu

సుమారు 20 నిమిషాలు నిడివిగల ఈ వీడియోలో వైట్ టవల్‌ను చుట్టుకుని ఉన్న ఉదయభాను చైనా యువతితో మసాజ్ చేయించుకున్నదట. దీంతో ఆ వీడియో చూసేందుకు నెట్ వీక్షకులు ఎగబడుతున్నారట. ఆమె అభిమానులు ఆ దృశ్యాలను చూసి లొట్టలేసుకుంటున్నారట.

ఇంటిలో తన అమ్మపోరు పడలేక, ఆమె నుంచి విడిపోయిన ఉదయభాను విజయవాడలోని ఐలాపురం స్టార్ హోటల్ మనవడిని వివాహమాడిన సంగతి తెలిసిందే.


హాలీవుడ్ సీత బాలీవుడ్ సీత దొరికారు

మొత్తనికి మణిరత్నానికి తను తీస్తున్న రావణలో అభిషేక్ సరసన మండోదరి గా నటించడానికి మ0చి యాక్టర్ దొరికింది అది మరెవరోకాదు బాలివుడ్ హిరోయిన్ బిపాషబసు ఈ క్యారెక్టర్ గురించి మణిరత్నం బిపాషకి చెప్పగానే ఒప్పుకుంది కాని మణిరత్నం బిపాషకి కొన్ని స్ట్రిట్ కండీషన్స్ పెట్టడు ఈ సినిమ గురించి మిడియాకి లీక్ చేయొద్దని బిపాషకే కాదు అ సినిమాలో ప్రతి ఒక్కరికి అంతే చెప్పాడు రామయణంతో సంబందంలేదంటు అందులోని ప్రతి క్యారెక్టర్ ఇందులో ఉంచుతున్నాడు కొద్ది రోజుల క్రితం ఈ రామయణ కధమీద ఈ సినిమా పై వివాదం వచ్చింది అ సంగతి పక్కన పెడితే ఇందులో బిపాష 20రోజులు తానే కాల్షీట్స్ ఇచ్చింది ఈ చిత్రం లో బిపాష 40మినిట్స్ కనబడబోతోంది భారి బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐష్,అభిషెక్,విక్రం,ప్రధాన పాత్రలలో ఉన్నారు ఈ చిత్రం కోసం మణిరత్నం చాల శ్రమిస్తున్నాడు ఇందులో ప్రతి క్యారెక్తర్ కాస్ట్యుంస్ తనే స్వయంగా చూసుకుంటున్నాడు ఈ సినిమ హిట్ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.ఐశ్వర్య ఇలాంటి క్యారెక్టర్ లు చాలనే చేసి మెప్పించింది కాని బిపాష ఇదే మొదటి సారి మరి బిపాష పర్ఫమెన్స్ ఎలా ఉంటుందో వేచిచూడండి


హాలీవుడ్ హనుమాన్ లో సీత ఎవరో తెలిసింది

హాలీవుడ్ హనుమాన్ లో సీత ఎవరో తెలిసింది హాలివుడ్ హనుమాన్ లో కీనూ రిప్స్ పక్కన సీతగా నటించబోయేది బాలీవుడ్ హిరోయిన్+రాజస్తాన్ రాయల్స్ అంబ్స్సడర్ శిల్పాశెట్టి మోస్ట్ గ్లామరస్ గా కనిపించే శిల్పాశెట్టి పవిత్ర హిందు స్త్రీ గా ఒదిగి జీవించటానికి సిద్దమవుతోంది ఇదే చిత్రంలో హనుమాన్ గా అమీర్ ఖాన్ నటించబోతున్నాడు ఈ చిత్రం షూటింగ్ ఇండియాలోనే జరగబోతోంది ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికల్లా రాజస్థాన్‌లో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ సమాచారం. ఇలా ఒక కధనం తరువాత ఒకటి తెలుపుతు హాలీవుడ్ వారు ఈ చిత్రం పై అంచనాలు పెంచుతున్నారు హాలీవుడ్ "రామయణంలో ఇద్దరే భారతీయులు విచిత్రంగ లేదు"చిత్రం అంటే అంతేగా మరి

