
సింహా చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన స్నేహా ఉల్లాల్ ఆ తర్వాత మరిన్ని అవకాశాలకోసం వేచి చూసినా పెద్దగా ఫలితం కనబడలేదు. కానీ, వచ్చిన కొన్ని అవకాశాలను మాత్రం చేజేతులా వదులుకుందని ఫిలింనగర్ అంటోంది.
సింహా చిత్రాన్ని మైండ్‌లో పెట్టుకుని పారితోషికం పెద్దమొత్తంలో డిమాండ్ చేయడంతో వచ్చినవారు వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఇలా అయితే తన కెరీర్ ఫేడవుట్ అవుతుందేమోనని అనుమానంతో ఇటీవలే ఓ చిత్రంలో ఆఫర్ వస్తే ఐటం గాళ్‌గా చేయడానికి సిద్ధమని అంగీకరించిందట.
కానీ, ఇలాగే కొనసాగితే కెరీర్ ఐటంగాళ్‌గానే ఫిక్స్ అయిపోతావని సన్నిహితులు చెబుతున్నా వినిపించుకోవడంలేదట. ఇండస్ట్రీ అంటే అంతేమరి.