
మంచు లక్ష్మీ ప్రసన్న ని రాకేష్ రోషన్ తన క్రిష్ చిత్రం సీక్వెల్ లో తీసుకుంటున్నట్లు అన్ని చోట్లా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడది రూమర్ అని తేలిపోయింది. హృతిక్ రోషన్ సరసన చేయటానకి ఆమెను సంప్రదించాడని, రాకేష్ రోషన్...అనగనగా ఓ ధీరుడు చిత్రం చూసాడని వినపడిందంతా అబద్దమని తేలింది. అదెలా అంటే ఈ విషయాన్ని ఓ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళకున్న ముంబై పరిచయాలతో రాకేష్ రోషన్ ని సంప్రదించి అడిగారు. దానికి రాకేష్ రోషన్ ఆమె గురించి వినడం ఇదే తొలిసారి అన్నారు ఆశ్చర్యపోతూ. ఆమెను నేను ఎప్పుడూ కలవలేదు. వినలేదు..ఇదే మొదటిసారి ఆమె పేరు వినటం అన్నారు.ఇంతకీ లక్ష్మీ ప్రసన్న ఎవరు..సర్లేగాని నా సినిమాలో ప్రియాంక చోప్రాని తీసుకుందామనుకుంటున్నాను. అది కూడా చర్చలు దశలో ఉంది అని తేల్చేసారు. దాంతో తన క్రేజ్ పెంచుకోవటానికి లక్ష్మి ఈ రూమర్ క్రియోట్ చేసుకుందా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదీ మ్యాటర్.