
పవన్ కళ్యాణ్ తాజాగా సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ ని గబ్బర్ సింగ్ టైటిల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దబాంగ్ హిట్టవటానికి సల్మాన్ ఖాన్ వెరైటీ నటన ఎంత ఉపకరించిందో అంతకు రెండు రెట్లు అందులో హీరోయిన్ గా కొత్తగా పరిచయం అయిన సోనాక్షి సిన్హా అంతలా తోడ్పడింది దాంతో ఈ గబ్బర్ సింగ్ కు కూడా ప్రెష్ పేస్ తో ఉండే హీరోయిన్ అవసరమొచ్చింది. . దాంతో హీరోయిన్ గా కాజల్ ని ఈ చిత్రంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆమె అడగ్గానే ఎగిరి గంతేసినట్లుగా డేట్స్ కేటాయించింది. [అయితే అంతుకు ముందు ఆమె రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపుకు డేట్స్ లేవని ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఇక ఈ గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ ఈచిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.]మరి అప్పుడు కలిసిరాని డేట్స్ ఇప్పుడెలా కలిసొచ్చాయ్ పవన్ కల్యణ్ కి మాత్రమే కాదండోయ్ మాస్ మహ రాజ్ రవితేజ సరసన నటిస్తోందని సమాచారం