2010 లో ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు అదుర్స్, బృందావనం విడుదలై విజయాన్ని సాధించాయి. అందుకే ఎన్టీఆర్ కూడా చాలా హుషారుగా వున్నాడు. వెంట వెంటనే సినిమాలు చేయడానికి సంకల్పించాడు.
ప్రస్తుతం మొహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలో నటిస్తున్న తారక్ తర్వాత నటించనున్న చిత్రం సురేందర్ రెడ్డి రచ్చ. ఈ చిత్రం ఫిబ్రవరి 28న చిత్రీకరణ మొదలు కానుంది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న చురకత్తి ఏప్రిల్ ఒకటిన మొదలు కానుంది. అంటే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి వేసవిలో సందడి చేస్తే మరొకటి దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.