
పెళ్ళయిన కొత్తలో చిత్రంతో ఒకటయిన జగపతి బాబు, ప్రియమణి ల ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రియమణి ప్రధానపాత్రలో చేస్తున్న తాజా చిత్రం క్షేత్రంలో జగపతి బాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఇంతకుముందు సాధ్యం తో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసిన ప్రియమణి మరో సారి తన చుట్టూ తిరిగే కథని ఓకే చేసింది. ఇక ఈ చిత్రంలో కిక్ తో పరిచయమైన శ్యామ్ కీలకమైన పాత్రలో కనపించనున్నాడు. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ మీదకు వెళుతుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం "నాగార్జున సరసన రగడ, సుమంత్ సరసన రిమ్ జిమ్" అనే చిత్రంలో చేస్తోంది. ఆమె నటించిన రామ్ గోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్ర డిసెంబర్ 3న విడుదల కానుంది.