
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంగా పరిగణింపబడుతున్న మగధీర రికార్డులకు బ్రేక్ వేసే సమయం వచ్చిందంటూ ఎడాపెడా వాయించేస్తున్నారు మీడియా మిత్రులు. అరవై ఏళ్ల పరిశ్రమలో ఒక్క మగధీర రావటానికి ఎంత కాలం పట్టిందని పట్టించుకోకుండా పోకిరి, మగధీరల మధ్య ఉన్న టైం గ్యాప్ పరిగణలోకి తీసుకుంటే కొందరి వాదన నమ్మక తప్పడం లేదు.
భారీ చిత్రాలను భారీ సంఖ్య ప్రింట్లతో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటం అన్న కొత్త సూత్రం ప్రకారం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే అదృష్టం కలిసి వస్తే మగధీర కి బ్రేక్ వేసే చిత్రాలు దండిగానే చూడొచ్చు. అప్పటి దాకా ఎందుకు వచ్చే సంవత్సరంలోనే సిద్దార్థ