ప్రవాస భారతీయుడు ఉరూపటేల్ నిర్మాత

ఈ చిత్రంలో రాముడి పాత్రను హాలీవుడ్ ప్రముఖ నటుడు కీను రిప్స్

సీతాదేవిగా "శిల్పాశెట్టి"

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ హనుమ

"గ్యారీ ఓల్డ్ మ్యాన్" రావణుడి

ఫేమ్ చక్‌రస్సెల్ ఈ చిత్రానికి దర్శకత్వం

రెహ్మాన్ ది గ్రేట్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ కు 'ఆస్కార్' అవార్డు తర్వాత మరో ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతమైంది. అమెరికాలో ఇటీవల జరిగిన 'జస్ట్ ప్లెయిన్ ఫోక్స్ 2009 మ్యూజిక్ అవార్డ్స్' కార్యక్రమంలో 'గ్రాస్ రూట్ గ్రామీ' అవార్డును రెహ్మాన్ గెలుచుకున్నారు. తమిళ 'గాడ్ ఫాదర్' (వరలారు) చిత్రం సౌండ్ ట్రాక్ కు బెస్ట్ ఇండియన్ ఆల్బమ్ కేటగిరిలో ఈ అవార్డును ఆయన గెలుచుకున్నారు. ఇదే 'వరలారు' చిత్రంలోని 'ఇన్నిసై' (రేడియో మిక్స్) సాంగ్ కు 'బెస్ట్ ఇండియన్ సాంగ్' కేటగిరిలో రెహ్మాన్ తృతీయ స్థానం దక్కించుకున్నారు. ఆయనే కంపోజ్ చేసిన 'ఇల్లామై' సాంగ్ ఐదవ స్థానంలో నిలిచింది.

'బెస్ట్ ఇండియన్ ఆల్బమ్' కేటగిరిలో ఇళయరాజా 'మ్యూజిక్ జర్నీ: లివ్ ఇన్ ఇటలీ'కి తృతీయ స్థానం దక్కింది. ఇండియన్ క్లాసికల్, ట్రెడిషనల్ ఆల్బమ్ కేటగిరిలో శ్వేతా జవేరి 'ఆవిష్కార్'కు ప్రథమ స్థానం లభించింది.



"రాజరెడ్డి" గా "రజని"

ఆంధ్రపదేశ్‌ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆయన మరణవార్త విని ఎందరో చలించిపోయారు. అలాంటి వారిలో వైఎస్‌ సన్నిహితుడు ప్రముఖ నటుడు మోహన్‌బాబు,రాజశేఖర్,జీవిత,నాగర్జున,వెంకటేష్,ఇలాచెప్పుకుంటు పోతే అందరూ ఉంటారు కాని మోహన్ బాబు రూటే సెపరేట్ కనుక తన ప్రత్యేకతను నిరుపించుకుంటు మిడియా తో పంచుకుంటు కూడా ఒకరు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి సోమవారం ఆయన మీడియాతో పంచుకొన్నారు.సినిమా రంగంలోని ప్రముఖులతో ఈ చిత్రం విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నారు వైఎస్‌ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ చిత్రాన్ని నిర్మించడానికి మోహన్‌బాబు సంకల్పించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు డా.దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అందుకు సంబంధించిన తర్జనబర్జనలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రకి రజనీకాంత్‌ని సంప్రదించినట్లు తెలిసింది. గతంలో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్‌ నటించిన ‘పెదరాయుడు’ చిత్రం ఎంతటి భారీ సక్సెస్‌ని సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో కూడా రాజారెడ్డి పాత్రకు రజనీ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఆ పాత్రకు ఆయన్ని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో స్నేహ కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. త్వరలోనే మిగిలిన తారలు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగనుందని తాజా సమాచారం.


