
అమీషా పటేల్ ఈమధ్య సరసయిన అవకాశాలు రాక ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే మరీ ఖర్చులకి కూడా డబ్బులు లేక సొంత అంకుల్ ఇంటికే కన్నం వేసి దొరికిపోయేంతగా ఆమె కష్టాల్లో ఉందన్న సంగతి మాత్రం మనకి తెలీదు. కానీ అమీషా అంకుల్ నళిన్ రజనీ పటేల్ మాత్రం అదే అంటున్నాడు. అమీషాని దొంగ అంటూ అతను గొడవ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే తన ఇంట్లో అమీషాపటేల్ దొంగతనం చేసిందని ఆయన పోలీసులకి కంప్లయింట్ ఇచ్చాడు.
తాము లేనప్పుడు డూప్లికేట్ కీస్ సాయంతో ఇంట్లోకి ప్రవేశించిన అమీషా విలువైన సామాగ్రిని తస్కరించిందని, ఆమె తన స్నేహితులతో కలిసి ఇంటికి రావడం వాచ్ మెన్ కూడా చూశాడని నళిన్ పటేల్ అంటున్నాడు. అమీషా దగ్గర్నుంచి తమ వస్తువులని ఇప్పించాలని ఆయన పోలీసులని కోరుతున్నాడు. బాలకృష్ణ సరసన ‘పరమవీర చక్ర’ చిత్రంలో నటిస్తున్న అమీషా పటేల్ మాత్రం ఈ దొంగ ఆరోపణల మీద స్పందించలేదని తెలుస్తోంది.