Free SMS And Earn Part Time Money







7/24/09

రజనీకాంత్ జీవిత విశేషాల 'తలైవర్'

సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత విశేషాలను తెలియజేస్తూ 'తలైవర్' పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందింది. రజనీ వీరాభిమాని కవిన్ కార్తీక్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీని రజనీ స్వయంగా చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో రిలీజ్ చేశారు.

రజనీ తొలినాళ్లలో బెంగుళూరులో బస్ కండక్టర్ గా పనిచేసినప్పటి నుంచి...సూపర్ స్టార్ డమ్ ను కైవసం చేసుకున్నంతవరకూ ఆయన జీవితంలోని కీలక దశలను ఆవిష్కరిస్తూ ఈ డాక్యుమెంటరీ రూపొందింది. డాక్యుమెంటరీ ఆలోచన రాగానే కార్తీక్ నేరుగా రజనీని కలుసుకుని ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశారు.కొంత కీలక సమాచారాన్ని ఆయన వద్ద నుంచి సేకరించారు. రజనీ జీవిత విశేషాలతో పాటు ఆయన సన్నిహిత మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు ఛో రామస్వామి ఇంటర్వ్యూ కూడా ఇందులో చోటుచేసుకుంది. ఈ ముఖాముఖీలో రజనీ రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ముచ్చటించారు. మరో నెలలో ఈ డాక్యుమెంటరీ డివిడి రూపంలో మార్కెట్ లోకి రానుంది.



7/23/09

మగదీర " కాజల్ కబుర్లు "

మగధీర చిత్రంలో హీరోయిన్ కాజల్ ని రామ్ చరణ్ ఛేజ్ చేసే సన్నివేశం బాగా వచ్చింది.ఆమె సిటీ బస్సులో వెళ్తూంటే రామ్ చరణ్ గుర్రంపై వెంబడిస్తూంటాడు. బిజీ ట్రాఫిక్ లో హైదరాబాద్ రోడ్లపై ఈ సీన్ జరుగుతుంది. చరణ్ ఆ ట్రాఫిక్ లోనే ఆమెను ఛేజ్ చేస్తూంటాడు. కథా పరంగా రామ్ చరణ్ కి అప్పుడే.తాను ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న అమ్మాయి కాజల్ అని తెలుస్తుంది.దాంతో ఆ ఎమోషన్ ని కంటిన్యూ చేస్తూ దగ్గరలో ఉన్న గుర్రంపై ఆ స్వారీ మొదలెడతాడు. ఆ సన్నివేశం చాలా ఫన్నీగా ఉంటుంది. ట్రాఫిక్ లో అంతా విచిత్రంగా చూస్తూంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ సన్నివేశం చిత్రీకరించారు...అంటూ చెప్పుకొచ్చింది కాజల్. మగధీరలో తనకు నచ్చిన సన్నివేశంగా ఈ సన్నివేశం వివరించింది.
ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ చిత్రంలో ఫస్ట్ ఆఫ్ కాజల్ ఫ్యాషన్ డిజైనర్ గానూ,సెకండ్ ఆఫ్ రాకుమార్తెగాను కనిపించి కనువిందు చేయనుంది. అలాగే ఈ చిత్రంలో తాను నటించటం తన అదృష్టంగా భావిస్తున్నానంటోంది. రోజకు పధ్నాలుగు గంటలు చొప్పున పనిచేయాల్సి వచ్చిందంటోంది. అలాగే ధీర..ధీర..మగధీర అనే పాటలో క్లాసికల్ డాన్సర్ గా కనపడటం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసానని చెప్తోంది. అంతేగాక ప్రిన్సెస్ గా నటించటానికి నేను నా బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తోంది. బలమైన భావోద్వేగాలు ఉన్న సన్నివేశాలు ఉండటంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. కేవలం కళ్ళతోనే కొన్ని ఎమోషన్స్ పలకాల్సి వచ్చేది. అందుకోసం నేను ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసేదాన్ని. రాజకపూర్, నర్గీస్ నటించిన చిత్రాలు చూసి వారి మధ్య కెమిస్ట్రీ తెరపై పండటానికి కారణాలు పరిశీలించేదాన్ని. అలాగే మేకప్ కోసం రోజుకు రెండు గంటలు పట్టేది. ఈ రోజు నాలుగు వందల ఏళ్ళ సన్నివేశం చేస్తే మరుసటి రోజు కాలేజి అమ్మాయిగా ఈ కాలం సీన్ చెయ్యాల్సి వచ్చేది అంటూ తన అనుభవాలును కాజల్ గుర్తు చేసుకుంది.


