
‘ఏ మాయ చేశావే’ చిత్రంతో అందర్నీ మాయ చేసి స్టార్ హీరోలతో వరుస అవకాశాలను సొంతం చేసుకున్న కుందనపు బొమ్మ..సమంత. ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలా ఉంటే పైకి రాగలరో చక్కగా వంట పట్టించుకుంది..అందుకే ఏ హీరో చిత్రంలో అవకాశం వస్తే, ఆ హీరోని అకాశానికి ఎక్కిస్తోంది. ఈ మధ్య‘బృందావనం’ టైమ్ లో ఎన్టీఆర్ ని ఎవరెస్ట్ ఎక్కించిన సమంత..రీసెంట్ గా ప్రిన్స్ మహేష్ బాబు ‘దూకుడు’కి ఎదురే లేదంటుంది. మరి వీరి సంగతి ఇలా వుంటే, ఇంకా అవకాశమే రాలేదు కానీ అప్పుడే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఖుషి’ చేసేందుకు ప్రయత్నిస్తుంది.
పవన్ కళ్యాణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందని..అందులో సమంతని పవన్ సరసన నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ మధ్య వార్తలు వచ్చాయి. మరి ఇంకా ఈ చిత్రంపై ఎలాంటి క్లారిపికేషన్ రాకుండానే..నా చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనతో నటించే చిత్రం కోసం వెయిట్ చేస్తున్నానని, ఆయనతో సినిమా చేస్తే నా కల నెరవేరినట్టేనని హీరోయిన్ సమంత ఈ మధ్య తన స్నేహితులతో చెప్పుకుంటోందట