
‘ఆ కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి వుంది. తదేకంగా ఆ కళ్ళలోకి చూస్తే, ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. నేనూ అలాగే పడిపోయా’. ఇంతకీ శృతిహసన్ ని ప్లాట్ చేసిన ఆ కళ్లు ఎవరివబ్బా? అనుకుంటున్నారా..ఆ కళ్లు ఎవరివోకావు. తమిళహీరో గజినీ సూర్యవి. ఆయనతో కలిసి ‘ఎజాన్ అరిపు’ అనే చిత్రంలో నటిస్తున్నారు శృతి. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను నెమరువేసుకుంటూ, శృతి పై విధంగా స్పందించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ..నటనకు సంబంధించిన ఏ విషయాన్నీ సూర్య తేలిగ్గా తీసుకోరు. అంతే కాదు సిన్సియారిటీ ఆయనకు ఆభరణం. ఇవన్నీ ఆయన వద్ద చాలా మంది నేర్చుకోవాలి” అని చెప్పారు శృతి. సిన్సియారిటీలోనూ, సీరియస్ నెస్ లోనూ, బిహేవియర్ లోనూ, నటనలోనూ ఇలా అన్నింటిలో కమల్ గారే ఆదర్శం అని హీరోలందరూ అంటుంటే.. కమల్ కూతురైన ఈవిడేమో… సూర్యను చూసి నేర్చుకోవాలంటున్నారు.