7/22/09

"మల్లన్న" ఆగస్టు 15న రిలీజ్



విక్రమ్,శ్రియ కాంబినేషన్లో రెడీ అయిన మల్లన్న చిత్రం ఆగస్టు 15న రిలీజ్ చేయటానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం కలైపులి ధాను భారీ సాంకేతిక విలువలతో జోడించారు. దాదాపు తొమ్మది వందల ధియోటర్లలలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. సుశీగణేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మల్లన్న డేట్ ప్రకటించటంతో మిగతా ఆగస్టు నెలలో రిలీజ్ చేద్దామనుకున్న తమిళ,తెలుగు చిత్రాలు కొన్ని ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉంది.ఆగష్ఠు నెల మాత్రం పెద్ద సినిమాలతో ప్రేక్షకులని అలరించబోనుంది ఒక పక్క మెగాతనయుడి "మగధీర" వెనువెంటనే నాగ్ తనయుడి "జొష్" భారీ అంచనాలతో ఒకరి తరువాత ఒకరు పోటిపడుతున్న నెల వరుసగ మూడు గ్రహణాలతో భారీ ప్రమాదలు ఏర్పడతాయని అంచనాలు వేస్తే అన్ని తిరగబడి ప్రశాంతంగా ముగిసిపోయింది ఈ సినిమాల పరిస్తితి ఏంటో రీలిజ్ తరువాత చూడల్సిందే

సాక్షి ఎబౌట్ నాగ చైతన్య

మొత్తం చదవడానికి ఇమెజ్ క్లిక్ చెయ్యండి


దిల్ రాజుపైనా నిషేధం

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుపై కూడా ఫిలిం ఛాంబర్ నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన తాజాగా నిర్మిస్తున్న జోష్ చిత్రం విషయంలో ఈ నిర్ణయం ఫిలిం ఛాంబర్ ఆగ్రహంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్ర పబ్లిసిటీ నిమిత్తం ఛానెల్స్ లో వేసే ప్రొమోలు రేట్లు విషయంలో ఫిలిం ఛాంబర్ ఇటీవలే మాటీవీ, జెమినీ, ఈటీవీ వంటి కొన్ని ఛానెల్స్‌కి సహకరించరాదనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దిల్ రాజు ఈ ఆంక్షలను ఉల్లంఘించి తన జోష్ చిత్రం ఆడియో ఫంక్షన్ లైవ్‌ని మా టీవీకి ఇచ్చారు. దీంతో దిల్‌ రాజు తీరుపై ఛాంబర్ వారు గుర్రుగా ఉన్నారు. అంతేగాక దిల్ రాజు తమ జోష్ ప్రొమోలు సైతం ఆ ఛానెల్‌కు మాత్రమే పబ్లిసిటీకి ఇచ్చారు. దాంతో వారు మరింత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన మగధీర ఆడియో పంక్షన్ కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మా టీవీలో లైవ్ ఇచ్చారు. అటు అల్లు అరవింద్, ఇటు దిల్‌ రాజు ఇద్దిరిపై ఏక కాలంలో ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోవచ్చిన తెలుస్తోంది.




7/19/09

శివ రీమెక్ లో నాగర్జున తనయుడు



నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్‌ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని వెంకట్‌ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఈ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది.

మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్‌'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డ్ హ్యాండ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపట్టా
రు





'శంకరాభరణం', 'శృతిలయలు' లా తీద్దామనుకుని కలవరపడ్డారు



'శంకరాభరణం', 'శృతిలయలు' వంటి సినిమాలు తీసే రోజులా ఇవి?(ఒకవేళ తీసినా ఆ స్థాయి సంగీతం సపొర్ట్ లేకుండా......) కావనుకునే కళాతపస్వి కె.విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లడం మానేశారు. 'రాధాగోపాళం', 'సుందరాకాండ' వంటి చేదు అనుభవాలు బాపూకి కూడా తప్పలేదు. విశ్వనాథ్ సినిమాలా తన తాజా చిత్రం ఉందని అనిపిస్తే అందుకు గర్విస్తానని దర్శకుడు సతీష్ కాసెట్టి ముందే చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథ్ తీసిన నాలుగైదు సినిమాల ఇన్ ఫ్లుయెన్స్ సతీష్ తీసిన 'కలవరమేయే మదిలో' చిత్రంపై కనిపిస్తుంది. అనాటి కళాఖండాలను గుర్తుచేసే ప్రయత్నం పొరపాటు కాదు. అయితే అలాంటి 'మిక్సింగ్'తో సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. ఇవాల్టి యువతరం నాడిని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే పనితనం, సన్నివేశాల బలం వంటివి అనివార్యం. వీటికి కనెక్టివిటీగా వినోదం అనేది కూడా తగిన మోతాదులో ఉండాలి. ఉదాహరణకు కథానాయిక హీరో మహేష్ వీరాభిమాని అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపి వినోదాల పంట పండించిన 'అష్టాచమ్మ'ను చెప్పుకోవచ్చు. అందులో కథానాయిక స్వాతి చేసిన అల్లరి సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లింది. అదే స్వాతి ఇప్పుడు 'కలవరమాయే మదిలో' అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అలాంటి స్పాంటేనియస్ అల్లరి, చిలిపిదనాన్నే ఆశించడం సహజం. ఆరంభంలో స్వాతి తనను తాను పరిచయం చేసుకుంటూ తన ఆశలు, ఆశయాలు గడగడా చెప్పేస్తుంటే...ఇంకేం...బోలెడంత ఎంటర్ టైన్ ఇందులోనూ ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కొంతసేపు అలాంటి నడకే నడిచినా ఆ తర్వాత స్వాతి ఒకదాని వెంట మరో కష్టాల కలవరంతో అల్లల్లాడుతుంది. ఆ కష్టాలు చూసి అనుకొన్నదొకటి..అయినది మరొకటి అనే 'కలవర' పాటు వీక్షకులకూ సో(పా)కుతుంది. శ్రేయ (స్వాతి) తన తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)తో కలిసి ఉంటూ ఓ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. శ్రేయకు పాడటం అంటే ప్రాణం. ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ లో తాను పాడాలనేది ఆమె డ్రీమ్. అయితే శ్రేయ తల్లికి మాత్రం శ్రేయ సింగర్ కావాలనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది లెండి. అమ్మ కోసం జాబ్ చేస్తూ డబ్బుల సంపాదన కోసం ఓ స్టార్ హోటల్ లో శ్రేయ పాటలు పాడుతుంటుంది. లండన్ తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీను (కమల్ కామరాజు) ప్రతిరోజూ ఆ హోటల్ లో శ్రేయ పాట వింటుంటాడు. అందరూ చప్పట్లు కొట్టినా అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంటాడు. ఇది శ్రేయకు నచ్చదు. అతనితోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. శ్రేయ ఆశయానికి అతను ప్రోత్సాహం అందిస్తుంటాడు. సంగీత విద్యాంసుడైన రావు (విక్రమ్ గోఖలే) ఒకరోజు తన సహచరుడైన శాస్త్రితో (తనికెళ్ల భరణి) కలిసి ఆ హోటల్ కు వచ్చి శ్రేయ పాట వింటాడు. ఆగ్రహంతో ఊగిపోతూ 'నువ్వు పాడేది కూడా ఓ పాటేనా?' అని గద్దిస్తాడు. దీంతో శ్రేయ చిన్నబోతుంది. తనకు పాడటమే రాదన్న రావు వద్దే సంగీతం నేర్చుకోవాలని శ్రేయ నిశ్చయించుకుంటుంది. అయితే ఆమె కోరికను రావు తోసిపుచ్చుతాడు. సంగీతం నేర్పేదిలేదంటాడు. శాస్త్రిని మంచి చేసుకుని పనిపిల్లగా రావు ఇంట్లోకి శ్రేయ అడుగుపెడుతుంది. ఒకవైపు శాస్త్రిని ఒప్పించేందుకు పడేపాట్లు, మరోవైపు శ్రీనును ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంటుంది. షడన్ గా స్టోరీలో ఓ ఊహించని 'మలుపు' చోటుచేసుకుంటుంది. ఇక స్టోరీ ట్రాక్ మారుతుంది. శ్రేయను కలవర పరచిన ఆ ట్విస్ట్ ఏమిటి? రెహ్మాన్ కంపోజిషన్ లో పాడాలనే శ్రియ డ్రీమ్ ఎలా నెరవేరిందనేది మిగతా కథ.



