










కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో బాలీవుడ్ భామ సాక్షి గులాటి చేస్తున్న పాత్ర పేరు కనిష్క. సినిమాలో ఆమె గురించి వర్మ రిలీజ్ చేసిన బ్రోచర్ లో వివరిస్తూ..బాబు గారి అండతో గ్లామర్ హీరోయిన్ అయ్యి బాబు గారికే చెక్ పెట్టడానికి ట్రై చేసిన బాగా కమర్షియల్ ఆలోచనలు ఉన్న కమర్షియల్ హీరోయిన్ అని రాసారు. ఇంతకీ ఈ పాత్ర తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ని ఉద్దేశించి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిష్క ఎవరిని గుర్తు చేస్తోంది. అలాగే ఆమెను చేర దీసిన బాబు ఎవరు..ఆయనకు చెక్ పెట్టడమేంటి అనే ఆలోచనలో పడుతున్నారు.