
మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తేజ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘మెరుపు’. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ మధ్య ఇరవై రోజుల పాటు యూనిట్ ఎంతో కష్టపడి ఒక పాటను కూడా తీశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కాజల్ ఈ సినిమా చెయ్యడం లేదు. షూటింగ్ ఎక్కువ రోజులు బ్రేక్ రావడంతో తన డేట్స్ లేవంటోంది.
ఈ సినిమా నుంచి తప్పించుకోవడానికి నిర్మాతల్ని ఏదో విధంగా కన్వీన్స్ చేసి ఒప్పించుకుంది.
