Free SMS And Earn Part Time Money







7/11/09

జస్ట్ యెల్లో లో జెనిలియా





జస్ట్ యెల్లొ పతకం పై ఏర్పడే ప్రతి సినిమా ఏదో ఒక ప్రత్యేక కధనంతో తీస్తారు దానిలోభాగంగానే

జెనిలీయా తో ప్రారంభమయిన సినిమా అందులో ఎప్పుడు లేని విధముగా జెనిలీయా టీచర్

పాత్రలో నటించబోతోంది ప్రేక్షకులు ఈ సినిమాని ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారో భినత్వాన్ని ఆశించే మన ప్రేక్షకులు అదరీస్తారో లేదో సినిమా విడుదలయ్యక చూడండి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా 'కథ' చిత్రాన్ని మలుస్తున్నారు. అరుణ్‌, జెనీలియా నాయకానాయికలుగా జస్ట్‌యల్లో పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సగభాగం పూర్తయింది. శ్రీనివాస్‌ రాగ దర్శకుడు. కాగా అరకులో రెండు పాటలను తీయడంతో పాటు సగం టాకీని పూర్తిచేశామని నిర్మాత గంగరాజు పేర్కొన్నారు. ఇంతవరకు చేయని టీచర్‌ పాత్రలో జెనీలియా నటిస్తోందని ఆయన చెప్పారు. వివిధ రకాల భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 13 నుంచి హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్‌ను జరపనున్నామని, అందులో భాగంగా మిగతా టాకీ, మరో రెండు పాటలను చిత్రీకరిస్తామని ఆయన వివరించారు.
ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, షఫీ, రఘుబాబు తదితరులు తారాగణం. ఈ చిత్రానికి మాటలు, పాటలు: గుణ్ణం గంగరాజు, సంగీతం: యస్‌.కె.బాలచంద్రన్‌, ఛాయాగ్రహణం: ఏండ్రు, ఆర్ట్‌: రవీందర్‌, కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: శ్రీనివాస్‌ రాగ.

మగదీర ప్రోడ్యుసర్ అల్లు అరవింద్ పై బ్యాండ్



ప్రముఖ నిర్మాత, ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్‌పై బ్యాన్ విధించే సూచనలు కనపిస్తున్నాయి. ఇటీవలే సినిమా యాడ్స్ ప్రసారం విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొన్ని టీవీ ఛానెళ్లపై బ్యాన్ విధించింది. అందులో మాటీవీ సైతం ఉంది. అయితే అల్లు అరవింద్ నిర్మించిన మగధీర చిత్రం ఆడియో ఫంక్షన్‌ని మా టీవీ వారు లైవ్ టెలీకాస్ట్ చేసారు. దీనిపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అల్లుపై గుర్రుగా ఉంది. తమ అనుమతి లేకుండా బ్యాన్ విధించిన టీవీ ఛానెల్‌కు టెలీకాస్ట్ హక్కులు ఇచ్చినందుకు కౌన్సిల్ నోటీసు ఇచ్చిందని సమాచారం. అయితే అల్లు అరవింద్ దానిని లెక్క చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి అల్లుపై బ్యాన్ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనకు ఏవిధమైన సహకారం ఎవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇక మరో ప్రక్క ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా నిర్మాతల మండలి నుంచి నోటీసు అందుకున్నారు. నిర్మాత అడ్డాల చంటి ఇచ్చిన కంప్లైంట్‌తో నిర్మాతల మండలి రాజమౌళిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే


