Free SMS And Earn Part Time Money







12/18/10

హిరొల హైట్ తక్కువవటం ఆమె ఎత్తు ఎక్కువవటం పెద్ద దిగులట:టాలీవుడ్ లొ అగ్ర హిరోయిన్




టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరూ..? అంటే అనుష్క అని అందరూ చెపుతారు. అనుష్క కూడా తన పొజిషన్, తనకు వస్తున్న పాత్రల పట్ల హ్యాపీగానే ఫీలవుతోంది. కాకపోతే ఇటీవల ఆమెకు కొత్తగా ఓ బెంగ పట్టుకున్నదట.

అదేంటయా అంటే... తనకు వెంకీ, నాగ్, రవితేజ వంటి సీనియర్ నటుల వెంట మాత్రమే అవకాశాలు రావడమేనట. కుర్రహీరోలైన రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. తదితర హీరోల సరసన నటించే అవకాశాలు దాదాపు తక్కువైపోయాయి.

వారి సరసన ఎక్కువగా కాజల్, ఇలియానా, సమంత, తాప్సి వంటి తారలు నటిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఎందుకూ...? అనంటే... అనుష్క వారి పక్కన ముదురు అమ్మాయిలా కనబడుతుందని అంటున్నారట. అనుష్క మాత్రం... నా వయసెంత..? జస్ట్ ఇరవై ఎనిమిదేగా..? అని గారాలు పోతూ చెపుతోందట. అంటే ఇంకా టీనేజ్ హీరోయిన్ అనుకుంటుందేమో...?!!

అదొక సమస్య కా
నే కాదు అనుష్క అందుకు బెంగ పడాల్సిన పనే లేదు ఎందుకంటె పైన చెప్పిన హిరోలకంటే అనుష్క ఎత్తుకాబట్టి డైరక్టర్లు ఆమెని హిరోయిన్ గా అనుకొవట్లేదు కాని youth అగ్ర హిరో గా చలమణిలొ ఉన్న మహేష్ పక్కన ఆఫర్ వచ్చిందిగా ఆమె కి ఆమె వయసు కాదు మన హిరొల హైట్ తక్కువవటం ఆమె ఎత్తు ఎక్కువవటం పెద్ద దిగులయుంటుంది


ఐటం గాళ్‌గా చేయడానికి సిద్ధమని అంగీకరించిందట:సింహా చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించి తరవాత ఐటంగాళ్ గా మారిందని బాధపడుతోంది


సింహా చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించిన స్నేహా ఉల్లాల్‌ ఆ తర్వాత మరిన్ని అవకాశాలకోసం వేచి చూసినా పెద్దగా ఫలితం కనబడలేదు. కానీ, వచ్చిన కొన్ని అవకాశాలను మాత్రం చేజేతులా వదులుకుందని ఫిలింనగర్‌ అంటోంది.

సింహా చిత్రాన్ని మైండ్‌లో పెట్టుకుని పారితోషికం పెద్దమొత్తంలో డిమాండ్‌ చేయడంతో వచ్చినవారు వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. అయితే ఇలా అయితే తన కెరీర్‌ ఫేడవుట్‌ అవుతుందేమోనని అనుమానంతో ఇటీవలే ఓ చిత్రంలో ఆఫర్‌ వస్తే ఐటం గాళ్‌గా చేయడానికి సిద్ధమని అంగీకరించిందట.

కానీ, ఇలాగే కొనసాగితే కెరీర్‌ ఐటంగాళ్‌గానే ఫిక్స్‌ అయిపోతావని సన్నిహితులు చెబుతున్నా వినిపించుకోవడంలేదట. ఇండస్ట్రీ అంటే అంతేమరి.

12/17/10

KSD Appalraju (2011) Emetti Penchare HOT SONG - Sakshi Gulati, Aadarsh, RAM GOPAL VARMA

"నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీయిజం" అనే అప్రల్రాజు నాలుగో పాట


ప్రముఖ సినీ దర్శకులు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోయే "కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" సినిమాలోని నా పేరు "శ్రీశైలం నే చేస్తా రౌడీయిజం"అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే.. 24 ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం 840 చిత్రాల్లో నటించిన తర్వాత సినీ కెరీర్‌లో మొట్టమొదటి సారిగా తనే ఈ పాట పాడారు. నా పేరు శ్రీశైలం అనే ఈ పాటను శుక్రవారం (డిసెంబర్ 17) విడుదల చేశారు.

"నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీయిజం" అనే అప్రల్రాజు నాలుగో పాట ఏ సందర్భంలో వస్తుందంటే.. ధూల్ పేట్ రౌడీ, ఓల్డ్ సిటీకి డాన్ అయిన శ్రీశైలం అన్న సినిమాల మీద మోజుతో తన రౌడీయిజాన్ని, దంధాలని వదిలేసి అప్పల్రాజు సినిమాకి ఫైనాన్సియర్‌గా సినీ ఫీల్డులోకి ప్రవేశించి చేతిలోని గన్ను పక్కనపెట్టి, పెన్ను పట్టుకుని తన గురించి తానే రాసుకుని పాడిన పాట ఇది.

సినిమా (యా) నగర్లోకి అడుగుపెట్టిన అప్పల్రాజుకి అడుగడుగునా తగిలే షాకుల్లో అతి పెద్ద షాక్ శ్రీశైలం తన సినిమాకు ఫైనాన్స్ చేయడం. అప్పల్రాజు సినిమాకి ఫైనాన్స్ చెయ్యడానికి తన రౌడీలతో కలిసి ఎంటరవుతాడు శ్రీశైలం.. రౌడీలకి సినిమా గురించి ఏం తెలుసు అనే అప్పల్రాజు డౌట్‌ని క్లియర్ చేయడానికి సినిమా స్టైల్లోనే తన గతాన్ని పాటగా రాసి, తనే పాడి వినిపిస్తాడు. "నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీయిజం" అని...


ఈ పాట కూడా సింగిల్ సిడీలో రిలీజ్ అయ్యి, అందులో ఆ పాటకు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మరియు స్టిల్స్ కూడా విడుదలైయ్యాయి. ఇంతకు ముందే చెప్పినట్టు అన్ని పాటలూ కలిగిన పూర్తి ఆల్బముని సినిమా విడుదలకు పది రోజుల ముందు విడుదల చేస్తారు.

శ్రేయ ప్రొడక్షన్ బ్యానర్‌లో సునీల్ హీరోగా నిర్మిస్తున్న "కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" సినిమాలో కలర్స్ స్వాతి నటిస్తోంది. రొటీన్‌గా వస్తున్న సినిమాలను తన ఊర్లో చూసీ చూసీ విసుగెత్తిపోయిన అప్పల్రాజు ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడూ తీయని విధంగా సినిమా తీసి చూపించగలననే ఆత్మవిశ్వాసంతో ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి తాననుకున్నట్లు తియ్యడంలో అడ్డుకున్న అవాంతరాలు ఈ చిత్ర కథాంశం.

బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్. నారాయణ, ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్, కృష్ణుడు, కోటా శ్రీనివాస్ రావు, స్వాతి, సాక్షి గులాబి తదితరులు ప్రధాన తారాగాణం.

రేడియో మిర్చిలో వచ్చే "బంపర్ టు బంపర్" కార్యక్రమం ద్వారా ఈ శుక్రవారం ఈ పాటను విడుదల చేశారు. ఆడియో సీడీని మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మొదటిసారిగా ఈ పాటను ఆపిల్ ఐ ట్యూన్స్‌లలో కూడా విడుదల చేశారు.

1994 డిసెంబర్‌ 18న మరణించారు. అందుకే కాసేపు ఆమెను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం.


అలనాటి నటీమణి సూర్యకాంతం. 1994 డిసెంబర్‌ 18న మరణించారు. అందుకే కాసేపు ఆమెను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. తెరపై గయ్యాళిగా కోడల్ని హింసించే అత్తగా కనిపించే సూర్యకాంతం తెర వెనుక నుంచి మనసున్న ఉత్తమరాలుగా అపినించుకున్నారు. ఎందరికో సాయం చేసి ఆపదల్లో ఆదుకున్నారు. పోషించిన పాత్రలు గయ్యాళివే అయినా సూర్యకాంతం వ్యక్తిగత మనస్తత్వం అందుకు భిన్నంగా ఉండేది.

అందరితోనూ ఎంతో అభిమానంగా మెలిగేవారు. వినోద పాత్రలు పోషించే నటికి డాక్టరేట్‌ రావడం అరుదుగా చెప్పుకోవచ్చు. ఆ ఘనత సూర్యకాంతానిదే. 1994 జులై 4న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌‌తో బహుకరించింది. దీంతో ఆమె డాక్టర్‌ సూర్యకాంతమయ్యారు. ఆమె మనసు వెన్న. సూర్యకాంతంకు మొదట హిందీలో హీరోయిన్‌‌గా అవకాశాలు వచ్చాయి.

ఆ పాత్రను నిర్మాత మొదట మరొకరికిచ్చి, ఆ తర్వాత సూర్యకాంతాన్ని చేయమన్నారు. వేరొకరు బాధపడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను? అని ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఆమె మధుమేహ వ్యాధితో బాధపడ్డారు.

ఆమె చివరి చిత్రం 'ఎస్‌.పి.పరుశురాం'. తనబొమ్మ సినిమా పోస్టర్ల మీద పడాలని కోరిక కలిగింది. ఆ కోరికే ఆమెను మద్రాసు వెళ్లేలా చేసింది. ఆమె 1994 డిసెంబర్‌ 18న మరణించారు. జెమినీ స్టూడియోలో వారు తీసిన 'చంద్రలేఖ' సినిమాలో డాన్సర్‌గా సూర్యకాంతానికి తొలి అవకాశం వచ్చింది.


12/16/10

nagavalli review


నటీనటులు: విక్టరీ వెంకటేష్‌, అనుష్క, కమలినీముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌, శరత్‌బాబు, ప్రభ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌. నారాయణ, రక్ష, పూనమ్‌కౌర్‌, సుజ తదితరులు. కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: రమా రాజమౌళి, విజువల్స్‌: విన్‌సెంట్‌ స్టూడియో, సంగీతం: గురుకిరణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వాసు, నిర్మాత:బెల్లంకొండ సురేష్‌.

పాయింట్‌: చనిపోయిందనుకున్న చంద్రముఖి మళ్ళీ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళిపోయింది. అన్నది పాయింట్‌.

మొదటి పార్ట్‌ చంద్రముఖి చూసిన ఫీలింగ్‌తో ఈ సినిమా చూస్తే అంతగా అనిపించదు. ఏదో మిస్‌ అయిందనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్‌గా రజనీకాంత్‌ నటన, మాడ్యులేషన్‌, లకలకలక.. అనే పదాలు తెలీని వైబ్రేషన్‌ ప్రేక్షకుడిలో క్రియేట్‌ చేసింది. నాగవల్లిలో వెంకటేష్ మాడ్యులేషన్‌.... 'ఔరా ఔరా..' అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాగవల్లి ఎవరు? అనేది సస్పెన్స్‌ కలగజేయడంలో దర్శకుడు బాగానే చేశాడు. టోటల్‌గా విక్టరీ వెంకటేష్‌ 25 సంవత్సరాల కెరీర్‌లో కొత్తగా చేసే ప్రయత్నంలో అతను బాగానే చేశాడనే చెప్పాలి.

కథ: చంద్రముఖి పెయింటింగ్‌ గాలిలో కొట్టుకుంటూ వచ్చి ఓ పెయింటర్‌కు దొరుకుతుంది. దాన్ని ఇంటిలో తీసుకుని పెట్టుకుంటాడు. తనదికాని దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య అడిగితే దానికి ససేమిరా అంటాడు. అయితే అతను తెల్లారేకల్లా చనిపోయి వుంటాడు. ఈ పెయింట్‌ను ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. కట్‌చేస్తే.... విజయనగర సంస్థానదీశుల వారసులైన శరత్‌బాబు ప్యాలెస్‌కు చేరుతుంది. ఆమె కుమార్తె కమలినీముఖర్జీ నాట్యశాస్త్ర పోటీల్లో బహూమతిగా ఇస్తారు. దాన్ని తెస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు.

ఇదిలాఉండగా, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. తనింటిలో 34 అడుగుల పాముందని తెలుసుకుని ఆఖరికి ఓ స్వామిజీ దగ్గరకు వెళతాడు. అతను మీ ఇంటి సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. అయితే... ఇటువంటి సమస్యను సాల్వ్‌ చేసే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఉన్నారంటూ.. డా|| ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.

ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను పిలిపిస్తారు. అతను వచ్చినప్పటి నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటి తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు. అయితే ఈ క్రమంలో శరత్‌బాబుకున్న మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరిని చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడు.

అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.

తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా|| విజయ్‌ ఎలా కనిపెట్టాడు? చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది? అన్నది కథ.