మంచుమనోజ్ ప్రయాణం ఎంతవరకో యస్.యం.యస్,చేయండి56006767కి

మంచు మనోజ్కుమార్ హీరోగా కథకుడు వీరు పోట్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుంకర రామబ్రహ్మం ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాతో షీనా హీరోయిన్గా పరిచయవుతోంది. చిత్రం ప్రోగ్రెస్ను నిర్మాత వివరిస్తూ 'ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తయింది
.
మనోజ్ కుమార్ తన నిజ జీవితంలో లాగా సరదగా, చలాకీగా ఉండే కుర్రాడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు,వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ చిత్రానికి (ఎ) అజయ్ గాడి విజయగాథ, (బి) బిందాస్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు టైటిల్స్ లో ప్రేక్షకులు దేనికి ఎక్కువ ఓటేస్తే ఆ టైటిల్ ఖరారు చేస్తారట. ఇందుకోసం ఎ కానీ బి కానీ టైప్ చేసి 56006767 నెంబర్ కు ఎస్.ఎం.ఎస్.చేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తారు. యూత్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రుపొందుతోంది.మనోజ్ దర్శకుల హీరో అనీ వీరుపోట్లఅతనితో చేసిన ప్రతి దర్శకుదు తెగ పొగుడుతున్నారు.ఈ సినిమాలో మనోజ్ పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉండబోతోంది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వీరుపోట్ల అందిస్తున్నారు, భవనచంద్ర పాటలు, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, బోబో శశి సంగీతం అందిస్తున్నారు.ప్రయాణంతో మంచి హిట్ వస్తుందీనుకున్న రాలేదు మరి ఈ సినిమా ప్రయాణం ఎంతవరకో చూసిన తరువాతగాని చెప్పలేం.

7/18/09

జొష్ ఆడియో ఫంక్షన్లొ వెంకి, బాలయ్యబాబు, మోహన్ బాబు సెటైర్లు



నిన్న నాగ చైతన్య జొష్ ఆడియో ఫంక్షన్ చూసాను చాల బాగ జరిగింది సినీ రంగానికి చెందిన దిగ్గజాలు అక్కినేని,రామానాయుడు , స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా అతిరధ మహరధులనదగ్గ సినీ ప్రముఖులు హాజరయ్యరు ఇక ఈ ఫంక్షన్ కి హైలెట్స్

మోహన్ బాబు : అక్కినేని గొప్పతనం చెబుతు మద్యలో అరుస్తున్న అభిమానులని ఉద్దేశించి "సైలెన్స్ ...మన అభిమానులు డిసిప్లైన్ ఉన్నవాళ్ళు మిగతా వారిలా సంస్కారం లేని వారు కాదు " (మద్యలో ఈ మిగతా వారేవరు .....ఇంకెవరు మన ....) మద్యలో నాగర్జున వచ్చి జాగ్రత్త అని నవ్వుతూ చెప్పివెళ్లాడు "ఎంటయ్యా మద్యలో వస్తావ్ అని మోహన్ బాబు జవాబిచ్చాడు

బాలకృష్ణ : ఎప్పటి లాగే తనదైన స్టైల్ లో "మా నాన్న గారు ......ఆ రొజుల్లొ .............బాబాయ్ అక్కినేని గారితో బాటు పైనున్న మా నాన్న గారి ఆశీస్సులు కూడా చైతన్యకి వుండాలి అంటు కొంత సేపు సాగదీస్తు వెరైటీగా ప్రసంగించారు

వెంకటేష్ : ఒక కింగ్ ఒక శివ తో బాటు ఒక చంటి లాంటి వాడు కలిస్తే ఎలా వుంటాదో అలా వుంటాడు చైతు


నాగేశ్వర రావు గారికి వయసు మీద పడటం వలన కొంచం చాదస్తం పెరిగినట్టుంది హెడ్మాస్టర్లా.... సైలెన్స్ సైలెన్స్ అంటు ప్రేక్షకులని గదిమారు ......



"జోష్" చిత్రం మగదీరను మించునా

Naga Chaitanya
నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న "జోష్" చిత్రం అనేక ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది.
  • చైతన్యకి జోడీగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాథ కూతురు కార్తీక కథానాయకగా పరిచయమవుతోంది.
  • అరుంధతి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అనూష్క, స్నేహ ఉల్లాల్ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్స్ చేయనున్నారు.
  • అంతేగాక మిస్ ఫెమీన్ రన్నరప్ శ్రియ కూడా హీరోయిన్ ప్రెండ్ గా కనిపిస్తోంది.
  • వీటిన్నటికీ తోడు ఆర్య,బొమ్మరిల్లు, భధ్ర చిత్రాలకు స్క్రిప్టు వర్క్ చేసిన వాసు వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.
  • అంతేగాక నాగార్జున నటించిన నిన్నేపెళ్ళాడతా, సూపర్ చిత్రాలకు సంగీతం అందించిన సందీప్ చౌతా జోష్ కి సంగీతం అందిస్తున్నాడు.
  • ఇక ప్రకాష్ రాజ్ ఓ ముఖ్యపాత్ర చేస్తూండగా, జె.డి చక్రవర్తి నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
  • ఇక నాగార్జున కెరీర్ మలుపు తిప్పిన శివను గుర్తు చేసేలా కాలేజీ బ్యాక్ డ్రాప్ ఈ చిత్రంకు మరో ఆకర్షణ.
  • వీటిన్నటికీ తోడు వరస విజయాలరాజు దిల్ రాజు నిర్మాత ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న గానీ, 28న గానీ రిలీజ్.


7/17/09

చిరంజీవి,మగధీర బంగారు కోడిపెట్ట ట్రైలర్

మగధీర బంగారు కోడిపెట్ట ట్రైలర్



చిరంజీవి కోడిపెట్ట



మగధీర,చిరంజీవి రెండు బంగారు కోడిపెట్టలని పోల్చిచూడండి ఎవరు బాగచేశారో ఓట్ వేయండి




నటసార్వబౌమ యస్.వి.రంగారావు వర్దంతి [Great Actor]

నటసార్వబౌమ యస్.వి.రంగారావు వర్దంతి సందర్బంగా ఇంతటి గొప్ప నటుడికి నివాళులు అర్పించండి
-----------------------------------------------------------------
నట సార్వబౌమ యస్.వి.రంగరావు 3 జులై,1918న నూజీవీడు,క్రిష్ణ జిల్లాలో జన్మించాడు. యస్.వి.రంగరావు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించాడు అంతేకాదు సినిమాలు డైరెక్ట్,ప్రోడ్యుస్ కూడ చేశాడు యస్.వి.రంగరావు తెలుగులోనేకాదు తమిళ్ లో కూడ చాల సినిమాలు తీశాడు ఇదంతా కాక రంగరావ్ ఇంటర్ నేషనల్ యాక్టర్ ల కూడ పేరు తెచ్చుకున్నాడు "విశ్వనాథ చక్రవర్తిగా" అందరికి తెలుసు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటగా మేనరిజం తీసుకొచ్చిన యాక్టర్ అది "ఓరేయ్ డొంగ్రే" 'జగత్ జిత్తులూ సినిమాతో ఈ మేనరిజం తెచ్చాడు యస్.వి.రంగరవ్ మొట్టమొదటి చిత్రం "వరుదిని"ఈ చిత్రంలో అవకాశం రంగరవ్ కి తెలిసిన వ్యక్తి ద్వార వచ్చింది ఈ సినిమా తీసేటప్పుడు రంగరవ్ జాబ్ (get a job in the Fire Service in the cadre of an officer)చేయాల సినిమా కెరీర్ లోకి రావల అని ఆలోచించాడు అలా అతను ఫైర్ వర్క్ లో జాబ్ చేయడానికి వెళ్ళిపోయుంటే మనికి అంతటి గొప్ప నటుడు దొరికేవాడుకాదు

