కరెక్టే....'మిరపకాయ్' లో ప్రకాష్‌రాజ్ పాత్ర అవసరం లేదు. ఆ పాత్ర చిన్న గెస్ట్ రోల్‌లా అనిపించింది చాలామందికి. నా స్నేహితులు కూడా ఇదే అన్నారు. కానీ అంతర్జాతీయ నేరస్తుడ్ని మాస్ హీరో ఢీ కొట్టాలంటే..అంతటి రేంజ్ ఉన్న నటుడేకావాలి. అందుకు నిడివి తక్కువైనా అతన్నే పెట్టాం అంటూ వివరించారు దర్శకుడు హరీష్ శంకర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం మిరపకాయ్ సంక్రాంతికి విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే బాలీవుడ్ నటుడు అమితాబ్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నటుడు రవితేజ. చాలా ఈజ్ ఉన్న నటుడాయన. మళ్ళీ అవకాశం వస్తే రవితేజతో సినిమా చేయాలనుంది అన్నారు
హీరో రవితేజ సెట్లో ఉంటే చాలా సరదాగా గడిచిపోయేది. 'షాట్ రెడీ' అనగానే తన పాత్రలోకి వెంటనే లీనమైపోయేవారు. ఎన్నో సలహాలు ఆయన్నుంచి తీసుకున్నా. డాన్స్ కూడా చేసి చూపించేవారు. ఎన్నో రకాలుగా సహకరించాడు..ఆయన్ని మరవటం కష్టం అంటోంది రిచా గంగోపాధ్యాయ. తాజాగా ఆమె చేసిన మిరపకాయ్ చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ తన షూటింగ్ అనుభవాలు గుర్తు చేసుకుంది. అలాగే...చిత్రం షూటింగ్ పూర్తయింది అనగానే..అప్పుడే అయిపోయిందా! అనే బాధకలిగిది. దర్శకుడు హరీష్ శంకర్ కు ఇది రెండో సినిమా. సీనియర్ దర్శకుడిలా టేకింగ్ చూపాడు. లీడర్ తర్వాత మరో మంచి పాత్ర లభించింది. నటనికి అవకాశమున్న పాత్ర దొరకటం అదృష్టం అంది. అలాగే రవితేజతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని వివరించింది.
రవితేజ తన తాజా చిత్రం మిరపకాయ్తో నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ గా మారారు. రెమ్యునేషన్ బ్యాలన్స్ నిమిత్తం నిర్మాత పుప్పాల రమేష్ ఈ రైట్స్ ని రవితేజకు ఇచ్చారు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ ద్వారా రవితేజ ఈ చిత్రాన్ని తనకిచ్చిన ఏరియాని పంపిణీ చేసుకుంటున్నారు. అయితే కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా స్టడీగానే ఉన్నా ఊహించిన విధంగా విపరీతమైన కలెక్షన్స్ రావటం లేదని, సేఫ్ గా మాత్రం బయిటపడే అవకాశం ఉందని అంటున్నారు.
1/20/11
ala modalaimdi preview
ప్రేమపై తనకంటూ స్పష్టమైన అభిప్రాయాలు కలిగిన కుర్రాడు గౌతమ్ (నాని). అతను ఓ టీవీ ఛానల్ లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పని చేస్తుంటాడు. నిత్య (నిత్య మీనన్) చాలా ఉన్నతమైన భావాల కల నేటి తరం అమ్మాయి. ఆమె ఓ సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ ఇతరులకు సహాయపడుతుంటుంది. వీరిద్దరూ మంచి స్నేహితులుగాప్రెండ్స్ మారతారు. ఈ లోగా అనుకోని పరిస్ధితుల్లో కావ్య (స్నేహ ఉల్లాల్), సిమ్రాన్(కృతి) గౌతమ్ జీవితంలోకి ప్రవేశిస్తారు. దాంతో నిత్య అతన్ని దూరం పెడుతుంది. ఈ ప్రేమ జంటకు విధి చేసిన మేలేమిటన్నదే ఈ చిత్ర కథ. ఇక ఈ చిత్రం గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ...ఇది ఓ రొమాంటిక్ డ్రామా జనర్ కి చెందిన చిత్రం. అయితే నేరేషన్ మాత్రం ఓ నావెల్ గా ఉంటుంది. ఇది ఓ ఇద్దరు యంగస్టర్స్ మధ్య జరిగే కథ. ఓఅమ్మాయి, అబ్బాయి ఓ క్రాస్ వద్ద మీటవుతారు. అక్కడ నుండి వారి జీవితాల్లో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయి. ఎలా వాళ్ళిద్దరూ తమ గోల్స్ ని నెరవేర్చుకుని ఒకటి అయ్యారు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.కృష్ణవంశీ వద్ద అసోశియోట్ గా చేసిన నందినీ రెడ్డి దర్శకురాలుగా పరిచయం అవతోంది. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతుంది.
