
ఇటీవల అక్కినేని నాగార్జునను ఫ్యాన్స్ కలుస్తున్నారు రమ్మంటూ... సినిమా విషయాలను చెప్పేందుకు ప్రయత్నించిన దిల్ రాజుకు భంగపాటు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై నాగార్జునకు దిల్ రాజు క్షమాపణ చెప్పారు.
దీనిపై నాగ్ స్పందిస్తూ... నన్ను ఫ్యాన్స్ కోసం రమ్మని పిలిచారు. తీరా వచ్చాక బ్యాగ్‌పైపర్ బ్రాండ్ వాళ్లు రెడీగా ఉన్నారు. వారు అక్కడ ఎందుకున్నారు..? మీడియా ఎందుకు వచ్చింది..? అనేది కూడా నాకు తెలీదు. అందుకే మీతో సినిమా గురించి మాట్లాడలేదని నాగ్ చెప్పారు.
అసలు ఇలా ఎందుకు జరిగిందని అడిగితే ఎవరికి వారు ఏవేవో కారణాలు చెపుతున్నారు. దిల్ రాజు తనకు తెలీదంటాడు. మేనేజర్లు తమకు తెలియదంటారు. మరి ఎవరికి తెలుసు...? అంతా గందరగోళంగా అనిపించింది. గగనమే గందరగోళమైందా..? అన్నంత డౌటు వచ్చిందని నాగార్జున అన్నారు. గగనం సినిమా జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలవుతుందని చెప్పారు.