7/10/09

ఒయ్ ని గీతంజలితో పొలుస్తున్నారు :నాగార్జున



హీరో సిద్దార్థ, 'అంజలి పాప' "షామిలి" హీరోహీరోయిన్లుగా నటించిన 'ఓయ్' చిత్రాన్ని అక్కినేని నాగార్జున తిలకించి "గీతాంజలి"తో పోల్చారు ఈ విషయాన్ని సిద్దార్థ చెబుతూ... తాను నటించిన 'ఓయ్' చిత్రాన్ని నాగార్జున చూసి గీతాంజలితో పోలుస్తున్నారని ఇండస్ట్రీలో చాలామంది తనకు తెలియజేసినట్లు చెప్పారు. నాగార్జున అన్నమాటకు మళ్లీ "ఓయ్" సినిమాను చూశానని సిద్ధార్థ చెప్పాడు. గీతాంజలికి, ఓయ్‌కి ఒక విషయంలో పోలిక ఉందని నాగార్జున తనతో చెప్పారని సిద్ధార్థ అన్నాడు. అదేమిటంటే..? గీతాంజలి రిలీజ్ అయిన తర్వాత అంతా ప్లాప్ అన్నారు. ఆ తర్వాత పికప్ అయి రికార్డు సృష్టించింది. అయితే "ఓయ్" చిత్రానికి ఓపెనింగ్సే బ్రహ్మాండంగా ఉన్నాయని, సినిమా బాగుందనే టాక్ వచ్చిందని నాగార్జున ఓయ్ హీరోతో చెప్పినట్లు సిద్ధార్థ అన్నాడు. ఇక "ఓయ్" చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు.సిద్ధార్ధ అనుకున్నటే మంచి ఒపేనింగ్స్ తో పాటు సినిమా హిట్ అనే టాక్ ఇప్పటికే వచ్చింది కొంచెం ఇష్టం కొంచం కష్టం తో ఫాంలో ఉన్న సిద్దర్ద్ ఈ సినిమా తో మరో హిట్ కొట్టడు చిన్నప్పుడే అందరికి తెలిసిన షామిలి హీరోయిన్ గా పరిచమయిన షామిలి మొదటి సినిమానే మంచి బ్యానర్ హీరో తో పాటు హిట్కూడ అయి మంచి పేరు తెచ్చిపెట్టింది


కోడలు కన్న వెనకబడ్డ అమితాబ్ బచ్చన్

తన నటనతో బాలీవుడ్‌ను శాసించిన ఐశ్వర్యరాయ్ హాలీవుడ్‌లోను తన సత్తా చాటుతోంది. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన సర్వేలో ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ ఖాన్‌లను పక్కనబెట్టి అంతర్జాతీయ సినీ ప్రపంచంలో తన స్థానాన్ని చాటుకుంది. ఫోర్బ్స్ పత్రిక నిర్వహించిన ఈ సర్వేలో మనదేశానికి చెందిన వారు ఆరుగురు ఎంపిక కాగా అందులో ఐశ్వర్య ఒక్కరే అభినేత్రి కావడం విశేషం. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1411 మంది నటులకు వినోద పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ జాబితాలో ఐశ్వర్య (387) స్థానంలో నిలిచింది. బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్ (540), షారుక్‌ఖాన్ (735), సల్మాన్‌ఖాన్ (753), ఇర్ఫాన్‌ఖాన్ (825), హృతిక్‌రోషన్(1059)లకు ఇందులో స్థానం దక్కింది. ఈ జాబితాలో హాలీవుడ్ మెగాస్టార్ విల్‌స్మిత్ మొదటి స్థానం దక్కించుకున్నారు. జానీడెప్, బ్రాడ్‌పిట్, లియనార్డో డికాప్రియో, ఎంజెలినా జోలీ రెండో స్థానంలో ఉన్నారు.


"పులి"పవన్ చిత్రంలో లండన్ మోడల్



'పులి' పులిలా ఉంటాడు. పవన్‌ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్‌ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్‌.జె సూర్య.అలాగే ''నేనూ, పవన్‌ కల్యాణ్‌ మరో సినిమా చేస్తున్నామంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలను. వాటిని తప్పకుండా అందుకుంటాం. ఎడిటింగ్‌ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడే అభిమానుల ఏయే అంశాలకు బాగా స్పందిస్తారో ముందుగానే వూహించుకుంటున్నాను...అందుకు అనుగుణం గానే ప్లాన్ చేస్తున్నాము అంటున్నారు ఆయన. ఇక ఈ చిత్రం లో పవన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.

పవన్‌ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండగా లండన్‌కు చెందిన మోడల్‌ నికిష ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమతోంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, పవన్‌ తండ్రిగా భానుచందర్‌ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయినీ ఈ చిత్రం యూనిట్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రాని ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.ఇవన్ని ఇలా ఉందగా ఆంద్రలో పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఉంటుందనే భావన అందరిలోను ఉంది ఆంద్ర ప్రేక్షకులు మంచి సినిమాలు ఆదరిస్తారు ఎంతటి పెద్ద హీరో అయిన స్టొరి లేక పోతే ఫ్ల్లప్ అయి తీరుతుంది దాని దౄష్టిలో ఉంచుకొని అందరికి నచ్చే విధంగా తీస్తునం అని యస్.జె.సూర్య చెప్పుకొచ్చారు యస్‌.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘కొమరం పులి’ చిత్రం హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్‌ మొదటివారం నుంచి సినీ సంగీత 'పులి' పులిలా ఉంటాడు. పవన్‌ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్‌ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్‌.జె సూర్య.అలాగే ''నేనూ, పవన్‌ కల్యాణ్‌ మరో సినిమా చేస్తున్నామంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోగలను. వాటిని తప్పకుండా అందుకుంటాం. ఎడిటింగ్‌ థియేటర్లో కూర్చుని చూస్తున్నప్పుడే అభిమానుల ఏయే అంశాలకు బాగా స్పందిస్తారో ముందుగానే వూహించుకుంటున్నాను...అందుకు అనుగుణం గానే ప్లాన్ చేస్తున్నాము అంటున్నారు ఆయన. ఇక ఈ చిత్రం లో పవన్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. పవన్‌ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండగా లండన్‌కు చెందిన మోడల్‌ నికిష ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమతోంది. ఈ చిత్రానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, పవన్‌ తండ్రిగా భానుచందర్‌ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయినీ ఈ చిత్రం యూనిట్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రాని ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.మనోజ్ బాజ్ పాయ్, చరణ్ రాజ్, జ్యోతికృష్ణ, శరణ్య, బ్రహ్మాజీ, ఆలీ, కోవై సరళ, విఎంసి హనీఫా, గిరీష్ కర్నాడ్ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. యస్‌.జె.సూర్య దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘కొమరం పులి’ చిత్రం హైద్రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కనకరత్న మూవీస్‌ పతాకంపై శింగనమల రమేష్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్‌ మొదటివారం నుంచి సినీ సంగీత ప్రియులను అలరించనుంది దీపావళికి రిలీజ్ అవుతున్న ఈ టపాసు తుస్సు మంటుందో సూపర్ హిట్గా పేలుతుందో వేచి చూడాల్సిందే

కిరణాలలో అల్లరి "నరేష్"


అల్లరితో సినిరంగ ప్రవేశం చేసిన అల్లరి నరేష్ హీరోగా ఉషాకిరణ్ మూవీస్ వారు ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో "ఓ చిన్న దాన" వంటి కామెడీ సినిమ తీసిన ఇ. సత్తి బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇంతక ముందు ఇ.సత్తి బాబు నరేష్ తో నేను చిత్రాన్ని తీసి ఉన్నాడు. అయితే ఆ ఫిలిం బాక్స్ ఆఫీసు వద్ద రివర్స్ అవటంతో ఆ కాంబినేషన్ మళ్ళి రిపీట్ కాలేదు. అయితే నచ్చావులే తో మళ్ళి సక్సెస్ బాట లోకి వచ్చిన ఉషా కిరణ్ వారు వరస గా చిన్న సినిమా నిర్మాణం ప్రారంభించటం కలిసివచ్చింది. వారు ప్రస్తుతం కామెడి దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరక్షన్ లో ఓ చిత్రం అంతా కొత్త వారితో చేస్తున్నారు. ప్రస్తుతం నరేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇవివి సత్యనారాయణ దర్శకుడిగా డి.రామానాయుడు నిర్మిస్తున్న 'బెండు అప్పారావు'..ఆర్ఎంపి చిత్రం నిర్మాణంలో ఉంది. అనంతరం ముళ్ళపూడి వీరభద్ర చౌదరి అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో ఓ చిత్రం కమిట్ అయ్యాడు ఇప్పటి వరకు అల్లరి,కామెడితో,నేను సినిమాలో తన నటన విభిన్నతతో అలరించిన నరేష్ ఇప్పుడు మరో కొత్త పంధతో ఉషా కిరణ్ వారి బ్యానర్పై మరో సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు అంతక ముందే బెండు తీయడానికి వస్తున్న నరెష్ మరో సినిమాతో బిజీగా ఉన్నాడు పెద్ద హీరోలు ఒక్క సినిమా తీయడానికే ఆలోచిస్తుంటే నరేష్ మాత్రం సినిమ మీద సినిమా తో అలరిద్దమనుకుంటున్నాడు