యస్.వి.రంగారావు జీవితంలో ముఖ్యసంఘటనలు:
1:he was married to Leelavathi Vadeti on December 27

2:S.V.R. was given an opportunity to play the villain in the film, "Palletoori Pilla," produced by B.A. Subba Rao. Unfortunately, when S.V.R. was about to take a train to Chennai, his father expired. After performing the final rites, S.V.R. reached Chennai, but somebody had knocked away the villain role.
Luck tapped at S.V.R.'s door through Vijaya Pictures, which offered him the most memorable "Nepala Mantrikudu" role in "Pathala Bhairavi." Immediately, he came into the limelight



7/16/09

'జోష్‌'లో వెంకటేష్‌ కొడుకు "అర్జున్‌"


విక్టరీ వెంకటేష్, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "తులసి"లో వెంకటేష్‌ కొడుకుగా బుడతడు నటించాడు. చూడ్డానికి చాలా ముచ్చటగా ఉన్న అతని పేరు 'అతులిత్‌'. చాలామంది ఇతనే విక్టరీ వెంకటేష్‌ కొడుకు అనుకున్నారు.
తాజా సమాచారం ఏమిటంటే..? నాగార్జున తనయుడు నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న 'జోష్‌'లో నాగచైతన్య చిన్నతనం పాత్రలో వెంకటేష్‌ కొడుకు "అర్జున్‌" కన్పించనున్నాడట.
కెమెరా ముందు సరిగ్గా యాక్ట్ చేయడానికి ఇప్పటినుంచే వెంకీ సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి దగ్గుపాటి వంశంకూడా నందమూరి వంశంతో పోటీపడుతుందన్నమాట...!.



ఐటం సాంగ్ లో దీపికా పదుకొనె





ఓం శాంతి ఓం తో యుత్ ని కట్టి పడేసిన దీపికాపదుకొనే ఇప్పుడు మరో కొత్త పాటతో అలరించబోతోంది లవ్ ఆజ్ కల్ హిట్ తో బాలీవుడ్ లో మంచి ఫేం మీద ఉన్న దీపికా ఈ సాంగ్ తో మరింత క్రేజ్ కొట్టేయనుంది''చక్‌దే మాహియా నీదే దునియా...హద్దు దాటి ఆడెయ్‌ డే అండ్‌ నైట్‌, లవ్వంటే మాయ లైఫే ఓ మాయ...నచ్చినట్టు చేసెయ్‌ రాంగ్‌ ఆర్‌ రైట్‌...అంటూ సాగే పాటను బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనేపై 'లవ్‌ ఫర్‌ ఎవర్‌' కోసం చిత్రీకరించారు. లాఫింగ్‌ వాటర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జయంత్‌ సి.పరాన్జీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రణదీప్‌, మృదుల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అహ్మద్‌ఖాన్‌ నృత్య దర్శకత్వంలో పై పాట చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా దీపికా పదుకొనే:'దక్షిణాది నుంచి పలు అవకాశాలు వచ్చినా హిందీ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను అంగీకరించలేదు.జయంత్‌ మంచిస్నేహితుడు కావడం వల్ల ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయాలని కోరారు. కథ వినగానే ఇంతమంచి సినిమాలో నేను ఒక భాగం కావాలన్న ఉద్దేశ్యంతో వెంటనే అంగీకరించాను. కథలో ప్రాధాన్యం ఉన్న పాట అది' దర్శకనిర్మాత జయంత్‌:'షూటింగ్‌ సందర్భంగా దీపికలోని క్రమశిక్షణను,వృత్తిపట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని చూశాను. అందుకే ఆమెతో హిందీలో ఓ సినిమా చేయాలనిపించి కథ కూడా చెప్పాను. ఆమె ఎంతగానో స్పందించి, హిందీలో చేసేందుకు అంగీకరించింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, దీపిక పాట ఈ చిత్రంలో ఓ హైలైట్‌గా ఉంటుంది. నాలుగు కెమెరాలతో ఈ పాటను చిత్రీకరించాం. దీనికోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమాకు వస్తారు. విభిన్నమైన ప్రేమకథ ఇది.

Powered by web analytics software.