
ఎంత వెతికినా అవే పాత కథలు చెప్పే వాళ్లు తప్పితే కొత్తదనం దొరకట్లేదనిఅనుకున్నాడు రామ్ చరణ్. క్రియేటివిటీ ముదరితే ప్రమాదాలను తెలియచెప్పిన ‘ఆరెంజ్’ లాంటి తప్పు మళ్లీ చేయకుండా ఉండేందుకు పాత కథా రచయితలతో చింతకాయ కథల సంప్రదింపులు అయితే జరిపాడు కానీ తిరిగి, తిరిగి మొదలైన చోటే ఆగిపోయాడు. అవును మూడు నెలల క్రితం ‘గమ్యం’ దర్శకుడు క్రిష్ చెప్పిన కథనే ఇప్పుడు ఒకే చేసి తన ‘మెరుపు’ తదుపరి చిత్రంగా గ్రీన్ సిగ్నలిచ్చేసాడు. ఆర్కా మీడియా వర్క్ నిర్వహణలో యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ చిత్రం 2011 రెండో సగంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. బావ అల్లూ అర్జున్ ‘వేదం’ వీరి దగ్గరే చదివాడు కానీ అదే వేదాల సారం మాత్రం రామ్ చరణ్ చదవకుండానే ‘ఆరెంజ్’ జ్యూస్ తాగి తెలుసుకున్నాడు. క్రిష్ మళ్లీ ఎంతటి ఘనమైన కథతో వస్తాడో అన్న దిగులు అప్పుడే మెగా అభిమానుల్లో మొదలైంది.