7/9/09

గోపి గోపిక గోదావరి (వంశి) స్టోరి లైన్



వేణు, కమలినీ ముఖర్జీ జంటగా ప్రముఖ దర్శకుడు వంశీ రూపొందించిన చిత్రం 'గోపి గోపిక గోదావరి'. గోదావరి నేపద్యం లో తయారైన ఈ చిత్రం రేపే (ఈ నెల 10న) విడుదలవుతోంది. అలాగే ఈ చిత్రం కథపై బయిట రకరకాల కథనాలు వినపడుతున్నాయి. వాటి ప్రకారం కమిలినీ ముఖర్జీ గోదావరిలో మొబైల్ హాస్పటిల్ ని నడుపుతూంటుంది. అక్కడ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి వచ్చిన వేణుని ఆమె చికిత్స చేసి వైద్యం చేస్తుంది. తెలుస్తోంది. అయితే అతను ఈ ప్రమాదంలో తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటాడు. ఆ తర్వాత అతను కమిలినీతో ప్రేమలో పడతాడు. అయితే అంతకు ముందే అతనికి సిటీలో ఓ ప్రేమ కథ ఉంటుంది. ఈ రెండింటి మధ్యా ఏం జరుగుతుందనేది కథ అంటునన్నారు.చూడడం రేపు ఇదో కాదో తేలి పోతుంది కదా.

వరుడు సినిమా రెండో హీరోయిన్




మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో రెడీ అవుతున్న వరుడు చిత్రానికి సెకండ్ హీరోయిన్‌ సమస్య తీరలేదు మొదట్లో ఈ పాత్రకు పార్వతి మిల్టన్ ని అనుకున్నారు. అయితే అనుకోని పరిణామాల వల్ల ఆమెనే తోలిగించటం జరిగింది. అప్పట నుంచి సెకండ్ హీరోయిన్ కోసం వేట కోన సాగుతూనే ఉంది. కాని కాస్త పేరున్న హీరోయిన్ లు ఎవరూ ముందుకు రావటం లేదు. డేట్ లు ఖాళి లేవని రెజెక్ట్ చేస్తున్నారు. దానికి కారణం కమిళిని ముఖర్జీ కెరీర్ అని విశ్లేషిస్తున్నారు. కమిలిని ఇలాగే జల్సా సినిమాలో పెద్ద హీరో అని మోజుపడి నటించిదని అయితే అప్పటి నించి ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్ రాలేదని వివరిస్తున్నారు. అయితే ఆ పాత్ర చిన్నది..పైగా ఆమెకు అంటీ లుక్ రావడంతో ఆ తర్వాత కమలినికి పెద్దగా ఆఫర్లు రావట్లేలేదని అన్నారు. అయినా వరుడు సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువని, అందుకే పేరున్న హీరోయిన్లు ఇందులో నటించేందుకు ముందుకు రావటం లేదని ఫిలిం సర్కిల్ లలో చెప్పుకోవడం పెద్ద హీరో పెద్ద సమస్యగా మారింది. తమన్నా కుడా ఈ పాత్రని రెజెక్ట్ చేయటానికి కారణం అదే నని అప్పట్లో వినిపించింది. ఇక ఈ చిత్రం లో అనుష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.అదే రెండో కారణం కావచ్చు హీరోయిన్లు రాకపోవడానికి కారణం మొదటి హీరోయిన్ గా ఆమెకు పేరు వచ్చి తమకు రెండో హీరోయిన్ గా ముద్ర పడుతుందని భయపడుతున్నారు