9/8/09

'ఉన్నైపోల్ ఒరువన్' EENADU

భిన్న నటన అనగానే గుర్తుకొచ్చే మరి కొద్ది మందిలో అతి ముఖ్యమైనవాడు కమల్ హసన్ అతను అతని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈనాడు చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది అది అందరికి తెలుసు కాని కమల్ హసన్ మరికొద్ది రోజులలో తీయబోయేచిత్రం అమర్ రహే ఇది ఖచ్చితమైన టైటిల్ కాకపోయిన దీనిని రిజిష్టర్ చేసుకున్నాట్టు రజని తెలిపాడు దీని స్టోరీ గురించి చెప్పకపోయినప్పటికి ఈ చిత్రం భూ వివాదాలపై ఉండచ్చన్ని కమల్ చెప్పాడు కమల్ తరువాతి చిత్రం కమల్ ప్రేస్టేజియస్ ప్రోజెక్ట్ అని తెలుస్తోంది అది మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నాడని కమల్ తెలిపాడు అది మర్మయోగి చిత్రం కావచ్చు మొత్తానికి తరువాతి సినిమాలో తన స్వీయదర్శకత్వంలో కమల్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు ఇవన్ని కాక కమల్ మరో భిన్నమైన పని చేయబోతున్నాడు అది ఏమిటంటే తన తనయ శ్రుతి హసన్ ని దర్శకత్వ రంగంలో దింపనున్నాడు దానికి కొంత కాలం ఎదురు చూడవల్సి ఉంది ముందుగ రాబోతున్న ఈనాడు చిత్రంలో టాలివుడ్ పెద్ద హీరోలలో ఒకరైన వెంకటేష్ ఐ.పి.యస్ ఆఫీసర్ గా నటించాడు.దానితో ఈ చిత్రం పై అన్ని వర్గాలు అంచనాలు పెంచుకుంది.

చంద్రముఖి-TWO



దక్షిణాదిన సీక్వెల్ చిత్రాల నిర్మాణం క్రమేణా ఊపందుకున్న తరుణంలో దర్శకుడు పి.వాసు 'చంద్రముఖి' సీక్వెల్ తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కన్నడంలో రూపొందించిన 'ఆప్తమిత్ర' చిత్రానికి రీమేక్ గా వాసు ఆమధ్య రజనీకాంత్ తో తీసి 'చంద్రముఖి' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వాసు మళ్లీ రజనీతోనే 'కథానాయకుడు' తీసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవం చవిచూసింది. ఈ నేపథ్యంలో పి.వాసు మరోసారి కన్నడంలో 'ఆప్తమిత్ర-2' తీస్తున్నారు. తొలి వెర్షన్ లో నటించిన విష్ణువర్దన్ ఈ సీక్వెల్ లో కూడా హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో హీరోయిన్లుగా సంధ్య , భావన, లక్ష్మీ గోపాల స్వామి, విమలా రామన్ నటిస్తున్నారు. అయితే మెయిన్ రోల్ అయిన చంద్రముఖి పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది వాసు గుట్టుగా ఉంచుతున్నారు. ఇదే సమయంలో తమిళంలో కూడా రజనీకాంత్ తో 'చంద్రముఖి-2' తీయాలనే పట్టుదలతో వాసు ఉన్నారు.దీనికి రజనికాంథ్ ఒప్పుకుంటారో లేదో ఎందుకంటే సినిమ తరువాత చాలకాలం గెప్ తీసుకున్న రజని వరుసుగ రెండు సినిమలు విడుదల [యంత్రం' ,సుల్తాన్ ది వారియర్']చేయనున్నాడు అటువంటి తరుణంలో వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తాడని చెప్పలేం వాసు మాత్రం రజనికాంత్ అంగీకారానికి వేచి చూస్తున్నాడు 4భాషలలో చంద్రముఖి విడుదల అయింది అందులో మూడు భాషలలో రజని హీరోగా ఉన్నారు.కన్నడంలో మాత్రం విష్ణువర్దన్ నటించాడు వాసు చంద్రముఖి-2 తీస్తున్నట్టే అప్తమిత్ర నిర్మిచడం అనుకొని హీరో తో డేట్ లు కుదరటంతో దాదపు ఈ చిత్రం చివరి దశకు వచ్చింది మరి మిగత మూడు భాషలు రజని చేయవల్సి ఉండగా రజని ఒప్పుకుంటాడో లేదో అని కోలీవుడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