ఈ చిత్రంలో డాక్టర్‌గా, రాజుగా, అఘోరాగా విక్టరీ వెంకటేష్‌ నటించాడు. మూడు భిన్నమైన పాత్రల్ని పోషించాడు. 'రాజును చూసిన కళ్ళతో మొగుడ్నిచూసి మొత్తినట్లు...'అన్న సామెత చందంలా రజనీకాంత్‌ను చూసిన కళ్ళతో వెంకటేష్‌ను చూడలేకపోయారు ప్రేక్షకులు. కానీ వెంకటేష్‌ నటన బాగుంది. 'చుమ్మా... అనే పదం ఆయన్ను అనుసరించినట్లుంది. అసలు సినిమా మొత్తం చంద్రముఖిని చూసినట్లే ఉంది. కొత్తగా కన్పించింది మాత్రం నటీనటులే.

కమలినీ ముఖర్జీ నాట్యంలో బాగా రాణించింది. శ్రద్దాదాస్‌ పాత్ర నామమాత్రమే. చంద్రముఖిగా అనుష్క చేసినా... ఆమె డాన్స్‌ సరిగ్గా చేయలేక పోవడం మైనస్‌గా ఉంది. నాగవల్లి పాత్రలో రిచా గంగోపాధ్యాయ అమరింది. దెయ్యంగా ఆమె చేసిన హావభావాలు కుదిరాయి. బ్రహ్మానందం కామెడీ సపోర్ట్‌గా ఉంది. స్వామీజీగా చంద్రముఖిలో చేసిన కన్నడ నటుడే చేశాడు.

ముఖ్యంగా సౌండ్‌ ఎఫెక్ట్‌ చిత్రానికి కీలకం. ఛాటో కె. నాయుడు కెమెరా పనితం బాగుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి. పాటలపరంగా అన్నీబాగానే ఉన్నాయి. 25 ఏళ్ళ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని.. 'అభిమానులు లేనిదే హీరోలు లేరురా.. అనుచరులు లేనిదే లీడర్లు లేరురా..' రాసిన పాట పర్వాలేదు. గురుకిరణ్ సంగీతం సరిపోయింది.

ముఖ్యంగా చెప్పాల్సింది వాసుగారి దర్శకత్వం.. స్క్రీన్‌ప్లే.... చంద్రముఖి నాగవల్లిగా ఎలామారిందనే పాయింట్‌ను చెప్పే క్రమంలో లింకులు బాగున్నాయి. కానీ, చివరికి వచ్చేసరిక స్క్రీన్‌ప్లే తేలిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. సమస్యను సాల్వ్‌ చేయాల్సిన డాక్టర్‌ విజయ్‌ చేయకపోవడమే కాక... ఏదో అదృశ్య శక్తి వచ్చి సాల్వ్‌ చేస్తుంది. అది ఎలా అనేది క్లారిటీ లేదు. మహిళా ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

Rating 5/3

12/15/10

నూతన అగ్రిమెంట్లు చేయగలమని ఛాంబర్‌ చెప్పిన తర్వాతే పోస్టుప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలియజేసింది.


విడుదలకు దగ్గరయ్యే చిత్రాలకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకోవచ్చని మంగళవారంనాడు ప్రొడ్యూసర్స్‌కు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలియజేసింది. కానీ, తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కానీ, సినిమా షూటింగ్‌లకు కానీ హాజరుకాబోమని ఏపీ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి వెంకటేశ్వరరావు, కె. రాజేశ్వర్‌రెడ్డి ఇతర యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు తమ విధానాలను వివరించారు. 10వ తేదీన ఫెడరేషన్‌ జనరల్‌ బాడీ నిర్ణయం ప్రకారం చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని తీర్మానం చేయడం జరిగింది. చర్చలకు పిలవాల్సిందిగా ఫిలిం ఛాంబర్‌ను రెండుసార్లు లెటర్లు పంపించాం. దానికి నేటివరకు ఏవిధమైన స్పందన రాలేదు.

కానీ పోస్టుప్రొడక్షన్స్‌ వర్క్స్‌ చేసుకోవచ్చని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఇచ్చిన వార్తకు మన సభ్యులెవరూ స్పందించవలసిన అవసరంలేదు. గత రెండేళ్ళుగా నిలిపి వేయబడిన వేతనాల అగ్రిమెంట్లు, 28.2.2010తో కాలపరిమితి ముగిసిన అగ్రిమెంట్లును బదులు నూతన అగ్రిమెంట్లు చేయగలమని ఛాంబర్‌ చెప్పిన తర్వాతే పోస్టుప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలియజేసింది.

తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది.




తెలుగును ముద్దుముద్దుగా మాట్లాడే రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ గర్భవతి. అందుకని గత కొంతకాలంగా చెన్నైలో తల్లితోపాటు ఉంటోంది.

అయితే లండన్‌లో ప్రసవిస్తే పుట్టిన అమ్మాయో.. అబ్బాయికి అక్కడ సిటిజన్‌‌షిప్‌ వస్తుందని భావించి అక్కడికివెళ్ళాలని నిర్ణయించుకున్నదట.

తొమ్మిదో నెల వచ్చాక ఫ్లైట్‌ ఎక్కడానికి అనుమతించరు కాబట్టి ఇటీవలే అక్కడికి వెళ్ళిపోయింది. తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది. భర్త ప్రోత్సాహంతో నిర్మాణసంస్థను స్థాపించాలని కూడా ప్లాన్‌ చేస్తోందని తెలిసింది.

12/14/10

సూర్యకి Raktacharitra సినిమా కన్నా వర్మ టేకింగ్ నచ్చిందని




రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో వచ్చిన రక్త చరిత్ర చిత్రం super టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ త్వరలోనే రిపీట్ కానుందని సమాచారం. "ది బిజెనెస్ మేన్ " పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య . త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది.
ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే . ఇక ప్రస్తుతం వర్మ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల రాజు షూటింగ్ ఫినిషింగ్ టచ్ స్ లో ఉన్నారు. ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ఇలా అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. అలాగే సూర్యకి సినిమా కన్నా వర్మ టేకింగ్ నచ్చిందని, తెలుగులో ఎలా ఉన్నా తమిళంలో బాగా వర్కవుట్ అవుతుందని చాలా ఆశలు.

అత్యద్భుతంగా పోషిస్తున్న బాలకృష్ణ:Baapu




శ్రీరాముని పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'.
బాపు దర్శకుడు.
సీతగా నయనతార,
అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి .
సాయిబాబా మూవీస్‌ పతాకం
యలమంచిలి సాయిబాబు నిర్మాణం .

