
కంటిన్యూ గా ఎనిమిది గంటలసేపు నిద్రపోయి చానాళ్లయ్యింది. అందుకని అర్జెంటుగా తీరిక చేసుకుని నిద్రపోయి రీచార్జ్ కావాలనుకుంటున్నాను అంటూ రీసెంట్ గా త్రిష ట్వీట్ చేసింది. అయితే అంత బిజీగా ఉన్నందకు హ్యాపీగా ఉందంటోంది. వరసగా ముంబై, హైదరబాద్, చెన్నై నగరాలు తిరగటమే సరిపోతోంది అంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఆమె లవ్ ఆజ్ కల్ రీమేక్ చిత్రంలో చేస్తోంది. జయంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరో ప్రక్క ఫెయిర్ ఎవర్ వారి యాడ్ షూటింగ్ కోసం ముంబై వెళ్ళి వచ్చింది. ఆ తర్వతా రోజు త్రిష బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిస్తున్న కోల్గెట్ వారి మీట్ ఎన్ గ్రీటింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనటానికి చెన్నై వెళ్ళింది. ఇలా మూడు రోజులు మూడు రాష్ట్రాలు తిరిగింది. దాంతో తాను బాగా అలిసిపోయినట్లు కాస్త నిద్రపోతే బాగుండునని అంటోంది. ఇక త్రిష తమిళంలో అజిత్ సరసన మంగాత్తా చిత్రంలో చేస్తోంది. అలాగే వెంకటేష్ హీరోగా రూపొందబోయే చిత్రంలో కూడా ఆమె కమిటైంది.