హలీవుడ్ హనుమాన్


హలీవుడ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది భారీబడ్జెట్,యాక్షన్,రోమెన్సె ఇవన్ని కాకుండ కొత్త కొత్త సూపర్ హీరోస్ కూడ అక్కడే నుంచే వస్తారు కాని ఇప్పుడు హాలీవుడ్ ఇండియన్ రియల్ హీరోని సుపర్ హీరోగా చూపడానికి చూస్తోంది దానికి సన్నహకంగా ఆ చిత్రంలోని ప్రముఖులు వాల్మికి రాసిన సుందరకాండని పరయణంచేస్తున్నారు ఎందుకంటే భారతదేశంలో భగవంతుడిగా పేరూన్న హనుమాన్ ని సూపర్ హీరోగా చూపించి భారతదేశ ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి భారి బడ్జెట్ తో పాటు భారి అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం లోని హనుమాన్ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ,ఈ చిత్రం నిర్మిస్తోంది ఎన్.ఆర్.ఐ.ఉరుపటేల్,ఈ చిత్రం డైరక్టర్ చక్ రస్సెల్,రాముడు కీను రీవ్స్,రావణుడు ఓల్డ్ మాన్ ,సితని ఇంకా అన్వేషిస్తున్నారు మరి కొద్ది నెలలలో మన ముందుకు అమీర్ ఖాన్ హనుమాన్ గా దర్శనమివ్వనున్నాడు దేశభక్తి ఉన్న కుర్రాడిగా,6 పేక్ హీరో గా,మంచి మాస్టార్ గ అలరించిన అమీర్ హాలీవుడ్ లో హనుమాన్ గా మురిపించనున్నాడు ఇవన్ని జరగడానికి మరికొద్ది నెలలు పడుతుంది అంత వరకు వేచి ఉండండి


9/7/09

జొష్ లో లేని డోస్ కిక్ ఎక్కలేదు కలక్షన్ దక్కలేదు


dilraju first average film with big star son
'జోష్' సినిమా ద్వారా మరో స్టార్ హీరో నటవారసుడు
తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున తనయుడు నాగచైతన్య, నిన్నటి తరం ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కార్తిక లను పరిచయం చేస్తూ వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు సెపెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున నటవారసుడిని పరిచయం చెయ్యబోతున్న చిత్రంగా భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. ప్రేక్షకులను ఓ మోస్తరుగా సంతృప్తి పరచిన ఈ చిత్రం యావరేజీ చిత్రంగా నిలబడుతుంది.

