
అల్లు అర్జున్ పై కామెంట్స్ చాలానే వున్నాయి. వారితో సినిమా చేసిన నూతన కదానాయికలకు ఆ తర్వాత సరైన అవకాశాలు రావనేది ఆ కామెంట్ సారాంశం. అల్లు అర్జున్ కైతే వరస బెట్టి గంగోత్రి తో పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో పరిచయమైన అనురాధా మెహతా, బన్ని తో పరిచయమైన గౌరీ ముంజాల్, వరుడు తో పరిచయమైన భాను శ్రీ మెహ్రల కెరీర్ లే ఇందుకు నిదర్శనాలు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పై వున్న ఆ అపనిందను అర్జున్ తో ‘వేదం’ చిత్రంలో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ తొలిగించారు. ఎందుకంటె వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేథ్ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో చాన్స్ కొట్టేసి సినిమా సక్సెస్ తో మంచి మార్కులే కొట్టేస్తోంది. తర్వాత గోపీచంద్ సరసన నటిస్తోన్న సంగతి విదితమే. ఇలా వరుస విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర కధానాయికగా ఎదుగుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా భాసిల్లుతున్నారు.