కాగా ఈ చిత్రం కోసం భారీసెట్స్‌ను నిర్మిస్తున్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు కొంత షూటింగ్‌ చేశామని, సమ్మె కారణంగా తాత్కాలికంగా షూటంగ్‌ను ఆపామని నిర్మాత సాయిబాబు తెలిపారు. సమ్మె పూర్తికాగానే మళ్లీ నిరవధికంగా షూటింగ్‌ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు కొంత టాకీ, సగం పాటను చిత్రీకరించామని ఆయన వివరించారు. ఇందులో ప్రధాన తారాగణంతో పాటు 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. వాల్మీకి ఆశ్రమానికి సంబంధించిన సెట్‌ను భారీగా వేయించామని, ఇంకా పలు భారీ సెట్స్‌ను ఈ చిత్రం కోసం నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎనిమిది పాటల రికార్డింగ్‌ పూర్తయిందని, ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన పాటలు ప్రతిఒక్కరినీ అలరింపజేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో రాముడి పాత్రను అత్యద్భుతంగా పోషిస్తున్న బాలకృష్ణ లోగడ కృష్ణుడిగా, అర్జునుడిగా నటించి, మెప్పించిన విషయం తెలియందికాదని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యూనిట్‌తో పాటు తమ సంస్థకు పేరు తెచ్చిపెడుతుందని అన్నారు.

కాని ఈ పాత్రలో సుమన్ అలరించగలడని సినీ వర్గాల అభిప్రాయం ..........

హాటెస్ట్ యాడ్ సెక్సియస్ట్ అవార్డ్ రావటం లొలోపల తెగ మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ




అందరూ అనుకున్నట్టు తానేమంత సెక్సి కానోటోంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రీనా "తీస్ మార్ ఖాన్"కోసం ఏదొ కొద్దిగా ఎక్స్పోజ్ చేసిందే తప్ప ఎప్పుడు సెక్సి గా కనపడదట.అందం వేసుకునే బట్టలో కాక చూసె కళ్ళలో ఉంటుందని.ఇండియా మొత్తానికి ఐశ్వర్య రాయ్ హాట్ హిరోయిన్ అని [తన దౄష్టిలో]

అయినా హాటెస్ట్ యాడ్ సెక్సియస్ట్ అవార్డ్ రావటం నాకు గౌరవంగా భావిస్తోందటా ఇలా చెబుతునే లొలోపల తెగ మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ

ఇట్లూ:::::::::::::::::::::::::

ఆమె ఇంట్లోనే ఆమె అద్దం ముందు సిల్క్ స్మిత లా పల్చటి దుస్తులు ధరించి ఏకపాత్రభినయం:ఎవరి భామ ???








నిన్నటితరం వెండితెర సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవిత గాధ ఆధరంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే

సిల్క్ స్మిత కి టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ అన్న తార తమ్యాలు లేకుండా ఉన్న పేరు అందరికి తెలుసు అందుకే బాలీవుడ్ తార విద్యా భాలన్ ఆమె పాత్ర గురించి వివరించగానే ఎగిరిగంతేసింది.


అంతేనా ఆమె ఇంట్లోనే ఆమె అద్దం ముందు సిల్క్ స్మిత లా పల్చటి దుస్తులు ధరించి ఏకపాత్రభినయం చేస్తోందట

ఎంత చేసినా సిల్క్ స్మిత హావ భావలు ఇవ్వలేకపోతోందట పాపం .........!!!ఈ బాలీవుడ్ భామ

సినిమా మొదలు కాకుండానే చేతులేత్తేస్తోంది ఈ భామ ....................!!!!

సినీ పరిశ్రమలో సమ్మె మరో టర్న్ తీసుకుంది:మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ




point1:తెలుగు సినీ పరిశ్రమలో గత అయిదు రోజులుగా సాగుతున్న సమ్మె మరో టర్న్ తీసుకుంది.
point2:వివాదం కాస్తా దిశ మారి, నిర్మాణ వ్యయం అదుపుపై చర్చకు దారితీసింది.
point3:మూడు ప్రధాన విభాగాలు ఒక్క తాటిపై నిలిచి సమస్యలు పరిష్కరించాలని నిర్చయించుకున్నాయి
point4:ఓ హోటల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు రహస్యంగా సమావేశమయ్యారు.
point5:నిర్మాణ వ్యయం తగ్గించేందుకు హీరోలు, దర్శకులు సముఖుత వ్యక్తం
point6:అనువాద చిత్రాలను నిషేధించాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్రస్తావన తీసుకురాగా, ఈ ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించినట్లు సమాచారం
point7:ఇదే అంశాలపై మళ్ళీ మంగళవారం కూడా భేటీ
point8:దీనికి సంభందించి ఓ కమిటీని వేసినట్లు తెలిసింది.Mahesh babu&Pawankalyan మరో ఇద్దుర ముగ్గురు హీరోలతో పాటు,ఎస్.ఎస్.రాజమౌళి, వివి వినాయిక్, ఈశ్వరరెడ్డి మరో ఇద్దరు నిర్మాతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
point9:ఈ సమావేశం తీవ్రతను గమనిస్తే..మరో వారం పది రోజుల వరకూ షూటింగ్ లు జరిగే పరిస్ధితి లేదు
point10:ఈ నెల 16 న నాగవల్లి చిత్రాన్ని విడుదల చేయాలా ..వద్దా అనే విషయం పైనా చర్చ
point11:ఇటువంటి సమావేశాలకు చాలా దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఈ సమావేశానికి రావడం చిరంజీవి,నాగర్జున, కృష్ణం రాజు, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, రామ్ చఱణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, రాజశేఖర్, ఆర్ నారాయణ మూర్తి తదితరులు ఈ భేటీకి వచ్చారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, జీవిత, ఆహుతి ప్రసాద్, ఏవీఎస్, వేణు మాధవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్ర రావు, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి. వినాయిక్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్,బోయపాటి శ్రీను, మెహర్ రమేష్, నిర్మాతలు డి.రామానాయుడు, అశ్వనీదత్, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, జెమినీ కిరణ్, దిల్ రాజు, కె అచ్చి రెడ్డి,స డివివి దానయ్య ఈ చర్చలో పాల్గొన్నారు
point12:
ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించడానికి కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, లతో ఒక కమిటీ
point13:మూడు రోజుల్లో తగిన సూచనలను నిర్మాతల మండలికి, దర్శకులకు అందజేస్తుంది.
point14:మంగళవారం ఉదయం నిర్మాతల మండలి కీలక సమావేశం

బాబయ్ కాబట్టి ఇచ్చాడు మరి మరొ నిర్మాతొకొ :



WD
ఆరెంజ్ సూపర్ ప్లాప్‌తో నిర్మాత నాగబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. మొన్నీమధ్య మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో ఆరెంజ్ దర్శకునిపై పరోక్షంగా విరుచుకపడ్డాడు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తుంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోని కొందరు దర్శకులు నిర్మాతలను పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాయ్ ఆవేదనను అబ్బాయ్ అర్థం చేసుకున్నాడో ఏమోగానీ, రాంచరణ్ ఆరెంజ్ సినిమాకోసం తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. బాధపడకు బాబాయ్... నిర్మాత దెబ్బతిన్నప్పుడు నటీనటులు తప్పక ఆదుకోవాలని తన మాటగా చెప్పాడట.