ఒయ్ చిత్రం రివ్యు- గీతాంజలి ఇన్స్పిరేషన్


చిత్రం చూస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకువస్తుంది. ఆ చిత్రమే లవ్‌స్టోరీపేరుతో వచ్చింది. దానికి కాస్త మెరుగులు దిద్ది "ఓయ్" అనే పేరుపెట్టినట్లుంది. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు కూడా సరిపోయేవిధంగా పెట్టారు. ఉదయించే సూర్యుడు హీరో, అస్తమించే అమ్మాయి సంధ్య. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? అనేది సినిమా. ఇక కథలోకి వెళితే.. ఉదయ్ (సిద్ధార్థ) ఓ ఉన్నత వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలు వైవిధ్యమే. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వ్డ్ మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా. విశ్లేషణ: ముందుగా షామిలీ గురించి చెప్పుకోవాలి. "జగదేకవీరుడు అతిలోక సుందరి"లో నటించిన షామిలీకి యుక్తవయస్సు వచ్చిన షామిలీకి చాలా తేడా ఉంది. ఈనాటి హీరోయిన్ల తరహాలోకాకుండా సాంప్రదాయంగా వచ్చే పాత్రలకు ఆమె సూటవుతుంది. పాత్రపరంగా వ్యాధి ఉన్నది కాబట్టి దానికి చక్కగా సరితూగింది. నటనాపరంగా బాగానే చేసింది. ఆమెకు మించి సిద్ధార్థ నటనలో రాణించాడు. మణిరత్నం శిష్యుడు నుంచి హీరోగా ఎదిగిన సిద్ధార్థ ఒక్కో చిత్రంలో తన నటనను అద్భుతంగా ప్రదర్శిస్తుంటాడు. మొదటిభాగమంతా అల్లరి అల్లరిగా ఉండే సిద్ధార్థ సెకండాఫ్‌లో కాస్త భిన్నంగా కనిపిస్తాడు. ఆ పాత్ర తీరు బాగుంది. వ్డ్ ఇక రావికొండలరావు, రాధాకుమారి జంట కాస్త చికాకు తెప్పిస్తుంది. సునీల్ కామెడీ ఆకట్టుకుంది. అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలో సురేఖావాణి, భరణి నటించారు. సాంకేతికపరంగా చక్రవర్తి పనితం ప్రతిఫేమ్‌లో చక్కగా కన్పించింది. మణిరత్నం శిష్యుడుగా దర్శకుడు ఆనంద్ ఆయన బాటలో పయనిస్తున్నాడు. ఎడిటింగ్‌లో కాస్త జాగ్రత్త తీసుకుంటే సెకండాఫ్ ఎక్కువగా అనిపించేది కాదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సిద్ధార్థ డైరక్షన్‌లో ఇన్‌వాల్వ్ అయినట్లు కన్పిస్తోంది. ఆల్‌రెడీ గతంలో చుక్కల్లో చంద్రుడు చిత్రానికి దర్శకత్వంలో సిద్ధార్థ ఇన్‌వాల్వ్ కావడంతో ఆ చిత్రాన్ని కాస్త చెడగొట్టాడనే పేరుంది. ఈ నేపథ్యంలో "ఓయ్" చిత్రం మొదటి భాగంలో ఆ ఛాయలు కన్పిస్తాయి. సంభాషణల పరంగా బోర్‌గా లేకుండా ఉన్నాయి. షామిలీ తొలి చిత్రం కావడంతో, సిద్ధార్థ హీరో కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. చూసిన ప్రేక్షకుడు మాత్రం కాస్త నిరాశకు గురవుతాడు. మరి "ఓయ్" ఎంతకాలం ఆడుతుందో వేచి చూడాల్సిందే..!.

