
మీడియాకు దూరంగా వుండే నయనతార ఇటీవల ప్రభుదేవా తో ప్రేమాయణంతో నిత్యం వార్తల్లోనే నానుతున్నారు. అయితే ఇటీవల సంతోషం సినీ వారపత్రిక నయనతార తమ పత్రికకు ప్రత్యెక ఇంటర్వ్యూ ఇచ్చిందంటూ ఓ ఆర్టికల్ ను ప్రచురించారు. ప్రభు తో వివాహం తర్వాత తను సినిమాలకు స్వస్తి చెబుతున్నానని, ప్రస్తుతం బాలకృష్ణ తో నటిస్తున్న 'శ్రీరామరాజ్యం' చిత్రం తన చివరి చిత్రమని ఆ ఇంటర్వ్యూ లో ప్రచురించారు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన వెబ్ సైట్ లు, ఎలక్ట్రానిక్ మీడియా తమదైన శైలిలో నయనతార పై న్యూస్ ఫోకస్ చేసారు. ఇది తెలిసిన నయనతార సంతోషం సినీ వారపత్రిక పై మండి పడుతుంది. అసలు ఇటీవల కాలంలో నేను ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ విషయం గురుంచి నయనతార మాట్లాడుతూ 'బాపు గారి దర్శకత్వంలో చేయడం హ్యాపీగా వుంది. ఇక నా వ్యక్తిగత విషయాలు మీడియాతో పంచుకోవడం ఇష్టం వుండదు. శ్రీరామరాజ్యం చిత్రంలో నా లైఫ్ టైం బెస్ట్ పాత్రను చేస్తున్నాను. ఇక నా భవిష్యత్ ప్రణాలికలు త్వరలోనే తెలియజేస్తాను' అని చెప్పుకొచ్చారు.