
ఒక మంచి హిట్ కోసం మొహవాచిపోయిన యువసామ్రాట్ తన తాజా చిత్రం "రగడ"తోనైనా ప్రేక్షకులను మెప్పించాలనుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన అందాల తారలు అనుష్క, ప్రియమణి నటిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసి తీరాలని దర్శకుడు కృతనిశ్చయంతో ఉన్నారు. నాగార్జు నటన సంగతి అలా ఉంచితే... హీరోయిన్ల అందాలను ఎంత మేరకు ఉపయోగించుకోవాలో అంత మేరకు దర్శకుడు ఉపయోగించున్నట్లు సమాచారం.
ముఖ్యంగా అనుష్కతో "సూపర్" ఎక్స్‌పోజింగ్ చేయించాడంటున్నారు. ఇక ప్రియమణి అయితే ఆల్రెడీ "గ్లామర్ ప్రదర్శన ఎంతవరకు చేయాలో చెప్పండి... అంతవరకూ చేస్తా"నంటోంది కనుక ఆమె అందాల ప్రదర్శనపై పెద్దగా డిమాండ్ చేయాల్సిన పనిలేదు.
ఎటొచ్చీ అనుష్క విషయంలోనే కాస్త తటపటాయించినా ఆ తర్వాత ఆమె నాగ్ కోసం అనుకున్న మోతాదులో ఎక్స్‌పోజింగ్ చేయడానికి రెడీ అనేసరిక ఆమె వద్ద నుంచి 100 శాతం అవకాశాన్ని తీసుకున్నారట. మరి చిత్రంలో అనుష్క ఏ మేరకు అందాలను ప్రదర్శించిందో చూడాలి.