
టాలీవుడ్‌లో అవకాశాలు తరగడంతో ప్రేక్షకులను కనిపించని 'జయం' హీరోయిన్ సదా కొత్త సంవత్సరం సూపర్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తోంది.
తెలుగు, తమిళ సినిమాల్లో మంచి ఆఫర్లు రాకపోయినప్పటికీ... ఈ అమ్మడుకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్ లభించిందట. ప్రస్తుతం కన్నడ సినిమా "మల్లికార్జున్"లో రవిచంద్రన్‌తో నటిస్తున్న సదాకు రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ సినిమా మిస్టర్ రైట్ షూటింగ్ ప్రారంభమైంది. ఇంకా హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ వంటి సూపర్ హీరోస్ కలిసి నటించాలని సదా కలలు కంటోంది.
ఇప్పటికే అసిన్, త్రిషలు దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగెట్టగా, తాజాగా సదా కూడా వీరి బాటలోనే పయనించాలని తహతహలాడుతోంది.
