
అంతా కప్పుకుని కూడా సెక్సీగా రెచ్చగొట్టవచ్చని కొత్త తార నిషా అగర్వాల్ సూత్రాలు చెపుతుంటే, సీనియర్ నటి ప్రియమణి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదట. అనుష్క, ఇలియానాల మాదిరిగా సొగసులన్నీ ఆరబోసి టాలీవుడ్ రేసులో ముందుండాలని తెగ ఆరాటపడుతోందట. కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేస్తానని దర్శకనిర్మాతలతో చెప్పాలనీ, అగ్రహీరోల వెంట అవకాశం వచ్చేలా చూడమని తన మేనేజర్ వద్ద ఒకటే పోరుపెడుతోందట. ప్రియమణి గొడవ పడలేని సదరు మేనేజర్ ప్రస్తుతం టాప్‌స్టార్ చిత్రాల్లో ప్రియమణి ఆఫర్లకోసం కాలికి బలపం కట్టుక తిరుగుతున్నాడట. అన్నట్లు కోలీవుడ్‌లో తమన్నా, అనుష్క వంటి తారలు రాకతో ప్రియమణికి అనుకున్నంత అవకాశాలు రావడం లేదట. దీంతో ఆమె టాలీవుడ్‌నే నమ్ముకున్నట్లు సమాచారం.