
ఓ వైద్యుడిని పెళ్లాడాలన్నది నా కోరిక అంటూ మనసులో మాటను బయటపెట్టింది హాట్ నటి కంగనా రనౌత్. "వైద్యులు తెలివైనవారు, కామ్‌గా ఉండే తత్వం కలిగి ఉంటారు. ఇదే పరిశ్రమలోని వ్యక్తిని పెళ్లాడాననుకోండి. ఇద్దరి మధ్య కెరీర్ పరుగులు తప్పవు. ఇద్దరం ఇలాగైతే ఎలా సుఖపడతాం చెప్పండి. ఎవరో ఒకరు సమస్యలను సర్ది, బాంధవ్యాన్ని బ్యాలన్స్ చేయాలి కదా" అంటూ చెప్పుకొచ్చింది. అదిసరే... సినిమాల్లో ఓవర్‌ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారని అంటున్నారు.. దీనిపై ఏమంటారు అని అడిగితే... "నేనో చిన్న పట్టణానికి చెందిన యువతిని. గ్లామర్ అంతటినీ బయటపెడుతున్నాననీ, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నానని కొందరు అనుకోవడం తప్పు. పట్టణం నుంచి వచ్చాను కనుక అంత ఎక్స్‌పోజింగ్ బహుశా నేను చేయలేను. ఇప్పుడు చూపిస్తున్న గ్లామర్‌నే ఓవర్ ఎక్స్‌పోజింగ్ అని అంటే నాకంటే ఇంకా ఎక్కువగానే చూపించే అమ్మాయిలు ఈనాడు చాలా చోట్ల ఉన్నార"ని తెగేసి చెప్పింది కంగనా రనౌత్.