కథ విషయానికొస్తే సత్య(నాగచైతన్య) వైజాగ్ లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు. ఓ రోజు తన తల్లితండ్రులతో కాలేజీ మానేస్తున్నానని చెప్పి, ఉద్యోగం కోసం హైదరాబాదు వస్తాడు. తన మామయ్య (సునీల్) తో కలసి వుంటూ ఓ నర్సరీలో ఉద్యోగం చేస్తూ వుంటాడు. అనుకోకుండా విధ్య(కార్తిక) అనే స్కూల్ టీచర్ ను కలుస్తాడు. విధ్య ఎప్పుడూ కాలేజీకి వెళ్లాలని కలలుకంటూ వుంటుంది. కానీ తనని కాలేజీకి పంపడం ఆమె అన్నయ్యకు ఇష్టం వుండదు. కాలేజీకి వెళ్తే తన చెల్లెలు భద్రంగా వుండదని అతని అభిప్రాయం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇదిలా వుంటే ఓ సారి సత్య యంజియం కళాశాల విధ్యార్థులతో గొడవపడతాడు. కానీ ఆ విధ్యార్థులకు జెడి(జెడి చక్రవర్తి) అనే రాజకీయనాయకుడి అండదండలు మెండుగా వుంటాయి. జెడి విధ్యార్థులని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ వుంటాడు. దీంతో ఆ విధ్యర్థులను మార్చాలనుకున్న సత్య వారి కాలేజీలోనే చేరతాడు. ఇక మిగిలిన కథ సత్య ఎలా ఆ విధ్యార్థులను జెడి మాయ నుండీ బయటకు తీసుకొచ్చి, జెడి ఆట కట్టించాడు అనేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే చైతన్య తొలి చిత్రమైనా బాగానే చేసాడు. డాన్సుల్లో, డైలాగులు చెప్పడంలో తన ప్రతిభని చూపాడు. కానీ తన బాడీల్యాంగ్వేజ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. కొన్ని సన్నివేశాల్లోని నటనలో
నాగార్జున ని తలపిస్తాడు. యాక్షన్ హీరోగా కన్నా రొమాంటిక్ హీరోగా బాగా సరిపోతాడు. అప్పీరియన్స్ బాగానే వున్నా ఇంకా టీనేజర్ గానే కనిపించాడు. కథానాయిక కార్తిక చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోయినప్పటికీ నటనలో పర్వాలేదనిపించుకొంది. 'పక్కింటి అమ్మాయి' తరహా పాత్రలో నటించిన ఆమె త్ర రూపకల్పన బొమ్మరిల్లులో హాసిని పాత్రను పోలి వుంటుంది. ఇక విలన్ గా జెడి చక్రవర్తికి ఇలాంటి పాత్రలు అందెవేసిన చెయ్యి. ఆయన పాత్ర 'శివ' చిత్రంలో భవానీ పాత్రకు కొనసాగింపుగా వుంటుంది. ప్రిన్సిపల్ గా ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే బాగా చేసాడు. సునీల్ కామెడీ చెప్పుకోదగినదిగా లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేక్షకులను నవ్విస్తాడు. బ్రహ్మానందం పాత్ర వృధాగా పోతుంది. ఇంతకు ముందు కథానాయకుడిగా, హీరో స్నేహితుడిగా నటించిన ఆనంద్ ఈ చిత్రంలో చైతన్య తండ్రిగా నటించాడు. చాలా రోజుల తర్వాత సితార కథానాయకుడి తల్లి పాత్రలో నటించింది. హేమ, సూర్య లు తమ పాత్రలకు న్యాయం చేసారు.

దర్శకుడు వాసువర్మ సందేశాత్మకమైన కథను ఎన్నుకున్నప్పటికీ ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ కన్వింసింగ్ గా లేదు. సందేశం చెప్పడానికే సినిమాను సాగదీసినట్టనిపిస్తుంది. సందీప్ చౌతా అందించిన సంగీతం ఫర్వాలేదు. రెండు పాటలు బాగున్నాయి. సమీర్
రెడ్డి సినిమాటోగ్రఫీ ఫర్లేదు.

మొత్తానికి సినిమా పేరులో మాత్రమే జోష్ వుంది కానీ సినిమా మాత్రం చాలా సాదాసీదాగా వుంటుంది. నాగచైతన్య కోసం ఓపెనింగ్స్ బాగానే వచ్చినా హిట్ రేంజ్ ను చేరుకోవడం కష్టమే. ఓ మోస్తరు చిత్రంగా నిలబడుతుంది.

వరుడు ఎవడు ?

'వరుడు' ఎన్నో రోజులుగా అందరి నోళ్లలో నానుతున్న పేరు.మహేష్ బాబు,త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసారన్న వార్తలు బలంగా వినిపించాయి. మహేశ్ బాబు కూడా ఓ ఇంటర్యూలో మా చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదని స్పష్టం చేసినప్పటికీ వరుడు మాత్రం బాగా ప్రాచుర్యం పోందింది.
తాజాగా అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'వరుడు' టైటిల్ ను ఖరారు చేసారు. యూనివర్సల్ మీడియా పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త కథానాయిక పరిచయం





