Free SMS And Earn Part Time Money







1/21/11

బాలకృష్ణ సినిమా హిట్టు దర్శకుడు ఫట్టు


నటసింహా బాలకృష్ణ కోసం ‘సింహా’ను దర్శకత్వం చేసి చిప్పట్టుకుపోతున్నాడు బోయపాటి శ్రీను. సినిమా హిట్టై బాలకృష్ణ మాత్రం ఓ అరడజను ఆఫర్లు వెనకేసుకుంటే బోయపాటి మాత్రం ఓ డజన్ ఆడియో ఫంక్షన్లకు హాజరై డిగ్రీ చేతబట్టుకున్న నిరుద్యోగిలా హీరోల ఇళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నాడు. ఇంకో సంవత్సరం ఆగితే పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుందెమో అన్న దిగాలు పట్టుకున్న బోయపాటి లేటు చేయకుండా జూ ఎన్టీఆర్ కోసం తయారు చేసిన కొత్త కథను మళ్లీ వినిపించేందుకు దుబాయ్ బయలుదేరాడు. బాలకృష్ణ రికమెండేషన్ మీద స్పెషల్ కోటా కింద జూ ఎన్టీఆర్ ఈ చిత్రం చేస్తున్నట్టు, అందుకే ‘శక్తి’ అయ్యేలోపే అంతా రెడీగా ఉంటే రెండు నెలల్లో బోయపాటితో ఫినిష్ చేసేందుకు యంగ్ టైగర్ గట్టి ప్లానే వేసాడట పాపం ఇలాగైనా బోయపాటి బోరుకొట్టకుండా ఉంటుంది. ఈ చిత్రానికి కె యస్ రామారావు నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు.

దీపికా పదుకొనే కోసం వ్యాపారవేత్త నిర్మాతగా మారనున్నట్లు సమాచారం


ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యులు విజయ మాల్య తనయుడు సిద్ధార్థ మాల్య (JR.మాల్య) త్వరలోనే ఓ కొత్త అవతారమెత్తనున్నారు. తన ప్రేయసి, బాలీవుడ్ HOT భామ దీపికా పదుకొనే కోసం సిద్ధార్థ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇందుకు సిద్ధార్థ్ ఓ ప్రొడక్షన్ HOUSEను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే..సిద్ధార్థ్ పెట్టబోయే చలనచిత్ర నిర్మాణ సంస్థకు బ్యానర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. కానీ.. ఈ బ్యానర్ పేరులో మాత్రం తమ కంపెనీ బ్రాండ్ పేరు (కింగ్‌ఫిషర్) వచ్చేలా సిద్ధార్థ్ అడుగులేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2012 ఆరంభంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమయ్యే అవకాం ఉంది. తన కలను నిజం చేసుకోవడం కోసం సిద్ధార్థ్ ఇప్పటికే డైరెక్టర్లు, ఆర్టిస్టుల కోసం గాలింపు మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ అప్పటి వరకూ సిద్ధార్థ్ తన తండ్రి వ్యాపారాన్నే చూసుకోనున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రొడక్షన్ House సిద్ధార్థ్ తన ప్రేయసి కోసమే ప్రారంభించనున్నారని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల కూడా సిద్ధార్థ్ దీపికకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. 16 కోట్ల రూపయాలు విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికకు సిద్ధార్థ్ బహుమతిగా ఇచ్చాడట. దీంతో అవాక్కయిన దీపూ ఆనందం తట్టుకోలేక సీనియర్ మాల్య ముందే జూనియర్ మాల్యకు ముద్దు పెట్టసేందిట.

రాం చరణ్ కోసం చెన్నై లో మెగాస్టార్ ఇక్కట్లు


Tamil, Telugu సినీ పరిశ్రమల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలు తిరుగులేని హీరోలు. వయసు మీద పడుతున్నాఈ ఇద్దరూ తమ వారసుల కోసం రంగం మొత్తం సిద్దం చేసి పెట్టేశారు. అల్రెడీ తెలుగులో రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుంటుంటే అక్కడ మాత్రం రజనీ అల్లుడు ధనుష్ ఏకంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకుతున్నాడు. సంక్రాంతికి విడుదలైన తమిళ చిత్రాలలో ‘ఆడుకలాం’ తో ధనుష్ అందరి హీరోలకన్నా ముందు వరసలో నిలచి మామకు తగ్గ అల్లుడనిపించుకున్నాడు. తెలుగులో ‘ఆరెంజ్’తో వెనకు బడ్డ రామ్ చరణ్ సైతం ఈ ‘ఆడుకలాం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతికి జరిగే కోడిపుంజు పోటీల ఆధారంగా పౌరుషాలతో తెరకెక్కిన ఈ చిత్ర కథ తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని తెలియటంతో మెగాస్టార్ తన కుంటుంబంలోని ఓ నిర్మాతని Chennai పంపి రజనీకాంత్ తో మాట్లాడి కథను Hyderabad కు తీసుకు వచ్చే పనిలో పడ్డాడట.

