Free SMS And Earn Part Time Money







7/6/09

" సినిమాటోగ్రఫీ కోర్సు" in RAMANAIDU STUDIO


హైదరాబాద్‌లోని రామానాయుడు ఫిలిం స్కూల్‌లో కొత్తగా సినిమాటోగ్రఫీ కోర్సును డి.సురేష్‌బాబు ప్రవేశపెట్టరు. గత ఏడాది ఈ ఫిలిం స్కూల్‌ను ప్రారంభించారు, తొలుత డైరెక్షన్, స్క్రిప్టుకు సంబంధించిన కోర్సును మొదలుపెట్టారు. ఈ కోర్సు కాల వ్యవధి 15 నెలలు,బ్యాచ్ కి 30 మంది విద్యార్థులు. కాగా ఈ ఏడాది రెండవ బ్యాచ్‌ను మొదలుపెట్టరు, ఇందులో సినిమాటోగ్రఫీ కోర్సును కొత్తగా చేర్చారు . రెండవ బ్యాచ్‌కు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 22వ తేదీలోగా దాఖలు చేయాలి. ఇక ఆగస్టు నుంచి యాక్టింగ్ తదితర కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల డాక్టర్ దాసరి నారాయణరావు గెస్ట్ లెక్చర్స్ ఇచ్చారు, త్వరలో కె.రాఘవేంద్రరావు కూడా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వనున్నారు.రామానాయుడు స్టూడియోలోని ఎక్విప్‌మెంట్ విద్యార్థులకు శిక్షణ సందర్భంగా ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. కాగా ప్రతిభాపాటవాలు ఉన్న విద్యార్థులకు ఆ సంస్థ అవకాశాలు కల్పిస్తుంది. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఈ సదవకాశం టేలెంట్ ఉన్న విధ్యార్దులు వినియోగించుకోండి తల్లి తండ్రులకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సుకి పంపించండి

క్లోనింగ్ ద్వారా మనిషిని సృష్టిస్తే

ఖుషి', 'పులి' చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య ద్విపాత్రాభినయంతో తమన్నా, నమిత, మాళవిక హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రం ఇప్పుడు తెలుగునాట 'వ్యాపారి' పేరుతో అనువాదమైంది. ప్రణతి క్రియేషన్స్ పతాకంపై కూనిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా సెన్సార్ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదల చేస్తున్నట్లు నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 'క్లోనింగ్ ద్వారా జంతువులను సృష్టించడం చూశాం. కానీ ఈ చిత్రంలో క్లోనింగ్ ద్వారా మనిషిని సృష్టిస్తే, అతను ఎలాంటి అద్భుతాలు చేస్తాడన్న అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథానాయకుడు ఎస్.జె.సూర్య నటన హైలైట్‌గా ఉంటుంది. తమన్నా నటనాపరంగానే కాకుండా గ్లామర్‌గా కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇక నమిత, మాళవిక అందాలు కుర్రకారును హుషారెక్కిస్తాయి. ప్రకాష్‌రాజ్, నాజర్‌లు విభిన్న పాత్రలు పోషించారు. దేవా వీనులవిందైన సంగీతాన్ని సమకూర్చారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్‌కు గురికావడం ఖాయం. దక్షిణ భారదేశంలోనే ఇటువంటి కథాంశంతో ఇంతవరకూ ఏ చిత్రమూ రాలేదు. రీరికార్డింగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది'


Powered by web analytics software.