7/30/09

మగదీర రివ్యు

మగదీర మేనియా ఏటుచూసిన మగదీర మేనియా ఆంద్రప్రదేశలో ఏ ప్రాంతంకెళ్ళినా ఏ సిని, మెగా అభిమానినడిగినా మగదీర మూవీ చూసిన తరువాతే ఏదైన అన్నట్టు ఉన్నారు ఉన్నారు ఏంటి మిడియా చూస్తే చాలు ఏ టి.వి. పెట్టిన రాంచరణ్ ఇంటర్వ్యులు రాజమౌళి అద్భుతాలతో బంగారుకోడిపెట్ట స్టెప్లతో హొరెత్తుతున్నాయ్ తెలుగుసినిమాలో మొట్ట మొదటి సారిగా వినియోగించిన త్రిడి ఎఫెక్ట్తో విడుదల అవుతోన్న ఈ సినిమా అంచనాలు తెలుగుసినీ ఇండస్ట్రీ కనివిని ఎరుగని రీతిలో ఉంటాయి అన్నది నిజం అనిపించేలా 1500 ప్రింట్లతో విడుదలయ్యింది తెకుగుసినిమాలో ఎన్నడులేని విధముగా 40కోట్ల బడ్జెట్ తో అద్భుతం సౄష్టించనుంది ఇంతటి భారీ అంచనాలతో విడుదల అవుతున్న ఈ చిత్రం విడుదలకు రాక మునుపే గందర గోళం నెలకొంది తిరుపతిలో సినిమా ఆడనీయకుండ చేయడం అభిమానులని నిరాశకు గురిచేసే విషయం

మగధీర రివ్యు :

ఫిల్మ్ మగదీర

యాక్టర్స్ ::రాంచరణ్ ,కాజల్,చిరంజీవీ,బ్రహ్మనందం,శ్రీహరి ,సునిల్ ,దేవ్ జిల్ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావ్ సంగీతం కీరవాణి

డైరక్టర్ రాజమౌళి

ఫైట్స్ రాం లక్ష్మణ్ ,పిటర్ హైన్స్


సినిమా విడుదల ముందే ఎంతో ఎక్స్పక్టేషనస్ తో విడుదలాయిన ఈ చిత్రం మొత్తనికి వెండితెరమీద విడుదలయింది ఈ
సినిమా లో రాంచరణ్ పేరు హర్ష యంగ్ మెన్ బైక్ రేస్ ,బెట్స్ ద్వర డబ్బు సంపాదిస్తుంటాడు ఇలాంటి ఎడ్వెంట్యుర్స్ అంటే బాగ ఇష్టపడే కుర్రాడు అనుకోకుంద ఒకరోజు ఇందు [కాజల్] చెయ్యి అతనికి తగిలి అతని ఆత్మ ప్రెసెంట్ పోయి పాస్ట్ గుర్తుకొస్తుంది

పాస్ట్ కధ ఏమటంటే :1609లో రాంచరణ్ పేరు కాల బైరవ ఇతను ఉడైదరలో సోల్జర్స్ కి ట్రైనింగ్ ఇచ్చె జాబ్ సైనాధిపతి రణదీర్ యువరాణి మిత్రదేవి ని ప్రేమిస్తాడు కాని యువరాణి కాలబైరవుడ్ని ప్రేమిస్తుంది అది వీరి ఇద్దరిమద్య బీకరయుద్దంగా మారి ఆ యుద్దంద్వార పాస్ట్ లో వీరి జీవితాలు ముగుసిపోతాయ్ షెర్ ఖాన్ ఒక ముస్లీం వీరి ప్రేమకి యుద్దానికి దీని అంతటికి సాక్షంగా ఉంటాడు
వీళ్ళు ఇరువురు మళ్ళి జన్మిస్తారు [హర్ష ,ఇందు ]ఇంకా చాల క్యేరెక్టర్స్ పాస్ట్ నుంచి ప్రెసెంట్ లో కూడ ఉంటాయ్ వీళ మద్య సంభందాలు ఏంటి సినిమాలో చూడండి