రాణ కి అనుష్క నచ్చేనా
త్వరలో రాణా చిత్రంలో హీరోయిన్ గా అనుష్క చేయనుందనే వార్తలు వినపడుతున్నాయి. రాణా,సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో త్వరలో రూపొందనున్న చిత్రంలో ఈ కాంబినేషన్ తెరకెక్కనుంది. ఇన్నాళ్ళూ వెంకటేష్,నాగార్జున,రవితేజ వంటి సీనియర్ హీరోల ప్రక్కనే చేస్తూ వస్తున్న అనుష్క ఎన్నాళ్ళ నుండో కుర్ర హీరోల సరసన చేయాలని ఉన్నా ఆఫర్స్ రావటం లేదు. అలాగే కుర్ర హీరోల ప్రక్కన చేస్తే ఆమె వారికి అక్కలా[height problem with other heroes] ఉంటుందని భావించి దర్శక, నిర్మాతలు ప్రక్కన పెడుతున్నారు. అయితే రాణా సరసన అయితే మంచి పెయిర్ అవుతుందని సెల్వ రాఘవన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఆ చిత్రం చక్కని రొమాంటిక్ కామిడీగా తెరకెక్కనుందని చెప్తున్నారు. మరో ప్రక్క రాణా మాత్రం తన ప్రక్కన లీడర్ భామ రిచానే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబడుతున్నాడు. రాణా ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నేనూ...నా రాక్షసి చిత్రంలో చేస్తున్నాడు. అతని సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది..
నీతూ కి ఒక వెబ్సైట్ కి మధ్య వివాదంలో నీతూ తో తిట్లు తిన్న యానగుప్తా
మొత్తానికి నీతు చంద్రకు Website వారు క్షమాపణ చెప్పటంతో గొడవ ముగిసింది. రీసెంట్ గా నీతు చంద్ర ‘ఆది భగవాన్’ అనే తమిళ చిత్రం కోసం హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఈ స్టిల్స్ ని అడ్డం పెట్టుకుని ఓ వెబ్ సైట్ నీతూ ప్యాంటీ లేకుండా ఓ ఫంక్షన్లో కనిపించిందని...ఆమె కూడా యానాగుప్తా బాటలో నడుస్తోందని రాసింది. దాంతో మండిపడ్డ నీతు ‘నేనేమీ యానాగుప్తాను కాను...ఉచితంగా ప్రచారం చేయించుకోవడానికి’ అంటూ కోపంగా ఆ Website నిర్వాహకులపై National Commission Of Women (NCW)కు Complaint కూడా చేసింది. దాంతో ఆ Website వారు నీతూకు సారీ చెప్పడంతో కథ సుఖాంతమయింది.
త్రివిక్రం కి పవన్ కి దొరికిన దానయ్య
త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ చిత్రం చేయటానికి రంగం సిద్దం అయింది. ఈ మేరకు త్రివిక్రమ్ చెప్పిన కథను పవన్ ఓకే చేసారు. అయితే ప్రస్తుతం తాను చేస్తున్న ప్రాజెక్టులు అయిన తర్వాతే చిత్రం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ద్వితియార్ధంలో చిత్రం రూపొందనుంది. ఇక వీరి కాంబినేషన్ లో చిత్రాన్ని నిర్మించే నిర్మాత దానయ్య. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ దర్సకత్వంలో లవ్ లీ అనే చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కిది రీమేక్. త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జీసస్ క్ట్రైస్ట్ పై నిర్మించే చిత్రంలోనూ చేస్తున్నారు. ఆ చిత్రంలో పవన్ ..సినీ దర్శకుడుగా నటిస్తున్నారు.
ఇక ఖలేజా ప్లాఫ్ తర్వాత త్రివిక్రమ్..నెక్ట్స్ చేసే చిత్రం ఇదే అవుతుంది.