మరి రాంచరణ్ బాటలో ఎంతమంది నటీనటులు పయనిస్తారో...?

సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా ది డర్టీ Pictures




క్లబ్ డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ అనే చిత్రం నిర్మితం కానుంది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను పోషించనుంది. ఇందుకోసం విద్యాబాలన్.. స్మిత బంధువులను, కుటుంబ సభ్యులను త్వరలో కలుసుకోనుంది.

మిలన్‌ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం విద్యా బాలన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది. స్మిత పుట్టిపెరిగిన ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి, స్మిత పడిన కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోనుంది. ఇందుకోసం చెన్నై‌తో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఆమె పర్యటించనుంది.

ఈ విషయమై విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్లాబ్లంస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుందని, ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయని అంటోంది. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులు, బంధువులను కలుస్తున్నట్టు బాలన్ చెప్పుకొచ్చింది

12/13/10

ఇప్పుడు ఈ వంతు మన బాలకృష్ణ తీసుకున్నాడు:క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు




కొమరం బీం ఇతను తెలంగాణ అమరవీరుడు ఈ తెలంగాణ పోరాట సమయం లో ఇతను ఫిల్మి హిరోలకు దర్శకులకు ఫెవ్రేట్ గా మారిపోయాడు. ఈ మధ్యనే ఇదే పేరుతో పవన్ కళ్యాణ్"కొమరం పులి"అని తీసి క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు దాసరి దర్శకత్వం వహిస్తున్న "పరమ వీర చక్ర"లో ఒక పాటలో బాలకృష్ణ కొమరం బీం గా కనిపించబోతున్నాడు

ఈ సినిమా సంగీతం డిసెంబర్ 28 న విడుదల కావచ్చు సినిమా జనవరి సంక్రాంతి కి విడుదలవుతుదని సమాచారం.

సెక్స్ బాంబ్ మలైకా అరోరాతో రొమాన్స్ చేయనున్నా JR Ntr




జూ ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరాతో రొమాన్స్ చేయనున్నాడు. అయితే అదేమీ సినిమా కోసం కాదు. ఎన్టీఆర్ తాజాగా ఒప్పుకున్న "జెండుబామ్" బ్రాండ్ యాడ్ నిమిత్తం ఆమెతో కలిసి స్టెప్స్ వేయనున్నారు. అలాగే ఈ యాడ్ ని తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్నారు. ఈ ముగ్గరుతో యాడ్ ఫిలిం డైరక్టర్ ప్రహ్లాద్ కక్కర్ ముంబైలో షూటింగ్ చేయనున్నారు. అలాగే మగధీర, అరుంధతి చిత్రాలకి కెమెరా అందించిన సెంధిల్ వర్క్ చేయనున్నారు. ఇక సూర్య యాడ్ తమిళంకి, ఎన్టీఆర్ యాడ్ తెలుగుకీ చేస్తూంటే, మలైకా అరోరా రెండు భాషల్లోనూ ఆమే చేస్తోంది. ఇక ఇప్పటికే మహేష్ బాబు అమృతాంజన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తూండటంతో మెయిన్ కాంపిటేటర్ అయిన జెండూ బామ్ వారు యూత్ లో క్రేజ్ ఉన్న జెండూ బామ్ కి ఎన్టీఆర్ ని తీసుకున్నారు.

ప్రపంచంలోనే శృంగార మహిళగా గుర్తింపు




బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ వరుసగా మూడోసారి ప్రపంచంలోనే శృంగార మహిళగా గుర్తింపు పొంది హ్యాట్రిక్ సాధించారు. లండన్‌ కు చెందిన టాప్ పత్రిక ‘ఈస్టర్న్ ఐ’ నిర్వహించిన ఓటింగ్‌లో ఆమెకు ప్రథమ స్థానం దక్కింది. తోటి నాయికల నుంచి గట్టిపోటీ ఎదురైనా.. అభిమానులు మాత్రం కత్రినాయే కట్టి అని తేల్చేశారు. “మరోసారి ప్రపంచస్థాయిలో శృంగార మహిళగా ప్రథమస్థానం పొందడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ కత్రినా ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కత్రినాతో పోటీ పడ్డ ప్రియాంకా చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. బిపాసా బసు మూడో స్థానంలోనూ, స్లమ్‌డాగ్ మిలియనీర్ తార ఫ్రీదాపింటో నాలుగో స్థానంలోనూ నిలిచారు

ఫ్యామిలీ లేడీస్‌తో కూడా బాగా చనువుగా ఉంటోందట.మరి మిగిలిన లేడీస్




సుమంత్ సరసన బోణి చిత్రం ద్వారా హీరోయిన్ అయిన కృతిబందాకు అవకాశాలు రాలేదు. కానీ మెగా కాంపౌండ్ అండదండలు పొందింది. రాంచరణ్‌కు క్లోజ్ అని తెలిసింది.

దీంతో పవన్ నటించే "లవ్ ఆజ్ కల్" చిత్రం రీమేక్ "లవ్లీ"లో ఛాన్స్ వచ్చిందని భోగట్టా. చందమామ ఫేమ్ కాజల్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకున్నదట. ఇలాగే మెగా అండదండలు తనకు కావాలని బలంగా కోరుకుంటోందని తెలిసింది. అందుకోసం వాళ్ల ఫ్యామిలీ లేడీస్‌తో కూడా బాగా చనువుగా ఉంటోందట.

ఎక్స్‌పోజింగ్ కోసం ఎవరినో సత్తాయిస్తుందట..?






అందాల ముద్దుగుమ్మ, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఈ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు పెద్ద పీట వేస్తోందట. ఎక్స్‌పోజింగ్ కోసం ఎవరినో సత్తాయిస్తుందట..? ఎవరినో కాదండీ బాబూ.. ఏకంగా మేనేజర్‌నే సత్తాయిచ్చింది. ఒళ్ళు దాచుకోకుండా నటిస్తానని, బడా దర్శకులు, నిర్మాతలు, హీరోల వద్ద ఈ విషయం చెప్పి కమిట్ చేయమని చెబుతోందట.

దీనికోసం హీరోలు, నిర్మాతలు, దర్శకులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య జగపతిబాబు సినిమాలో బాగా నటించిన విమలారామన్‌ను ప్రియమణి ఆదర్శంగా తీసుకుని, ఎక్స్‌పోజింగ్‌‌కు ఎగబడుతోందట. గాయం-2గా వచ్చిన జగపతి బాబు సినిమాలో విమలారామన్ ఎక్స్‌పోజింగ్‌ బాగా చేసింది.

