
పవన్ కళ్యాణ్ అంటే హీరో నితిన్ పడి చచ్చిపోతుంటాడు. తొలిప్రేమ, ఖుషీ చిత్రాలని లెక్కలేనన్ని సార్లు చూసిన నితిన్ తను హీరో అయ్యాక కూడా పవన్ ని అంతే ఇష్టంగా అభిమానిస్తున్నాడు. పవన్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలనేది నితిన్ చిరకాల వాంఛ. తాను హీరోగా బిజీగా ఉన్న రోజుల్లో కూడా పవన్ సినిమాలో చిన్న పాత్రయినా చేయడానికి రెడీ అని నితిన్ అన్నాడు. ఇప్పుడైతే అవకాశాలే లేక ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ సినిమా ఛాన్సొస్తే మరింత హ్యాపీ అవుతాడు. ‘దబాంగ్’ని ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ కథలో తనకి సవతి సోదరుడిగా ఎవరు బాగుంటారని చూస్తున్నాడు. శర్వానంద్, శివాజీ, శ్రీకాంత్..ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరూ నితిన్ పేరు చెప్పట్లేదు. ఆ క్యారెక్టర్ తనకిస్తే పవన్ కి తమ్ముడిగా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని నితిన్ తన సన్నిహితులతో అంటున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పవన్ కి చేరవేస్తే నితిన్ ‘గబ్బర్ సింగ్’తమ్ముడైపోతాడు