
మంగళ" చిత్రంతో ఛార్మి సినీ కెరీర్ ఇక మంగళమే అంటూ ఫిలిమ్ నగర్‌లో వాదనలు వినబడ్డాయి. సినిమా విడుదలకు ముందే ఇటువంటి వార్తలు రావడం ఛార్మికి కాస్త ఆందోళన తెప్పించే ఉండవచ్చు. కానీ తాజాగా రాంగోపాల్ వర్మ తన ఐదు రోజుల చిత్రం "దొంగలముఠా"లో ఛార్మికి ఆఫర్ ఇవ్వడంతో తెల్లపిల్ల ఛార్మి పండగ చేసుకుంటోందట.
తన సన్నిహితులందరినీ పిలిచి ఐస్ క్రీములను తినిపించిందట. రాము దర్శకత్వంలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చిందట.
ఈ 5 రోజుల చిత్రంలో నీ పాత్ర ఏమిటి...? ఎంత నిడివి ఉంటుందని అడిగితే.. వర్మగారి దర్శకత్వంలో ఏ చిన్న పాత్రలో కన్పించినా అది గొప్పగానే ఉంటుందని గొప్పలు చెపుతోందట ఛార్మి. మరి రాము, ఛార్మిని ఎలా చూపిస్తారో.. ఏంటో..?