11/18/10
రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్నిచుశాడట
రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో తాను టైగర్ అనే చిత్రాన్ని చూసానని, అది ఓ రబ్బిష్ సినిమా అని అన్నారు. అలాగే అది టైగర్ కాదని నిజానికి అది పిల్లి అని, చాలా సీన్స్ లో అది ఎలుక అని కామెంట్ చేసారు. అది చూసిన వారంతా పవన్ కళ్యాణ్ చిత్రం పులికి కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం గురించి ఇన్ డైరక్ట్ గా కామెంట్ అని ఫిక్స్ అయ్యారు.
అయితే ఓ మీడియా వ్యక్తి మాత్రం ఉండబట్టలేక వర్మని ఈ విషయమై కాంటాక్ట్ చేసారు. దానికాయన వెంటనే ఈ టైగర్ గురించి ఆ తర్వాత ట్వీట్ లో మరింత విస్తారంగా రాసా చదవలేదా అన్నారు. ఆ తరువాత ట్వీట్ లో ఏం రాసాడంటే...అది ఆంధోని క్విన్స్...టైగర్స్ డోంట్ క్రై చిత్రమని, కాన్సెప్ట్ వైజ్ గా గొప్ప సినిమా అని, అయితే ఫెరపార్మెన్స్, టేకింగ్ వైజ్ గా చెత్త చిత్రమని రాసారు. దాంతో కావాలని జనాన్ని మిస్ లీడ్ చేసి పవన్ పులి ని గుర్తు చేయటానికా లేక 1981లో విడదలైన టైగర్స్ డోంట్ క్రై చిత్రాన్ని నిజంగానే చూసి ట్వీట్ చేసారా అన్నది సందేహంగా మిగిలిపోయింది. అయితే ముప్పై ఏళ్ళనాటి ఓ ఫ్లాప్ చిత్రాన్ని హఠాత్తుగా గుర్తు చేసుకుని, ట్వీట్ చేయాల్సినంత పనేమి వచ్చిందనేది అందరికీ మరో సందేహం కలిగే అంశం.
"జగమేలే శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా".పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఖుషిగాSONG
Power STAR పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఖుషిగా యూనిట్ ఈ రోజు సౌత్ ఆఫ్రికా చేరుకుంది. అక్కడ మిగిలిన షెడ్యుల్ పూర్తిచేయనుంది హీరొయిన్ త్రిష ఈ షెడ్యుల్ లో పాల్గొంటుంది. రెండవ హిరోయిన్ కీర్తి కిర్ బందా ఆల్ రెడీ షూటింగ్ లొనే ఉంది ఈ సినిమా మొదటి షెడ్యుల్ వారణాసి లొ జరిగింది. కొన్ని సీన్ లు రెండు పాటలు పూర్తి చేసుకుంది "వయ్యరాల జాబిల్లి" ఒకటి రెండోది శివునికి సంబందించింది దాని లెరిక్స్"జగమేలే శివ శంకర నువ్వుంటే మాకింక భయమేందిరా". ఈ షూటింగ్ ఫిబ్రవరీ లొ పూర్తవుతుంది.
వరల్డ్ వైడ్ విడుదల ఏప్రెల్ మొదటివారం లొ ఉంటుంది .
జయంత్ , సి.పరంజ్ ఈ చిత్రానికి దర్శకులు
బడె రవి కిరణ్ ప్రెజెంట్ చేస్తున్నాడు.
ఈ సినిమా "హింది చిత్రం లవ్ ఆజ్ కల్ "రిమేక్.
"ఏ మయింది ఈ వేళ " సక్సెస్ మీట్
కొత్తబంగారం హిరో వరుణ్ సందేష్ కాజల్ అగర్వాల్ సిస్టర్ నిషా అగర్వాల్ నటించిన "ఏ మయింది ఈ వేళ " సక్సెస్ మీట్ నిన్న ప్రసాద్ ల్యాబ్[హైదరబాద్] లో జరిగింది ప్రొడ్యుసర్ రాధ మోహన్ మాట్లడుతు ఈ చిత్రం లో ఎటువంటి వల్గారిటి ఉండదని యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా నిర్మించామని ఎవరైన చూడదగ్గ చిత్రం మంచి మెసేజ్ ఉన్న చిత్రం. వరుణ్ కి నేను స్పెషల్ గా టేంక్స్ చెప్పాలని కాఫి షాప్ లో ఈ కధ వరుణ్ కి చెప్పానని 15 మినిట్స్ లో ఓకె చెప్పడని ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్ హిట్ అని డైరక్టర్ సంపత్ నంది చెప్పాడు. హీరొ వరుణ్ మాట్లడుతు డైరక్టర్ సంపత్ నంది టేలెంటెడ్ డైరక్టర్ అని నేను సంపత్ తో వర్క్ చేయడం గొప్ప ఎక్స్పిరియన్స్ అని ఈ చిత్రం క్రెడిట్ అంత సంపత్ కె దక్కుతుందని చెపాడు.
ఈ సక్సెస్ మీట్ లో హిరోయిన్ నిషా అగవాల్ , హసిని , సౌమ్య ,యం.యస్.నారయణ , సత్య నారయణ యూనిట్ సభ్యులు విచ్చేశారు..........!
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |