
ఇదే మాట చెప్పుకుంటున్నారు "రగడ" చిత్రాన్ని చూసిన "మాస్" జనం. ప్రియమణి నాగర్జున రగడకోసం తన ఎద సొంపులను పరిమితికి మించి ఆరబోసిందని సినీజనం చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒప్పుకోవడం లేదట.
ప్రియమణి నటన గురించి పల్లెత్తు మాట మాట్లాడకుండా, అనుష్క చాలా క్యూట్‌గా ఉందనీ, హుందాగా నటించిందని నాగ్ రగడ గురించి అడిగినవారికి చెపుతున్నాడట. దీంతో ప్రియమణి ఉడుక్కుంటోందట.
అయితే ప్రియమణి సన్నిహితులు మాత్రం ప్రియ అందాలు, గ్లామర్ ముందు అనుష్క ఎంత చూపించినా వర్కవుట్ కాదని కొట్టిపారేస్తున్నారట. పైగా జాతీయ నటితోనా పోటీ...? అంటూ దీర్ఘాలు తీస్తున్నారట. మరి అనుష్క దీనిపై ఏమంటుందో... ఏంటో..?