
హాస్య నటుడు కృష్ణభగవాన్ స్థానిక భీమవరంలోని నరసాపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కల్లు తాగిన కోతిలా మారాడు. పూటుగా పీకల దాకా తాగి వచ్చిన భగవాన్, సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చేతిలోని మైకును మందు సీసా మాదిరిగా అటూ ఇటూ తిప్పుతూ పిచ్చి మాటలు మాట్లాడాడు.
సాహితీవేత్త గరికపాటి ఏం చెప్పాడో తెలుసా... అంటూ నోటికి వచ్చిన మాటలను మాట్లాడాడు. దీంతో కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులతో సహా నిర్వాహకులు నిశ్చేష్టులయ్యారు. తాగిన మైకంలో తన తండ్రిని సైతం తూలనాడాడు భగవాన్. తన తండ్రి తనకో లవ్ లెటర్ రాసిపెట్టమన్నాడని చెపుతూ... కొట్టండి చప్పట్లు అంటూ విద్యార్థులను ప్రోత్సహించాడు.
కృష్ణ భగవాన్ పీకల దాకా తాగి ఉన్నట్లు గమనించినా, ఆయనను స్టేజిపైకి ఎలా ఆహ్వానించారని మేధావులు మండిపడుతున్నారు. మందు తాగి గరికపాటి లాంటి పెద్దలను విమర్శించిన కృష్ణభగవాన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. మరి మత్తు దిగిన తర్వాత భగవాన్ దీనిపై స్పందిస్తాడేమో చూడాలి...