
అక్కయ్య కాజల్ అగర్వాల్ హావభావాలనే కలిగి ఉన్న నిషా అగర్వాల్ నటించిన తాజా చిత్రం "ఏమైందీ ఈ వేళ". ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న నిషా మామూలుగా చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం...
మీరు బాగా ఇష్టపడేది..? నా సోదరి.. కాజల్ అగర్వాల్.
అదిసరే... మీకు బాగా నచ్చే వస్తువు ఏదో చెప్పండి..? ఫోన్. ఫోన్‌లో ఇష్టమైన వ్యక్తులతో ఎంతో ఇష్టంగా మాట్లాడుకోవచ్చు. సోదరి కాజల్‌తో మాట్లాడుతుంటే టైమే తెలియదు.
మీ అందం వెనుక ఉన్న రహస్యం...? 8 గంటలు నిద్రపోతా. ఇష్టమైన ఆహారాన్ని సుష్టుగా భోం చేస్తా
బాగా నచ్చే దుస్తులేమిటో....? నలుపు, తెలుపు కాంబినేషన్ వస్త్రాలంటే ఎంతో ఇష్టం.
సెక్సీగా కనబడటమంటే...? దుస్తులను తగ్గించి కనబడటం మాత్రం కాదు. అదో ఆర్ట్. ఆ ఆర్ట్‌ను సంపూర్ణంగా ఉపయోగించుకుంటే నిండుగా వస్త్రాలను ధరించి కూడా మహా సెక్సీగా కనబడవచ్చు.
మితిమీరిన ట్రెండ్ ఏమిటంటారు..? సైజ్ జీరో. ఇపుడు దీనిపై నటీమణులే కాదు యువతుల కూడా కుస్తీలు పడుతున్నారు.
ధరించడానికి ఇష్టపడేవి... జీన్స్, టీ షర్టులు, ఫార్మల్ సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు అని చెప్పింది నిషా.