
ఆ మధ్యన చిరంజీవి సినిమాని డైరక్ట్ చేయాలని ఉందని,దాని పేరు దొర..ది లార్డ్ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి చాలా స్లిమ్ గా తయారయ్యారని, పవన్, రామ్ చరణ్ ల కన్నా చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేసారు. అనంతరం చిరంజీవి తన 150 చిత్రాన్ని తానే డైరక్ట్ చేసుకుంటే చూడాలని ఉందని అన్నారు. ఇంకెవరూ డైరక్ట్ చేసినా అంతబాగా ఉండరని కామెంట్ చేసారు. వీటితో పాటు రామ్ చరణ్ ఆరెంజ్ పైన కూడా ఆయన కొన్ని ట్వీట్స్ చేసి అందరిలో ఆసక్తి క్రియోట్ చేసారు. తాజాగా మరోసారి చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేసిన దాంట్లో...చిరంజీవి గారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్ అదృష్ఠం అండ్ ఆంద్రప్రదేశ్ ఈజ్ చిరంజీవిగారూస్ అదృష్టం అన్నారు. ఆయన అలా ఎందుకన్నారనేదాని పెద్ద రీజన్ ఉండకపోవచ్చు కానీ చిరంజీవి మరో సారి కామెంట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అన్నట్లు అర్దమవుతుంది.
Chiranjeevigaaru is andhrapradeshs adhrushtam and andhra pradesh is chiranjeevigaarus adhrushtam