
ఓవర్ ఎక్స్‌పోజింగ్‌కు నో చెప్పే అందాల అసిన్ బాలీవుడ్ మసాలా బేబీల పోటీ దెబ్బకు మారిపోయినట్లుంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రంలో పలుచటి స్పోర్ట్స్‌వేర్ స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చేందుకు రెడీ అయిందట. అదేమని అడిగినవాళ్లతో... తనను ఇంతవరకూ బికినీ వేసుకుని నటించాలని ఎవరూ అడగలేదని తెలివిగా సమాధానం ఇస్తోందట. ఒకవేళ అడిగి ఉన్నట్లయితే ఈసరికే అటువంటి సన్నివేశంలో నటించేదాన్నని పాఠాలు చెపుతోందట. అసిన్ బికినీలో నటిస్తుందని తెలిసిన వెంటనే, కోలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెను కాంటాక్ట్ చేసేందుకు సిద్ధమైపోయారట. అలాంటి సన్నివేశాలతో కూడిన చిత్రాల్లో నటింపజేసేందుకు యత్నిస్తున్నారట. మరి ఈ హాట్ ఆఫర్లను అసిన్ అంగీకరిస్తుందో...? తోసి పారేస్తుందో చూడాలి.