సంక్రాంతి కి డిస్ట్రిబ్యూటర్స్ ని ముంచిన సినిమాలు
- బాలకృష్ణ, దాసరి కాంబినేషన్ లో విడుదలైన పరమవీర చక్ర చిత్రం ఇప్పటికే ప్లాఫ్ టాక్ సంగతి తెలిసిందే. అయితే సింహా వంటి హిట్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ఎంత ప్లాప్ అయినా కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరుత్సాహపరచదని,మొదటివారంలో పండుగ పేరు చెప్పి కొంత రికవరి అవుతుందని ట్రేడ్ లో వినపడింది. అయితే అందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది. ఎప్పుడూ మొదటిరోజు ఓపినింగ్స్ అదరకొట్టే కృష్ణా జిల్లాలో మొదటి రోజు కేవలం పద్దెనిమిది లక్షలు వసూలు చేస్తే రెండో రోజుకు లక్షా ఎనభై వేలకు పడిపోయి డిస్ట్రిబ్యూటర్స్ కి, ధియోటర్స్ వారికీ షాక్ ఇచ్చింది. ఇదే సెగ కంటిన్యూ అయితే కేవలం ముప్పై ఐదు లక్షలు మించి ఈ చిత్రం వసూలు చేయలేదని అంటున్నారు. దాంతో అక్కడ కోటి డబ్బై లక్షలు పోసి కొన్న వారి పరిస్ధితి ఏమిటనేది అర్ధం కాకుండా ఉంది.
- మరో ప్రక్క దీనికి పూర్తి విరుద్దంగా డివైడ్ టాక్ తెచ్చుకున్నా మిరపకాయ సేఫ్ గా ఉంది.
- గోల్కొండ హైస్కూల్...దాని బడ్జెట్ కు తగ్గ షేర్ తెచ్చుకుంటుందని అంటున్నారు.
- ఇక అనగనగ ఓ ధీరుడు కలెక్షన్స్ పరిస్ధితి పరమవీర చక్రకు బాగా దగ్గరగా ఉంది.
గోపీచంద్‌తో రొమాంటిక్ ఫీలింగ్:deeksha seth
నిన్నగాక మొన్నొచ్చిన పొడుగు పిల్ల దీక్షాసేథ్ అనుష్క, ఇలియానా వంటివారిని దాటుకుంటూ యమస్పీడుతో ఆఫర్లు దక్కించుకుంటూ వెళ్లిపోతోంది. అంతేకాదండోయ్... తన సెక్సీ ఫిగర్‌ను కావలసినంత గ్లామర్‌గా చూపిస్తూ టాలీవుడ్ కత్రినా అనే ఇమేజ్ ను తెచ్చేసుకుంది. తాజాగా ఆమె గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో గోపీతో నటించిన అనుభవాన్ని చెపుతూ... షూటింగ్‌లో అన్ని విషయాలు చాలా చక్కగా నేర్పాడని గోపీచంద్‌కు కితాబిస్తోంది. సోలో హీరోయిన్‌గా ఆయన పక్కన నటించడం చాలా థ్రిల్‌గా ఉందనీ, ఇటువంటి అవకాశం తక్కువ కావలంలోనే రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది. గోపీచంద్‌తో నటిస్తుంటే రొమాంటిక్ ఫీలింగ్ కల్గిందని డైరెక్టుగా చెప్పింది. వెంటనే.. నాలుక్కరుచుకుని... సన్నివేశంలో రొమాంటిక్‌గా ఫీలవ్వాలి గనుక తను చెప్పినట్లే ఫీలై నటించాననీ అంది. అనుష్కలో కూడా గోపీ అలాంటి ఫీలింగ్ కల్గించి బాగా నటింపజేశాడన్న సంగతి దీక్షకు తెలుసో లేదో మరి.
నట్టి కుమర్ యుద్దం మొదలు:నట్టికుమర్ నా మనిషి:దాసరి
తరుణ్, శ్రీహరిలతో నట్టికుమార్ 'యుద్ధం' సినిమా నిర్మిస్తున్నారు. విశాఖ టాకీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు భారతి గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.సి.ఆర్. హాజరుకావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. డా|| దాసరి నారాయణరావు, డి.రామానాయుడువంటి వారు హాజరయ్యారు. వీరిద్దరి చేతులమీదుగా చిత్రం ప్రారంభమైంది. దాసరి మాట్లాడుతూ- నట్టికుమార్ నా మనిషి. చిన్నతనం నుంచి నా వద్దనే ఉండి నిర్మాతగా మారి అరవై సినిమాలు తీశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా ఎదిగాడు. స్వయంకృషితో పైకి ఎదిగాడు. ఈ చిత్ర టైటిల్ కూల్‌ఫైట్‌లా ఉంటుంది. ఫైట్ ఈజ్ ది రైట్ అనేది కాప్షన్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. రామానాయుడు మాట్లాడుతూ- నట్టికుమార్ చూస్తుండగానే ఎదిగిపోయాడు. చక్కటి టైటిల్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ, భారతిగణేష్ ఏడాదినాడు కథ చెప్పాడు. మంచి కాన్సెప్ట్. తరుణ్ అంటే ఇష్టం. మా కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా. తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నాను అన్నారు. తరుణ్ మాట్లాడుతూ- నట్టికుమార్‌గారి 60వ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. కథ చెప్పినప్పుడు కళ్ళకుకట్టినట్లు సినిమా కనబడింది. ఇందులో పాత్రలన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. సినిమాలో ప్రతి ట్విస్ట్‌కు సమాధానముంటుంది. దర్శకుడు బాగా తీస్తాడనే నమ్మకముంది. ఈసినిమా ద్వారా యామి అనే నటి పరిచయం అవుతుంది. శ్రీహరిది పవర్‌ఫుల్ పాత్ర అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ఇది సస్పెన్స్‌తో కూడిన యూత్‌ఫుల్ సినిమా. మాస్‌లీడర్‌కి విద్యార్థి నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఈ సినిమాలో ప్రేక్షకుడు ఊహించినది జరగదు. అన్ని అంశాలతో కమర్షియల్‌గా తీస్తున్న చిత్రమిది' అన్నారు. నట్టికుమార్ మాట్లాడుతూ- దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా బాగుందనిపించింది. ఫైర్ ఉన్న పాత్రను శ్రీహరి పోషిస్తున్నాడు. రెగ్యుల్ షూటింగ్ ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరిలో జరిగే రెండు షెడ్యూల్స్‌లో ఏప్రిల్‌లో జరిగే చివరి షెడ్యూల్‌లో సినిమా పూర్తవుతుంది. అదే నెలలో విడుదలచేయనున్నాం అన్నారు.
తాత సినిమాలపై మనవడి నిర్లక్ష్యం నిర్మాతకు చిరాకు ఎవరి మనవడు???
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీయార్ నటించిన పాతాళభైరవి, రాముడు భీముడు కళా ఖండాలను ఈ జనరేషన్ లో రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినా ధైర్యం చేసి ముందుకొచ్చే నిర్మాతలే లేరు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ రామానాయుడు మాత్రం రెండింటినీ ఈ జనరేషన్ సినీ ప్రియుల కోసం మళ్లీ రీమేక్ చేస్తానంటూ ఖర్చుకు వెనుకాడకుండా జూ ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఈ రెండు సినిమాల విషయమై జూ ఎన్టీఆర్ ని సంప్రదించాను, చేద్దాం తాతయ్యా అంటాడు తప్పితే ఎప్పుడు కాల్షిట్లు ఇస్తాడు చెప్పడు. ఏదైనా ఫంక్షన్లో కనబడితే నవ్వి తప్పించుకుంటాడు కానీ ఎప్పుడు మొదలెడదాం అంటే సమాధానం ఉండదు. ఆయన రెడీ అంటే నేను ఎప్పుడో రెడీ’ అంటూ ఓ కార్యక్రమంలో రామానాయుడు జూ ఎన్టీఆర్ ప్రవర్తన పట్ల చిరాకు ప్రదర్శించారు.
కళఖండాలు విరుగుతాయి చరిత్రలు తారు మారవుతాయి బాలయ్యకి నిరూపించిన అభిమానులు
యువరత్న బాలయ్య అంటే ఇప్పటికీ అభిమానుల్లో ఓ రకమైన ప్రేమ, వాత్సల్యం. అయితే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు మెండిగా వ్యవహరించే బాలయ్యను చూసి అభిమానులు కూడా భయపడిపోతున్నారు. ‘సింహా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఈ లేటు వయసులో అందుకున్న బాలకృష్ణకు ఇక తిరుగులేదు అని అభిమానులు ఆనందిస్తున్న సమయంలో పిడుగులాంటి ‘పరమవీర చక్ర’ను అభిమానుల నెత్తిన బాదేశాడు దాసరి. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడటం అని అభిమానులు హెచ్చరించినా వారి మాటలను పెడచెవిన పెట్టిన బాలయ్యకు తగిన శాస్తి జరిగిందని కొందరు అభిమానులు ఫీలయితే ఇప్పుడేమో ‘శ్రీరామ రాజ్యం’ కూడా బాలకృష్ణ నుండి రాబోతున్న మరో బాంబు అని భయపడుతున్నారు. అలనాటి ఆణిముత్యాలు బాపు-రమణల చేతిలో రూపుదిద్దుకుంటున్న ‘శ్రీరామ రాజ్యం’ నేటి తరం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనే డౌట్ ఇప్పటికీ అభిమానులను కలవర పెడుతోంది. వరుస పెట్టి కళాఖండాలను ఏరుకుంటున్న బాలయ్యకు బాపు-రమణలు ఎంతమేర కలిసొస్తారో వేచి చూడాల్సిందే..
