
రగడ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికానందున విడుదల డిసెంబర్ 24కి పోస్ట్ పోన్ అయింది. అనుష్క, ప్రియమణి, హీరోయిన్స్ గా నాగర్జున హీరోగా నటించిన ‘రగడ’కి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ ‘ఎ’సర్టిఫికెట్ ఇచ్చింది నుండసెక్సీ భామ ఛార్మి ఎంత గొప్ప డాన్సరో ఇప్పుడు కొత్తగా చెప్సేదేముంది. చాలా సినిమాల్లో తన డాన్స్ తో ప్రేక్షకుల్ని మైమరపింపజేసిన ఛార్మి, ఈ మధ్య సినిమాల్లో అవకాశాల్లేకపోయినా అడపా దడపా ఐటమ్ సాంగులతో సరిపెట్టుకుంటోంది. మంచి డాన్సర్ కావడంతో ఆవైపుగా ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఐటమ్ సాంగులంటే ఛార్మికి కోపమొస్తుందిగానీ, స్పెషల్ సాంగ్..అంటూ వాటి గురించి తనదైన శైలిలో ఉప్పొంగిపోతూ చేప్సేస్తోంది ఛార్మి. ఇంతకీ విషయమేటంటే, నాగార్జున కోసమంటూ ‘రగడ’ సినిమాలో ఐటమ్ సాంగ్..అదేనండీ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేసిన ఛార్మి ఆ పాటలో డాన్స్ ఇరగదీసేసింది. అందునా బెల్లీ డాన్స్ చేస్తూ ఛార్మి వేసిన స్టెప్పులు సినిమా టీజర్స్ లో దర్శనమిస్తోంటే, అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఐటమ్ సాంగులకే చార్మి ఫిక్సయిపోతే బెటరని ఫిక్సయిపోయిన ప్రేక్షకులు, ‘రగడ’ సినిమా తర్వాత మరింతగా, ఆమెను ఆ టైప్ లో ఎంకరేజ్ చేస్తారన్నది నిర్వివాదాంశం.