
అల్లు అరవింద్ ఎంత తెలివైనవాడనేది చిరంజీవి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. భోళా మనిషి అయిన చిరంజీవిని గ్రిప్ లో పెట్టుకుని కీలు బొమ్మలా ఆడించిన తెరవెనుక సూత్రధారి అతనే. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అతనిలానే ప్రవర్తిస్తున్నాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న తెలివితేటలతో అల్లు అర్జున్ చాలా తెలివిగా చరణ్ కి చెక్ పెడుతున్నాడు. చిరంజీవి రిటైరైపోవడం, పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ దశకి చేరడంతో తనకి పోటీగా ఉన్న చరణ్ ని తప్పిస్తే హ్యాపిగా మెగాస్టార్ అనిపించేసుకోవచ్చని బన్నీ ప్లానేశాడు. చిరు లాగే ఉబ్బులకోరోడైన చరణ్ ని ఉబ్బేసి బన్నీ పబ్బం గడుపుకుంటున్నాడు. ‘నిన్ను మించినోడు లేడు నీకు నేనే పెద్ద ఫ్యాన్’ని అంటూ నిత్యం చరణ్ ని ఆకాశానికి ఎత్తేసే అల్లు అర్జున్ తన చచ్చు సలహాలతో చరణ్ ని పూర్తిగా రాంగ్ రూట్ పట్టించేస్తున్నట్టు భోగట్టా. మంచి కథలు చెబితే తాను చేస్తూ, కాస్త తక్కువ రేంజ్ కథలుంటే చరణ్ కి చెప్పమని చెబుతున్నాడట. అంతే కాక సదరు కథలు చాలా బాగున్నాయని చరణ్ని భ్రమపెడుతున్నాడని సమాచారం. అల్లు అర్జున్ ని గుడ్డిగా నమ్ముతున్న చరణ్ ఇప్పటికే కొన్ని కథల విషయంలో బోల్గా పడ్డాడని, ఇదే కొనసాగి ఆయా సినిమాలు విడుదలైతే మాత్రం చరణ్ తెచ్చుకున్న ‘మగధీర’ పేరంతా త్వరగానే కోల్పోతాడని బన్నీ తర్వాత చరణ్ అని అభిమానులు కూడా అనుకునే స్థాయికి దిగజారిపోతాడని అంటున్నారు.