
సూపర్ స్టార్ రజనీకాంత్ దానధర్మాల గురించి ఎన్నో విన్నాం. ఎవ్వరూ అడిగినా అడగక పోయినా, రజనీకాంత్ దృష్టిలో ఎవరైనా నటుడు గానీ, లేక సినిమాకు సంబంధించినటువంటి టెక్నీషియన్స్ గానీ బాధల్లో ఉంటే, రజనీ వెంటనే వారికి సహాయం జరుగుతుంది. అలా ఆయన ఎంతో మందికి సహాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలనాటి హీరో ఎంజీఆర్ స్టంట్ మెన్ ఆర్థికంగా ఎంతో బాధపడుతుంటే, షూటింగ్ స్పాట్ లో ఆ స్టంట్ మెన్ ను చూసి అతనికి కొన్ని లక్షలు సహాయం చేశాడు. అలాగే నటుడు కాంతారావుకు నెలకు పదివేల రూపాయాల చెక్ ను చనిపోయే వరకు అందించారు. అలనాటి కమేడియన్ ‘తంగవేలు’ కుమారుడికి కొన్ని లక్షల బ్యాంక్ బుణం ఇప్పించి, మంచి ఇండస్ట్రీ పెట్టించారు. ఇప్పుడు జపాన్ లో భూకంపం, సునామీ సందర్భంగా ‘టోక్యో’ నేలమట్టమయింది. ఎంతో మంది చనిపోయారు. సునామి కారణంగా ఇళ్ళు కొట్టుకొని పోయాయి. ఇప్పుడు కూడా జపాన్ లో ఎంత మంది శవాలు ఉన్నాయో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితులలో సూపర్ స్టార్ రజనీకాంత్, జపాన్ కు సహాయం అందించడానికి నడుం కట్టాడు. జపాన్ లో ‘రజనీకాంత్’కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యం రజినీకాంత్ తమిళనాడులో ఉన్న ఫ్యాన్స్ సహాయంతో జపాన్ ప్రజలకు అవసరమైన వస్తువులను, డబ్బును, జపాన్ ప్రజలకు అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. రజినీకాంత్ జపాన్ వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితి బాగుండక పోవడంతో జపాన్ ప్రోగ్రామ్ ను నిర్ణయించలేదు. రజనీకాంత్ కోలీవుడ్ కో స్టార్స్ తో కూడా సంప్రదించి, కొన్ని వేల కోట్లు కలక్ట్ చేసి జపాన్ ప్రజలకు పంపించే ఆలోచనలో నిమగ్నమయ్యారని సమాచరం.