మహేష్ బాబు డేట్స్ ఎడ్జెస్ట్ చేయటమే కష్టం
త్వరలో మహేష్, విక్రమ్ కలిసి కనిపించనున్నారు.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మహేష్ తో దర్శక, నిర్మాతలు చర్చిస్తున్నారు. ఇంతకీ వీరి కాంబినేషన్ లో సినిమా చేసేది ఎవరనుకుంటున్నారా...ది గ్రేట్ మణిరత్నం. రావణ్ చిత్రం పరాజయంతో ఆయన విక్రమ్ కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ ఇవ్వాలని తపిస్తున్నారు. ఇది ఓ చారిత్రక చిత్రం. ఇందుకోసం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టనున్నట్లు తమిళ పరిశ్రమలో వినపడుతోంది. చారిత్రాత్మక కథ కావడంతో మణిరత్నం ఈ చిత్రాన్ని రూ.200 కోట్లతో తెరకెక్కించే యోచనలో ఉన్నట్టు చెన్నయ్ వర్గాలు పేర్కొంటున్నాయి.‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా తీయనున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. మహేష్ బాబు డేట్స్ ఎడ్జెస్ట్ చేయటమే కష్టంగా భావిస్తున్నారు. ఎక్కువ రోజులు డేట్స్ అనేసరికి ఆయన ఆలోచనలో పడుతున్నారు. ఇక ఈ చిత్రం సంగీతం కోసం ఇళయరాజాను ఎంపికచేసారు.
తాత సొమ్ము మనవడి గిఫ్ట్ లు
వెండితెర మీద లవర్ బోయ్ గా రాణా నటించలేదు కానీ, నిజ జీవితంలో మాత్రం రాణాది లవర్ బోయ్ క్యారెక్టర్ అని చాలామంది మాట్లాడుకుంటుంటారు. తనతో క్లోజ్ గా ఉండే హీరోయిన్ లకు ఈ కుర్ర హీరో ఖరీదైన గిప్ట్ లు ఇస్తాడట. రిచా గంగోపాద్యాయ, శ్రియలాంటి వారు రాణా దగ్గర్నుంచి ఎంతో ఖరీదైన గిప్ట్ లు పొందారని వినికిడి. తాజాగా ఇలియానాకు ఓ కాస్ట్ లీ గిప్ట్ ప్రెజెంట్ చేసాడట. అదేంటంటే ‘గెస్’బ్రాండ్ వాచ్. ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి ఇలియానాని తెగ సంతోషపెట్టేసాడని సమాచారం. సో ఖరీదైన గిప్ట్ లు కొట్టి హీరోయిన్లను సంతోషపెట్టడంలో రాణాది అందెవేసిన చెయ్యి అని చెప్పొచ్చు. కుర్ర హీరోల్లోనే ఇంత ఖరీదైన గిప్ట్ లు కొని ప్రజంట్ చేసేది రాణా మాత్రమే అని సమాచారం..
నచ్చాయని కాస్ట్యుంస్ లేపింది మనుషులు నచ్చితే:richa gangopadhya డైరెక్టర్ హరీష్
అమెరికాలో పుట్టి పెరిగిన రిచా గంగోపాధ్యాయ 'లీడర్'తో సాంప్రదాయమైన అమ్మాయిగా నటించింది. ఆందువల్లే 'మిరపకాయ్'లో ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు హరీష్‌శంకర్ ముందుగా ఆమెకు సాంప్రదాయమైన బ్రాహ్మణ యువతి పాత్ర గురించి చెప్పాడు. ఆ తర్వాత వెస్ట్రన్ అమ్మాయి కదా అని దీక్షసేథ్ పాత్ర కూడా చెప్పాడు. కానీ నమ్రత పాత్రనే చేస్తానని రిచా పట్టుపట్టిందట. దీంతో దర్శకుడు లంగా ఓణీ వేసే పాత్రనే ఇచ్చాడు. సినిమా షూటింగ్ అయిపోయింది. అయితే ఆ తర్వాత లంగా ఓణీ కాస్ట్యూమ్స్‌ను లేపేసిందట రిచా. అదేమని అడిగితే 'నాకు నచ్చాయి కాబట్టే దాచుకున్నానని' నొర్మొహమాటంగా చెప్పేసిందట. దర్శకుడు హరీష్ ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ... కాస్ట్యూమ్సేగా లేపుకెళ్లిందని వచ్చిరానీ తెలుగులో మాట్లాడింది. ఇంకా నయం మనుషులు నచ్చితో వారిని కూడా... అంటూ దర్శకుడు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసరికి గొల్లున నవ్వింది...
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |