
త్వరలో దర్శకుడు సెల్వరాఘవన్..తన దగ్గర పనిచేసే గీతాంజలి అనే అశోసియేట్ ని వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే సెల్వరాఘవన్ కీ నటి ఆండ్రియాకి మధ్య రిలేషన్ ఉందని, అది గమనించే ఆయన మాజీ భార్య సోనీ అగర్వాల్ విడాకులు కోరిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఆండ్రియాని తమిళ మీడియా అడిగితే..ప్రస్తుతం తాను ఆ విషయంపై మాట్లాడలేనని, అయినా అది తనకు సంభందం లేని విషయమని, తమ మధ్య ఎప్పుడూ వివాహ ప్రస్దావన రాలేదని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే తాను సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే నటిస్తున్నానని చెప్పింది. ఇరండు ఉలగం టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో ధనుష్‌కు జంటగా ఆమె నటిస్తోంది. అలాగే ప్రస్తుతానికి వివాహ వయస్సు రాలేదని, అంత ఖాళీగా అస్సలు లేనని ఘాటుగా సమాధానమిచ్చింది.