ఈ సినిమాలో ఎక్స్‌పోజింగ్ రియలిస్ట్‌గా చేశావని విమలారామన్‌కు కూడా ప్రియమణి కితాబిచ్చిందట. అంతేకాదు.. ఈ మధ్య ప్రియమణి-విమలారామన్‌లు మంచి స్నేహితులుగా క్లోజ్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్.

వీరిద్దరూ ఏ ఫంక్షన్‌కు వెళ్లినా జంటగా వెళ్తున్నారట. సినిమాల్లో తమ తమ పాత్రలపైనే కాకుండా ఎక్స్‌పోజింగ్ ఎలా చేస్తే బాగుంటుందని సలహాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారట. మరి వీరి స్నేహంతో ప్రేక్షకులు, అభిమానులు ఏ మేరకు లాభపడుతారో వేచి చూడాల్సిందే..

12/12/10

రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు:surya




"రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు. ఇది రెండు పార్ట్ లుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ఫ్యాక్షనిస్ట్, రాజకీయ నాయకుడు అయిన పరిటాల రవి జీవిత చరిత్ర అని గుర్తించుకోవాలి. అలాగే రక్త చరిత్ర అనేది అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కోసం తీసింది కాదు. ఈ చిత్రంలోని హింసాత్మక ధీమ్ మాస్ ఆడియన్స్ లో నెగిటివ్ మోటివేషనల్ ఇన్ఫూలియన్స్ ను కలగచేస్తుంది. అయితే నేను గతంలో చాలా హింసతో కూడిన చిత్రాలు చేసాను.

అయితే వాటిలో కుటుంబం నేఫధ్యంలో కథ అల్లి ఉంటాయి, అలాగే హింసను ప్రేరేపించే సన్నివేశాలను బ్యాలెన్స్ చేయటానికి హీరోయిన్ తో ప్రేమ కథ ఉంటుంది. అయితే రక్త చరిత్ర చిత్రంలో ఇంటెన్సిటీ తగ్గుతుందని ఆ ఇంటిగ్రెంట్స్ ఏమీ పెట్టలేదు. అయినా ఇబ్బందేం లేదు. రామ్ గోపాల్ వర్మ తో మరో చిత్రం చేయటానికి నేను రెడీగా ఉన్నాను అన్నారు.

ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ప్లాప్ అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో "ది బిజెనెస్ మేన్" పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య కమిటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే డైరక్ట్ చేసేటట్లు కనపడుతున్నట్లు తెలుస్తోంది.

గగనమే గందరగోళమైందా..?




ఇటీవల అక్కినేని నాగార్జునను ఫ్యాన్స్ కలుస్తున్నారు రమ్మంటూ... సినిమా విషయాలను చెప్పేందుకు ప్రయత్నించిన దిల్ రాజుకు భంగపాటు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై నాగార్జునకు దిల్ రాజు క్షమాపణ చెప్పారు.

దీనిపై నాగ్ స్పందిస్తూ... నన్ను ఫ్యాన్స్ కోసం రమ్మని పిలిచారు. తీరా వచ్చాక బ్యాగ్‌పైపర్ బ్రాండ్ వాళ్లు రెడీగా ఉన్నారు. వారు అక్కడ ఎందుకున్నారు..? మీడియా ఎందుకు వచ్చింది..? అనేది కూడా నాకు తెలీదు. అందుకే మీతో సినిమా గురించి మాట్లాడలేదని నాగ్ చెప్పారు.

అసలు ఇలా ఎందుకు జరిగిందని అడిగితే ఎవరికి వారు ఏవేవో కారణాలు చెపుతున్నారు. దిల్ రాజు తనకు తెలీదంటాడు. మేనేజర్లు తమకు తెలియదంటారు. మరి ఎవరికి తెలుసు...? అంతా గందరగోళంగా అనిపించింది. గగనమే గందరగోళమైందా..? అన్నంత డౌటు వచ్చిందని నాగార్జున అన్నారు. గగనం సినిమా జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలవుతుందని చెప్పారు.

రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).




రోబో హీరో రజినీకాంత్ అరవై పదుల్లోకి అడుగుపెట్టారు. వయస్సు పెరిగినా వన్నె తరగని కథానాయకుడిగా రాణిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

అభిమానం పాళ్ళు కాస్త ఎక్కువైన తమిళ తంబీలు రజినీకాంత్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అభిమాన సంఘాలతో పాటు ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేస్తూ రజనీ పుట్టిన రోజున కేక్‌లు కట్ చేస్తూ పండుగలా జరుపుకుంటున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రల నుంచి సూపర్‌స్టార్‌గా ప్రకాశిస్తున్న రజినీకాంత్ అభిమానులకు ఆరాధ్యదైవం. అంతేకాదు.. రజినీకాంత్ భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత సాధించాడు. అలాగే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని తన రికార్డులు తానే అధిగమించిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).

ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో (18.08.1975లో విడుదలైన) తెరకెక్కిన ఆపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన రజినీకాంత్ 158 చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన రజినీకాంత్ 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 60వ ఏట రోబోతో హిట్ కొట్టిన యాంత్రికుడికి మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే టు రజినీకాంత్....!

12/11/10

బొద్దందాలతోనే తమిళ కుర్రకారును ఆకట్టుకుంటూ సినిమా ఆఫర్లతో నెట్టుకుంటూ వచ్చింది ఎంత కష్టం.. ఎంత కష్టం..!!




బొద్దందాల నమిత మొదట్లో చాలా స్లిమ్‌గా అందంగా ఉండేది. కానీ తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు అందాలను అపరిమితంగా పెంచేసింది.

ఈ బొద్దందాలతోనే తమిళ కుర్రకారును ఆకట్టుకుంటూ సినిమా ఆఫర్లతో నెట్టుకుంటూ వచ్చింది. కానీ ఎంతాకాలం.. అటువంటి సిన్మాల్లో నటించడం అనుకుందో ఏమోగానీ, ఇపుడు హఠాత్తుగా వ్యాయామశాలలో గంటలకొద్దీ తన భారీ అందాలను తగ్గించుకునేందుకు తంటాలు పడుతోందట.

అన్నట్లు సెక్సీ శ్రియ నమితకు శరీరం సెక్సీగా ఉండేందుకు మూడు చిట్కాలను చెప్పిందట. అవేంటని ఓ పిల్లజర్నలిస్టు అడిగితే... ఇంకేముంది... యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ అని అందట. నమిత మాత్రం ఈ మూడు అంశాలతోపాటు మరికొన్ని కష్టమైన అంశాలను కూడా చేర్చి రేయింబవళ్లు తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతోందట. ఎంత కష్టం.. ఎంత కష్టం..!!

12/9/10

కానీ ఒక్క రాత్రికి మూడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నిస్తామంటే ఆమె ఆఫర్ ని నిరాకరించిందట ఎవరామే ?




