
యువరత్న బాలయ్య అంటే ఇప్పటికీ అభిమానుల్లో ఓ రకమైన ప్రేమ, వాత్సల్యం. అయితే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు మెండిగా వ్యవహరించే బాలయ్యను చూసి అభిమానులు కూడా భయపడిపోతున్నారు. ‘సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఈ లేటు వయసులో అందుకున్న బాలకృష్ణకు ఇక తిరుగులేదు అని అభిమానులు ఆనందిస్తున్న సమయంలో పిడుగులాంటి ‘పరమవీర చక్ర’ను అభిమానుల నెత్తిన బాదేశాడు దాసరి. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం అని అభిమానులు హెచ్చరించినా వారి మాటలను పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి జరిగిందని కొందరు అభిమానులు ఫీలయితే ఇప్పుడేమో ‘శ్రీరామ రాజ్యం’ కూడా బాలకృష్ణ నుండి రాబోతున్న మరో బాంబు అని భయపడుతున్నారు. అలనాటి ఆణిముత్యాలు బాపు-రమణల చేతిలో రూపుదిద్దుకుంటున్న ‘శ్రీరామ రాజ్యం’ నేటి తరం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనే డౌట్ ఇప్పటికీ అభిమానులను కలవర పెడుతోంది. వరుస పెట్టి కళాఖండాలను ఏరుకుంటున్న బాలయ్యకు బాపు-రమణలు ఎంతమేర కలిసొస్తారో వేచి చూడాల్సిందే..