Free SMS And Earn Part Time Money







Showing posts with label pawan kalyan salman khan dabaang gabbar singh love aaj kal lovely harish sankar pawankalyan creative works banner. Show all posts
Showing posts with label pawan kalyan salman khan dabaang gabbar singh love aaj kal lovely harish sankar pawankalyan creative works banner. Show all posts

1/23/11

కొమరం పులి షాక్ తో హింది రీమేక్ లపై పవన్ దౄష్టి


పవన్ కల్యాణ్ త్వరలో ‘గబ్బర్‌సింగ్’ గా కనిపించనున్నారు.Pawan kalyan క్రియేటివ్ వర్క్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. పవన్ కల్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ‘గబ్బర్‌సింగ్’ సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ‘దబాంగ్’ కి రీమేక్. ఈ చిత్రం గురుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తోలి చిత్రం ఇది. హిందీ సూపర్ హిట్ దబాంగ్ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్నాను. హరీష్ శంకర్, నేను కలిసి ఇంతకుముందు ఓ సినిమా చెయ్యాల్సి వుంది. అప్పుడు తను మిరపకాయ్ కధతో పాటు మరికొన్ని కధలు చెప్పాడు. కధ చెప్పేటప్పుడు హరీష్ నేరేషన్ నాకెంతో నచ్చింది. దబాంగ్ రీమేక్ అనుకోగానే హరీష్ అయితే ఈ సినిమాకి కరెక్ట్ అనిపించింది. అతి త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది' అన్నారు.అలాగే ఈ చిత్రం హై టెక్నికల్ వేల్యూస్ తో ఈ చిత్రం రూపొందుతుంది.
Powered by web analytics software.