
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరూ..? అంటే అనుష్క అని అందరూ చెపుతారు. అనుష్క కూడా తన పొజిషన్, తనకు వస్తున్న పాత్రల పట్ల హ్యాపీగానే ఫీలవుతోంది. కాకపోతే ఇటీవల ఆమెకు కొత్తగా ఓ బెంగ పట్టుకున్నదట.
అదేంటయా అంటే... తనకు వెంకీ, నాగ్, రవితేజ వంటి సీనియర్ నటుల వెంట మాత్రమే అవకాశాలు రావడమేనట. కుర్రహీరోలైన రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. తదితర హీరోల సరసన నటించే అవకాశాలు దాదాపు తక్కువైపోయాయి.
వారి సరసన ఎక్కువగా కాజల్, ఇలియానా, సమంత, తాప్సి వంటి తారలు నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఎందుకూ...? అనంటే... అనుష్క వారి పక్కన ముదురు అమ్మాయిలా కనబడుతుందని అంటున్నారట. అనుష్క మాత్రం... నా వయసెంత..? జస్ట్ ఇరవై ఎనిమిదేగా..? అని గారాలు పోతూ చెపుతోందట. అంటే ఇంకా టీనేజ్ హీరోయిన్ అనుకుంటుందేమో...?!!

అదొక సమస్య కానే కాదు అనుష్క అందుకు బెంగ పడాల్సిన పనే లేదు ఎందుకంటె పైన చెప్పిన హిరోలకంటే అనుష్క ఎత్తుకాబట్టి డైరక్టర్లు ఆమెని హిరోయిన్ గా అనుకొవట్లేదు కాని youth అగ్ర హిరో గా చలమణిలొ ఉన్న మహేష్ పక్కన ఆఫర్ వచ్చిందిగా ఆమె కి ఆమె వయసు కాదు మన హిరొల హైట్ తక్కువవటం ఆమె ఎత్తు ఎక్కువవటం పెద్ద దిగులయుంటుంది