
కుర్రకారుకు బక్కనడుము ఇలియానా అంటే మహా క్రేజ్ అన్నది తెలిసిందే. సినిమా హీరోకూడా కుర్రవాడే కాబట్టి... వరుణ్ సందేశ్ ఇలియానాపై మోజు బెడ్‌రూమ్ దాకా వెళ్ళింది. "దేవదాసు" చిత్రంలో ఆమె అందాల్ని చూసి మనసు పారేసుకున్న వరుణ్ సందేశ్ బెడ్‌రూమ్‌లోఇలియానా ఫోటోలే దర్శనమిస్తుంటాయి.
హ్యాపీడేస్‌లో హీరోగా చేసినప్పటి నుంచి ఆ పిచ్చి మరింతగా ముదిరింది. ఎప్పుడూ ఊహాల్లో విహరిస్తుంటాడని వరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. వేరే హీరోయిన్లతో చిత్రాల్లో నటించినా సన్ననడుము ఇలియానా అంటేనే తనకు ఇష్టమని తరచూ ప్రస్తావిస్తుంటాడట వరుణ్.
ప్రస్తుతం అగ్రహీరోల సరసన మాత్రమే నటిస్తున్న ఇలియానా ఏదో ఒకనాటికి తనతో కూడా చేయబోదా అని ఆశగా ఎదురుచూస్తున్నాడట ఈ కుర్రహీరో.