7/8/09

బాలయ్య బాబుకు పేజ్ త్రీ అవమానం

ఈ విషయం ఒక ప్రముఖ పత్రికలో విలెకరిగా పనిచెస్తున్న నా మిత్రుడి ద్వారా నాకు తెలిసింది
డెక్కన్ చార్జర్స్ విజయాన్ని పురస్కరించుకుని( 6-7-2009) హైదరాబాద్ లో బ్రహ్మాండమైన పార్టీ జరిగింది. దీనికి వివిధ రంగాలకు చెందిన 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. హీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గర్వంగా ఒక చోట కూర్చుని ఉండకుండా అందరితో కలిసిపోడానికి ఆయన ప్రయత్నించారు. హై సొసైటీ పేజ్ త్రీ యువతి ఒకరు "మిమ్మల్ని గతంలో చూడలేదు, ఈ సిటీకి కొత్తా" అని అడిగింది. దానితో బాలకృష్ణకు కొంత సేపు మాటలు నట్లు పడ్డాయి. "నా పేరు బాలకృష్ణ. టాలీవుడ్ యాక్టర్ ని.ఎన్టీఆర్ కుమారుడిని" అని ఇంగ్లీషులో చెప్పుకోవలసి వచ్చింది. హిందీ, ఇంగ్లీషు సినిమాలు మాత్రమే చూసే వారికి తాను తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదనుకుని సరిపెట్టుకున్న బాలయ్య మరో యువతి వద్దకు వెళ్ళారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె రేఖాజైన్. "మీరు నాకు తెలుసు" అని ఆమె హిందీలో చెప్పింది. డ్యాన్స్ చేసుకుందామా అని బాలయ్య ఆహ్వానించగా "నేను నా భర్తతో మాత్రమే డ్యాన్స్ చేస్తాను"
అని చెప్పింది. రాంగ్ నెంబర్ కు కాల చేశాననుకుంటూ బాలకృష్ణ మళ్ళీ బార్ రూమ్ కు బయలుదేరారట.




యురప్ లో మగధీరుడు





తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెగామూవీని అత్యధిక ప్రింట్లతో ప్రపంచమంతటా జూలై నాలుగోవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని "నాకోసం నువ్వు.. అని సాగే పాటను రామ్‌చరణ్, కాజల్‌పై యూరప్‌లో ఈ నెల 7వ తేదీ నుండి చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో మగధీర షూటింగ్ పూర్తవుతుంది
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సౄష్టిస్తోంది



జగన్ వ్యాపారాలలో యువసామ్రాట్ పెట్టుబడులు

ఎన్నికల ముందు నాగార్జున కాంగ్రెస్ కు అనుకూలంగా యాడ్స్ లో నటించారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ పథకాలను ఆకాశానికి ఎత్తేశారు. తండ్రి తెలుగుదేశం పక్షపాతి అయినా నాగార్జున మాత్రం మళ్ళీ అధికారంలోకి రానున్న పార్టీ కాంగ్రెసేనని ముందే తన దివ్య దృష్టితో కనిపెట్టారు. అదే ఆయనకు ఇప్పుడు కలిసోచ్చింది. నాగార్జునకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. పైగా ఆయనది బిజినెస్ లో గోల్డెన్ హ్యాండ్ అన్న పేరుంది. కోకాపేట, గచ్చిబౌలిలో ఆయనకు బినామీ పేర్లతో ఎకరాల కొద్దీ భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఎకరం వేలల్లో కొనుక్కుంటే ఇప్పుడు ఒక్క ఎకరమే కోట్ల విలువ చేస్తుంది.

ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ వ్యాపార సామ్రాజ్యంలో కొంత వాటా నాగార్జునకు ఉందని తాజా సమాచారం. మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జగన్ త్వరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నారు. పాత వ్యాపారాల్లోనే కాక కొత్త వెంచర్లలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ ది గోల్డెన్ లెగ్గే, నాగార్జునది గోల్డెన్ హ్యాండే. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో...........




Powered by web analytics software.