ఎవరికైనా డబ్బిస్తామంటే వద్దంటారా...?కానీ ఒక్క రాత్రికి మూడు కోట్ల రూపాయల భారీ మొత్తాన్నిస్తామంటే, నాకొద్దుపొమ్మన్నదొక అందాల భామ.ఎవరా భామ...? ఏమా కథ...? వివరాల్లోకి వెళ్తే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాగా డిమాండ్ అలాగే పేరున్న నటి.ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా యమ బిజీగా ఉంది.అలాంటి ప్రియాంక చోప్రా తమ హోటల్లో డిసెంబర్ 31 రాత్రి జరిగే వేడుకల్లో డ్యాన్స్ చేస్తే ఆమెకు మూడు కోట్లివ్వటానికి కూడా ముంబాయి హోటళ్ళు తయారుగా ఉంటే,ఆమె మాత్రం మీ మూడు కోట్లు నాకొద్దు,సినిమాలు నాకున్నాయి .నాకంతే చాలు.అదే పదివేలు అంటోంది.అసలు విషయమేమిటంటే ఆరోజు అందరూ బాగాతాగి ఉంటారు.ఆ గుంపులో ఎవరన్నా తన మీద దాడి చేస్తే ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఆటంకం కలుగుతుందన్న భావనతో ఆమె ఆఫర్ ని నిరాకరించిందట

ఒక హెరొయిన్ జీవితాన్ని కాపాడుకొకలిగింది:Traffic


ట్రాఫిక్ జాం వల్ల తప్పులె కాదండి ఒప్పులు జరుగుతాయి అలాగని ట్రాఫిక్ జాం ని ఎంకరేజ్ చేయకూడదు ఈ సుత్తి అంతా ఎందుకంటే ట్రాఫిక్ జాం అవటం వల్ల ఒక హెరొయిన్ జీవితాన్ని కాపాడుకొకలిగింది ఆమె ఎవరొ కాదు "చిత్రం"సినిమా తో పరిచయం అయిన రీమా సేన్ రెండు రోజుల క్రితం ఈమె వారణాసి లొ హింది సినిమా షూటింగ్ లొ ఉంది అదే టైం లొ వారణాసి లోని "గంగా హరతి"చూద్దామనుకుంది ట్రాఫిక్ జాం అవటం ద్వార ఆ ఘాట్ దగ్గరికి చేరుకొవటం కాస్త లేట్ అయింది అందువల్ల ఆమె మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకొగలిగింది ఇదంత దేవుడి మహిమే నని ఆమె మిడియా తో చెప్పుకొచ్చింది ........





నాలాంటివారు మరో నలుగురు ఉంటే బాగుండేది అనే భావన [males r females]




మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న మీడియా తో మాట్లాడుతూ సినిమా ప్రొడక్షన్‌ చేస్తున్నప్పుడు నేనొక్కదాన్నే మహిళను. అంతా మగవారే. నాలాంటివారు మరో నలుగురు ఉంటే బాగుండేది అనే భావన కలిగింది. హీరోల కుమార్తెలు ఎందుకు ఇండిస్టీలోకి రారో అర్థంకాదు. మహిళలు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారు. విదేశాల్లో మహిళలు ఎంతోమంది ఇండిస్టీలో ఉన్నారు. ఇక్కడా మహిళలు రావాల్సిన అవసరం ఉంది అని వివరించారు.

ఆమె మీడియా తో మాట్లాడుతూ నరకడాలు చంపడాలు కన్నా శృంగారం చూపడంలో తప్పులేదు, అదికూడా పరిమితంగా ఉండాలి. నా సినిమాలో శృంగారం ఎక్కువలేదు. సన్నివేశపరంగా రొమాన్స్‌ ఉంటే తప్పులేదు. అది తప్పనుకుంటే ప్రపంచంలో జనాభాలో మనదేశం ఎందుకు ముందుంది. అందుకే సెక్సుఎడ్యుకేషన్‌ అవసరం ఎంతైనా ఉంది. తిరుమలకొండ శిల్పాల్లో ఎన్నో శృంగారభంగిమలున్నాయి. అవి తప్పుకాదా? దేవుళ్ళకు ఇద్దరు భార్యలుంటే పూజిస్తున్నాంకదా? ఏది ఏమైనా మనలో మార్పురావాలి. మన ప్రతిభనంతా అనవసరమైన విషయాలకే వెచ్చిస్తున్నాం. మహిళకు పెళ్ళయ్యాక భర్తే జీవితం కాదు. దాంతో ఆమె కెరీర్‌ ఫుల్‌స్టాప్‌ కాకూడదు. భర్తతోపాటు కెరీర్‌ సమాజానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి.

12/8/10

పూర్తి నగ్నంగా కనబడుతూ తమ పత్రిక కవర్‌పేజీకి ఫోజిస్తే కోటి రూపాయలు Yana Gupta సందేశాన్ని పంపిందట.




ముంబయిలో ఇటీవల ఓ కార్యక్రమానికి ప్యాంటీ వేసుకోకుండా వచ్చి దర్శనమిచ్చిన యానాగుప్తా ఫోటోలను చూసి విదేశీ పత్రికలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నాయట. తాజాగా ఓ పత్రిక ఆమె ముందు మంచి ఆఫర్ ఉంచిందట.

అదేమంటే... పూర్తి నగ్నంగా కనబడుతూ తమ పత్రిక కవర్‌పేజీకి ఫోజిస్తే కోటి రూపాయలు చెల్లిస్తామంటూ సదరు పత్రిక సందేశాన్ని పంపిందట. ఆ ఆఫర్‌ను అంగీకరించే విషయమై యానా తటపటాయిస్తుందట.

ఇదిలావుంటే యానా ప్యాంటీలెస్ ఫోజిలివ్వడంపై ఇప్పటికే దేశంలో పలుచోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ పరిస్థితిలో యానా నగ్నంగా ఫోజివ్వడానికి అంగీకరిస్తే ఆమె కెరీర్ మటాష్ అవుతుందని బాలీవుడ్ ఫిలిమ్ జనం అంటున్నారు. మరి... యానా ఏం చేస్తుందో..?