7/28/09

రామ్ చరణ్-స్కిల్స్

చిన్నప్పుడు నేర్చుకున్న హార్స్ రైడింగ్ విన్యాసాలను మగధీర చిత్రంలో చూపిన రామ్ చరణ్ ఈ సారి మరోసారి తనలో దాగిన మరో స్కిల్ ని వెలికితీయటానికి రెడీ అవుతున్నాడు. అది మరేదో కాదు స్కై డైవింగ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో స్కై డైవింగ్ కి సంభందించిన కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేసారని సమాచారం. ఇన్నాళ్లు హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథలు రూపొందించే దర్శకులు ఇప్పుడు వారిలో దాగిఉన్న స్కిల్స్ ని ఉపయోగించుకునే దిశలో కథనాలు అల్లుతున్నారు. ఇక ఈ కొత్త చిత్రంలో అధికభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ స్కై డైవింగ్ ని ఇప్పటికే నేను నేర్చుకునేర్చుకున్నాను. ఆ విన్యాసాలను నేను భాస్కర్ చిత్రంలో ప్రదర్శంచబోతున్నాను. వాటిని న్యూయార్క్ లో చిత్రీకరిస్తారు..అని చెప్పాడు. ఇక ఈ నూతన చిత్రంలో జెనీలియా హీరోయిన్ గా నటిస్తోంది.

7/27/09

మైఖేల్ జాక్సన్‌ డెత్ రిపోర్ట్


పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్‌ డెత్ రిపోర్ట్ ఎట్టకేలకు మిస్ట్రరిఎ వీడిపోయింది. మైఖల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్ ముర్రె పోలిసులముందు ఒప్పుకున్నాడు ప్రొపొఫోల్ అనే ఇంజక్షన్ వికటించడంవల్లే చనిపోయాడని చెప్పాడు.ఇంజక్షన్ ఇచ్చిన తరువాత మైఖ్ నిద్రలోకి వెళ్ళిపోయాడని అటువంటి సమయంలో దగ్గర ఉంచవల్సిన ఆక్సిజన్ కూడ ఉంచలేదని ముర్రె స్వయంగా ఒప్పుకున్నాడు మైఖ్ చనిపోయిన తరువాత కూడ మైఖల్ జీవితంలో మనకు తెలియని ఎన్నో నిజాలు బయల పడ్డాయ్ ఎన్నో వదంతులు వినపడ్డాయ్

పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ జాక్సన్ కు నాలుగో బిడ్డ ఉన్నాడని

పాప్ సామ్రాజ్య రారాజు మైఖేల్ దయ్యమయ్యాడని

మైఖల్ జాక్సన్ అప్పులో ఉన్నాడని

మైఖల్ చెతబడులు చేస్తాడని

చిన్న పిల్లలని వేధిస్తాడని ఇంకా ఎన్నో వదంతులు వచ్చాయ్

ఇవన్ని నిజమో కాదో తెలీదుగాని మైఖల్ చనిపోలేదు చంపబడ్డాడన్నాది నిజం ఎందుకంటే మైఖల్ పర్సనల్ డాక్టర్ ముర్రె స్వయంగ ఒప్పుకోవడం ద్వార అందరికి తెలిసింది. ఇది మాత్రం యం.జే.ఫ్యాన్స్ కి భరించలేని నిజం .


7/26/09

జు.యన్.టి.ఆర్ మందుపార్టి వీడియో --సాక్షి లొల్లి

సాక్షిలో జూనియర్ యం.టి.ఆర్ మందు పార్టి దీని వల్లే కారు స్పీడ్ గా నడిపి ఏక్సిడెంట్ చేశాడని ఒక కదనం వెలువడింది, దానితో పాటు ప్రసారం చేసిన ఈ వీడియో ప్రకంపనాలు స్రుష్టిస్తోంది ఈ వీడియో యాక్సిడెంట్ ముందు కాదని అప్పటికి వీడియోలో ఉన్నట్టుగా తన క్రాఫ్ లేదని అది ఆరు నెలల కింద చిత్రీకరించినది అని రాజీవ్ కనకాల వెల్లడించారు ఎది ఎమైన ఎదో చిన్న కుర్రాడు సరదాగా ఎంజొయ్ చెస్తున్నాడు దాన్ని కూడా రాజకీయం చెయ్యడం సాక్షికే చెల్లింది


