Free SMS And Earn Part Time Money







Showing posts with label magadheera. Show all posts
Showing posts with label magadheera. Show all posts

7/23/09

మగదీర " కాజల్ కబుర్లు "

మగధీర చిత్రంలో హీరోయిన్ కాజల్ ని రామ్ చరణ్ ఛేజ్ చేసే సన్నివేశం బాగా వచ్చింది.ఆమె సిటీ బస్సులో వెళ్తూంటే రామ్ చరణ్ గుర్రంపై వెంబడిస్తూంటాడు. బిజీ ట్రాఫిక్ లో హైదరాబాద్ రోడ్లపై ఈ సీన్ జరుగుతుంది. చరణ్ ఆ ట్రాఫిక్ లోనే ఆమెను ఛేజ్ చేస్తూంటాడు. కథా పరంగా రామ్ చరణ్ కి అప్పుడే.తాను ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న అమ్మాయి కాజల్ అని తెలుస్తుంది.దాంతో ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ దగ్గరలో ఉన్న గుర్రంపై ఆ స్వారీ మొదలెడతాడు. ఆ సన్నివేశం చాలా ఫన్నీగా ఉంటుంది. ట్రాఫిక్ లో అంతా విచిత్రంగా చూస్తూంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సన్నివేశం చిత్రీకరించారు...అంటూ చెప్పుకొచ్చింది కాజల్. మగధీరలో తనకు నచ్చిన సన్నివేశంగా ఈ సన్నివేశం వివరించింది.
ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో ఫస్ట్ ఆఫ్ కాజల్ ఫ్యాషన్ డిజైనర్ గానూ,సెకండ్ ఆఫ్ రాకుమార్తెగాను కనిపించి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రంలో తాను నటించటం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. రోజకు పధ్నాలుగు గంటలు చొప్పున పనిచేయాల్సి వచ్చిందంటోంది. అలాగే ధీర..ధీర..మగధీర అనే పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనపడటం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్తోంది. అంతేగాక ప్రిన్సెస్ గా నటించటానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. బలమైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం కళ్ళతోనే కొన్ని ఎమోషన్స్ పలకాల్సి వచ్చేది. అందుకోసం నేను ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజకపూర్, నర్గీస్ నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమిస్ట్రీ తెరపై పండటానికి కారణాలు పరిశీలించేదాన్ని. అలాగే మేకప్ కోసం రోజుకు రెండు గంటలు పట్టేది. ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ సన్నివేశం చేస్తే మరుసటి రోజు కాలేజి అమ్మాయిగా ఈ కాలం సీన్ చెయ్యాల్సి వచ్చేది అంటూ తన అనుభవాలును కాజల్ గుర్తు చేసుకుంది.


7/22/09

దిల్ రాజుపైనా నిషేధం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుపై కూడా ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణయం ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్ర పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఇటీవలే మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్‌కి సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ ఆంక్షలను ఉల్లంఘించి తన జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్‌ని మా టీవీకి ఇచ్చారు. దీంతో దిల్‌ రాజు తీరుపై ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్‌కు మాత్రమే పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన మగధీర ఆడియో పంక్షన్ కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మా టీవీలో లైవ్ ఇచ్చారు. అటు అల్లు అరవింద్, ఇటు దిల్‌ రాజు ఇద్దిరిపై ఏక కాలంలో ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవచ్చిన తెలుస్తోంది.




7/15/09

రాం చరణ్ ఏబౌట్ హిస్ మగధీర


తన మగధీర చిత్రం గురించి హీరో రామ్ చరణ్ తేజ మీడియాతో మాట్లాడారు. 'మగధీర' అనుభవాల్ని చరణ్‌ వివరిస్తూ..."గుజరాత్‌లో తీసిన గుర్రం ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే 'బంగారు కోడిపెట్ట...' పాట కూడా. ఒకప్పుడు నాన్నగారు అదరగొట్టేసిన ఈ పాటను ఇప్పుడు నేను చేస్తుంటే చాలా ఉద్వేగపడ్డాను. ఇక కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం. కచ్చితంగా ఈ సినిమా రీ-రికార్డింగ్‌ ట్రాక్స్‌ని ఆడియో సీడీలుగా రిలీజ్‌ చేయొచ్చు. మహామహులైన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి పనిచేశారు. కెమెరామన్‌ సెంథిల్‌కి హేట్సాఫ్‌ చెప్పాలి. అంత బాగా ఫొటోగ్రఫీ సమకూర్చారాయన' అని తెలిపారు.ఇక ఈ సినిమా తనకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలుస్తుందనే అంచనాలో ఉన్నారు చరణ్‌. నిజంగా ఈ సినిమా చేయడం తన అదృష్టమని చెబుతున్నారాయన. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో...భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది





7/12/09

మగధీర ఖచ్చితంగా బ్లాక్ బస్టరేనట !



రిలీజ్ కి దగ్గరవుతున్న కొద్ది మగధీర మీద అంచనాలు పెరిగిపొతున్నయి ఫిల్మ్ నగర్ వర్గాల కదనం ప్రకారం సూపర్ డూపర్ హిట్ కి ఏమాత్రం తక్కువగా లేదంటున్నారు సినిమాలో యాక్షన్ సీన్స్ 40 నిమషాలుండే ఫ్లాష్ బ్యాక్ అసాదారణం గా ఉందని పొరాట దృశ్యాలు అద్బుతంగా ఉన్నాయట ఫ్లాష్ బ్యాక్ తో పొలిస్తే మిగతా కధ మాత్రం కొంచం తగ్గిందని సమాచారం "బ్రెవ్ హార్ట్ , 300, గ్లాడియెటర్ లను పొలిన యాక్షన్ దృశ్యాలు సినిమాని కచ్చితం గా హిట్ చెస్తాయనిపిస్తోంది కాక పొతే మామూలుగా ఉన్న పాటలు ఎమన్నా డామెజ్ చెసే అవకాశం ఉంది చూద్దాం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎమన్నా కవర్ చెస్తుందేమో ఎది ఎమైనా భారి అంచనాలతో రికార్డు స్తాయి ఒపెనింగ్స్ మాత్రం ఖాయం










Powered by web analytics software.