
ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో ఫస్ట్ ఆఫ్ కాజల్ ఫ్యాషన్ డిజైనర్ గానూ,సెకండ్ ఆఫ్ రాకుమార్తెగాను కనిపించి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రంలో తాను నటించటం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. రోజకు పధ్నాలుగు గంటలు చొప్పున పనిచేయాల్సి వచ్చిందంటోంది. అలాగే ధీర..ధీర..మగధీర అనే పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనపడటం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్తోంది. అంతేగాక ప్రిన్సెస్ గా నటించటానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. బలమైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం కళ్ళతోనే కొన్ని ఎమోషన్స్ పలకాల్సి వచ్చేది. అందుకోసం నేను ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజకపూర్, నర్గీస్ నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమిస్ట్రీ తెరపై పండటానికి కారణాలు పరిశీలించేదాన్ని. అలాగే మేకప్ కోసం రోజుకు రెండు గంటలు పట్టేది. ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ సన్నివేశం చేస్తే మరుసటి రోజు కాలేజి అమ్మాయిగా ఈ కాలం సీన్ చెయ్యాల్సి వచ్చేది అంటూ తన అనుభవాలును కాజల్ గుర్తు చేసుకుంది.