సినీ రంగం నుంచి టి.వి రంగమోలోకి పాకిన వ్యభిచారం:పట్టుపడిన యమున


సినీనటి యమున వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడింది. బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో గురువారం రాత్రిపూట యమునతోపాటు మరో తొమ్మిదిమంది వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని వేణుగోపాల్, సురక్షిత అనే మహిళ కూడా ఉన్నారు. ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మించిన "మౌనపోరాటం" చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకున్న యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించింది. యమున అరెస్టయిన తర్వాత ఆమెను విడిపించేందుకు బెంగళూరుకు చెందిన సినీ ప్రముఖులు కొందరు తీవ్ర యత్నం చేసినట్లు భోగట్టా. ఇదిలావుంటే యమున నిర్వహిస్తున్న వ్యభిచారం వెనుక పెద్ద సెక్స్ రాకెట్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ చెప్పారు

ఈదర వీరవెంకట సత్యనారాయణ.మరణం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ్వుల దర్శకుడిగా పేరుగాంచిన ఈవీవీ.సత్యనారాయణ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయనను రెండు రోజుల క్రితం ఆపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన మెల్లగా కోలుకుంటున్న సమయంలో శుక్రవారం గుండెపోటు రావడంతో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.

పశ్చిమగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన ఈవీవీ పూర్తిపేరు ఈదర వీరవెంకట సత్యనారాయణ. 'చెవిలో పువ్వు' సినిమాకు ఈవీవీ తొలిసారి దర్శకత్వం వహించారు. 'వారసుడు', 'హలో బ్రదర్'‌, 'అల్లుడా మజాకా' వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఈవీవీ దర్శకత్వం వహించారు. ఈయనకు తెలుగు హీరోలు అల్లరి నరేశ్‌, ఆర్యన్‌ రాజేశ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వచ్చిన 'ప్రేమఖైదీ' చిత్రంతో ఆయన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల వద్ద అసిస్టెంట్‌గా పలు చిత్రాల్లో పని చేసిన ఈవీవీ సినిమాల్లో వినోదాన్ని పండించడంలో తనకుతానే సాటి.

ప్రధానంగా 'కామెడీ కింగ్' రాజేంద్ర ప్రసాద్‌తో ఈవీవీ తీసిన అనేక చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. తన కుమారులైన అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేష్‌లతో 'బెండు అప్పారావు', 'ఎవడిగోల వారిది', 'అత్తిలి సత్తిబాబు', 'కితకితలు' తదితర చిత్రాలను నిర్మించారు. వీటితో పాటు.. సీరియస్ హీరో శోభన్‌బాబుతో 'ఏవండీ ఆవిడ వచ్చింది', అమితాబ్‌ బచ్చన్‌తో 'సూర్యవంశ్' (హిందీ), 'ఆమె', 'తాళి', 'ఆమ్మో ఒకటో తారీఖు' వంటి కుటుంబ కథా చిత్రాలను కూడా నిర్మించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Kantheti Naresh

షాపింగ్ అంటే వ్యామోహం కాదు


అసిన్ మరో యానగుప్తా అవుతుందా ప్రచారం కోసం వెతుకులాట




అనుష్క ఇన్నిగ్స్ ఎప్పటిదాక దీక్ష సేథ్ రాకతో


దీక్ష సెథ్ అనుష్క కి పోటి అవుతుందా అవుననే అంటున్నారు సినీ పండితులు అరుంధతి తరవాత పీక్ స్టేజ్ దాటేసినా అనుష్క ఇన్నింగ్స్ కధ క్లైమేక్స్ కొచ్చింది అయితే మాత్రం నాగర్జున దయవల్ల ఇండస్ట్రీలో కొట్టుకొస్తోంది[అది తరవాత సంగతనుకోండి]అనుష్క అంత ఎత్తు, ఇండస్ట్రీలో టాలీవుడ్ కత్రినా అని పేరు కొట్టేసినా వేదం సినిమా అంతగా ఆడకపోయినా రవితేజ గోపిచంద్ ల పక్కన చాన్స్ లు రావటం దీక్షకీ మంచి ప్లస్ గా మారయి మిరపకాయ్ హిట్ అనిపించుకోవటంతో గోపిచంద్ వాంటెడ్ కూడ హిట్ అయితే అనుష్క కి చెక్ పడటం ఖాయం మరి ముందు ముందు తెలుస్తుంది దీక్ష అనుష్కకి పోటిగా మారుతుందా వాంటెడ్ అటు ఇటు అయితే బరి లో లేకుండా పోతుందా అనేది

నాగర్జునకి సిక్స్ ప్యాక్ మోజు కొడుకులు అల్లుళ్ళ్లు వెక్కిరింతలూ



Powered by web analytics software.