7/25/09

రాంచరణ్,జెనిలియాతో నటించాలని ఉందా

రామ్ చరణ్ తేజ, జెనీలియా కాంబినేషన్లో ప్రారంభంకానున్న చిత్రంలో నటించటానికి ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ఆహ్వానిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాగేంద్రబాబు తమ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉండేవారికి మాత్రమే ఇక వారి రిక్వైర్ మెంట్స్ చూడటానికి బాగా ఉండి 18, 22 వయస్సుల మద్య ఉన్న అమ్మాయిలు ఇరవై మంది కావాలి. అలాగే అదే వయస్సులో ఉన్న పదిహేను మంది మగపిల్లలు కావాలి. వీటితో పాటు 35 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న మగవాళ్ళు ఐదుగురు కావాలి.
అంతేవయస్సుతో ఉన్న ఆడవాళ్ళు కూడా ఐదుగురు కావాలి. చిన్న పిల్లలు 5 నుంచి 12 సంవత్సరాల లోపు వారు ఐదుగురు కావాలి. ఫైటర్స్ (మంచి లుక్ ఉన్న బాడీతో)పది మంది కావాలి. ఇక మరొక్క సారి ఈ కాస్టింగ్ కాల్ కేవలం అమెరికాలో ఉన్నవారికి మాత్రమే నని గుర్తు పెట్టుకోండి ఇక ఆసక్తి ఉన్నవారు తమ ఫ్రొఫైల్స్ ని ఫుల్ సైజ్, మిడ్ సైజ్, క్లోజ్ ఫొటోలతో పంపండి. మంచి అవకాశం...మిస్సవకండి...మీరు మెయిల్ చేయాల్సిన ఎడ్రస్.
..artistes.anjana@gmail.com బెస్టాఫ్ లక్



తన బెడ్‌రూమ్‌ నిండా సల్మాన్‌ఖాన్‌ పోస్టర్లున్నాయన్న:అసిన్



గజనీ చిత్రంతో బాలీవుడ్ లో హాట్ స్టార్ గా మారిన అసిన్ తాజాగా నా బెడ్ రూమ్ చెక్ చేసుకోండంటూ సవాల్ విసురుతోంది. తన బెడ్‌రూమ్‌ నిండా సల్మాన్‌ఖాన్‌ పోస్టర్లున్నాయన్న వార్త అంతటా వినపడుతూండటంతో ఈ విధంగా ప్రతిస్పందిస్తోంది. కావాలంటే వచ్చి నా రూమ్‌ చెక్‌ చేసుకోండి. నా ఫ్లాట్‌ మొత్తం మీద నా సొంత ఫోటోలే ఉండవు. అలాంటిది వేరొకరి ఫోటోలెలా ఉంటాయి. ఈ రూమర్‌ ఎలా మొదలవుతుందో నాకర్థం కాదు. సల్మాన్‌ ఈ రూమర్‌ని తేలిగ్గానే తీసుకుంటాడనుకుంటా అంటోది. సల్మాన్ తో ఆమె లండన్ డ్రీమ్ చిత్రం చేసిన సందర్భంగా ఆమెపై రకరకాల రూమర్స్ వచ్చాయి. అవి తనకు నవ్వు తెప్పిస్తున్నాయంటోంది. ఇక సల్మాన్ ఆమెకు ప్లాట్ ని గిప్ట్ గా ఇచ్చాడన్న మేటర్ పై కూడా మండిపడుతోంది.'సల్మానే ఇచ్చాడంట' అనే ప్రచారం సంగతో అని అడిగితే చాలా తెలివిగా సమాధాన మిస్తోంది. మీరే చెప్తున్నారుకదా..ఇచ్చాడంట.. అంటే మీరే అది నిజం కాదు అని కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట. అయినా అలా అనుకుంటూ పోతే ఒకటేమిటి.. సల్మాన్‌ నాకు 120 కానుకలు ఇచ్చాడని చెబుతారు. ఆఖరుకి అతను నాకు ప్రపోజ్‌ చేశాడని కూడా ఈ రూమర్స్ పుట్టించేవాళ్లు అంటారు. అయితే మీరు నమ్మని నిజం సల్మాన్ ఇప్పటివరకూ నాకు ఎలాంటి కానుకలూ ఇవ్వలేదు..అనితేల్చి చెప్పింది ఈ అందాల భరణి


Powered by web analytics software.