12/6/10

వెంకటేష్ ఏ హిరొయిన్ తో వెళ్ళాలో మిరే చెప్పాలి


విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన నాగవల్లి చిత్రం ఆడియో హిట్ అయిన సందర్భంగా డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంది. సోమవారం హైదరాబాదులోని సినీమ్యాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వెంకటేష్ షీల్డు అందుకున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, బి. గోపాల్ చేతుల మీదుగా కమిలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్, అనుష్క, రిచా తదితరులు అందుకున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎవరూ ప్రధాన హీరోయినో అర్థం కాదు. అనుష్క కలిసుందాం రా అని పాట పాడుతుంది. కమిలినీ ప్రేమించుకుందాం అంటూ ఆడుతుంది. శ్రద్దాదాస్ పెళ్లిచేసుకుందాం రా అని ఆట పట్టిస్తుంది. రిచా మాత్రం లేచిపోదాం రా అంటుంది. ఇంతమంది ఎందుకున్నారు.. అనేది సినిమాలో చూడొచ్చు. పాటలు కథకు తగినట్లుగానే ఉన్నాయి. ప్రతి ఫ్రేమూ అందంగా కన్పిస్తుంది. నిండుగా హీరోయిన్లు కనబడతారు. నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

పి.వాసు మాట్లాడుతూ, పరుచూరి బ్రదర్స్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వాలి అనే రచయిత ఉన్నాడు. ఆయనలా రచయితలు సహకరించారు. గురుకిరణ్ చక్కని సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ సాహిత్యం చక్కగా ఇచ్చారు. రీరికార్డింగ్ హైలెట్‌గా ఉంటుంది. 16న సినిమా విడుదలవుతుంది. ఐదుగురు హీరోయిన్లు పోటీపడి నటించారు. వారికి వారి క్యారెక్టర్లు తెలీదు. సెట్‌లోకి వచ్చాక చెప్పినప్పుడు వాటికి అనుగుణంగా చక్కగా నటించారన్నారు.

అనుష్క మాట్లాడుతూ... గురుకిరణ్ మంచి సంగీతాన్ని అందించారు. పైరసీలను ప్రోత్సహించకండి. ఈ సినిమాను పి.వాసు బాగా తీశారు. మంచి అనుభూతి పొందాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వెంకటేష్‌గారి గెటప్స్ చూసి ఆశ్చర్యపోయాను. చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు అన్నారు.

త్రివిక్రమ్ వండర్ ఫుల్ టెక్నీషియన్:Mahesh


నటుడిగా ఇంతకు ముందెన్నడూ చేయని సబ్జెక్ట్ ‘ఖలేజా’..నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ‘ఖలేజా’ అంటూ ‘ఖలేజా’ సినిమా గురించి ఇంకా ఇంకా ఓ రేంజ్ లో చెబుతున్నాడు హీరో మహేష్ బాబు. బాక్సాఫీస్ వద్ద ‘ఖలేజా’ బెడిసి కొట్టిందన్న విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించిన మహేష్, ఫెయిల్యూర్ కి సవాలక్ష కారణాలుంటాయనీ, ‘ఖలేజా’ విషయంలో చేసిన అటెంప్ట్ మాత్రం చాలా గొప్పదని చెప్పుకొచ్చాడు. వెరైటీ కథల్ని తాను ఇష్టపడ్తుంటాననీ, రొటీన్ గా వచ్చే పాత్రలు తనకు అస్సలు ఇష్టం ఉండదనీ, ‘దూకుడు’ సినిమాలోనూ కొత్త మహేష్ ని చూస్తారని మహేష్ అంటున్నాడు.

అభిమానుల ప్రోత్సాహంతోనే కొత్త తరహా సినిమాలు చేయగలుగుతున్నానన్న మహేష్, ‘ఖలేజా’ సినిమా విషయంలో అభిమానులెవరూ హర్ట్ కాలేదన్నాడు. త్రివిక్రమ్ వండర్ ఫుల్ టెక్నీషియన్ అనీ, అతనితో మరో సినిమా ఖచ్చితంగా వుంటుందని మహేష్ వెల్లడించాడు. కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకొస్తేనే వెరైటీ సినిమాలొస్తాయని, అలాంటి వెరైటీ సినిమాలకోసం తానెప్పుడూ ముందుంటానని మహేష్ స్పష్టం చేశాడు.

నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు:భాస్కర్‌


నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు. నిర్మాత అనేవాడు ఇండస్ట్రీకి ప్రాణం. అటువంటి నిర్మాతను వైరస్‌లా పట్టిపీడిస్తూ పిప్పి చేస్తున్నారు కొందరు దర్శకులు. మన శరీరంలో వైరస్ ఎలా రోగాన్ని తెచ్చి చివరికి చంపేస్తుందో అలాగే చేతకాని దర్శకుడు నిర్మాతను పిండిచేసి ఆ తర్వాత వారూ చచ్చిపోతారు. ఇదంతా కడుపు మండి అంటున్నానని ఆదివారం రాత్రి రవితేజ మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో చెప్పారు.

అప్పటివరకూ సరదాగా సాగుతున్న ఫంక్షన్ కాస్తా ఒక్కసారిగా మిరపకాయ్ అంత ఘాటెక్కింది. దర్శకులు గురించి మాట్లాడుతూ... ఎన్ని రోజులు సినిమా తీస్తామో తెలియని దర్శకులున్నారు. కొత్త నిర్మాత వస్తే పురుగుల్లా దోచేస్తున్నారు. ఇది అందరినీ ఉద్దేశించినది కాదు. రాంగోపాల్ వర్మను చూడండి. ఆయన అమితాబ్ వంటి గొప్ప ఆర్టిస్టును పెట్టుకుని పరిమిత టైమ్‌లో సినిమా తీశారు. ఏం... ఆయనకంటే.. మీరు పోటుగాళ్లా.. అంటూ ప్రశ్నించారు.

ఒకప్పుడు 2సి కెమేపాతో అడవిరాముడు తీశారు. అప్పటి నుంచి టెక్నాలజీ పెరిగినా మేకింగ్‌లో రోజులు మాత్రం ఎక్కువ సాగుతున్నాయి. ఎందుకని...? దర్శకులు చేతకానివారు కాబట్టి. నిర్మాత నమ్మి డబ్బు పెడితే దోచేస్తారా..? అలాగే ఆర్టిస్టులు కూడా రేటు తగ్గించుకోవాలి. రాంగోపాల్ వర్మలా సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీని బాగు చేయండి అన్నారు.

దీంతో అదంతా ఆరెంజ్ దర్శకుడు భాస్కర్ గురించేనని అక్కడివారందరికీ అర్థమైంది. అర్థంపర్థం లేని కథతో 30 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్‌తో తీసినా ఆరెంజ్ "ఢాం"మని పేలిపోయింది. దీంతో నాగబాబు సందర్భం దొరికినపుడల్లా భాస్కర్‌పై మండిపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినాయక్.. ఒక్కసారి తనను తాను బేరీజు వేసుకుని తన సినిమాలు కూడా ఎన్ని రోజులు తీశానో అనే డౌట్ వస్తుందనీ, ఇక నుంచి నిర్మాత చెప్పినట్లే తీస్తానని అన్నారు.
Powered by web analytics software.