
వేదం' సినిమా ద్వారా పరిచయమైన నటి దీక్షాసేథ్. రవితేజ నటించిన 'మిరపకాయ్'లో నటించింది.
ఆ చిత్రం తర్వాత గోపీచంద్‌తో 'వాంటెడ్'లో చేస్తోంది. రెండుచిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు నటించిన హీరోల్లో ఎవరితో కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... అంతా బాగానే ఉన్నారు.
రవితేజతో నటిస్తుంటే చేసినట్లుగానే లేదు. చాలా సరదాగా ఉంటాడు. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది.
మళ్ళీ అవకాశముంటే అతనితో చేయాలనుందని చెప్పింది. హీరోయిన్లలో తనకు రిచా గంగోపాధ్యా మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చింది.
