నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సిద్దార్ధ. అయితే ఈ మధ్య సిద్దార్ద చేసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. వరసగా 'కొంచెం ఇష్టం, కొంచెం కష్టం', 'బావ', తాజాగా 'అనగనగా ఓ ధీరుడు' ఇటు నిర్మాతలను, అటు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈ హీరో గారుతో సినిమా తీస్తే అంతే సంగతి అన్నట్లు తయారైంది. మొదట 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి వేరే హీరోని అనుకున్నా దర్శకుడు ప్రకాష్ పట్టుబట్టి సిద్దార్దని హీరోగా తీసుకున్నారు. అప్పటికీ అతని తండ్రి రాఘవేంద్రరావు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోలేదని, సిద్దార్దతో పెట్టుకుంటే ఇంతేనని ఇప్పటికి తెలిసి ఉంటుందని అంటున్నారు.
1/26/11
సిద్దార్ధ వద్దని రాఘవే0ద్ర రావు ముందునుంచే హెచ్చరిక చేశాడు
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో సిద్దార్ధ. అయితే ఈ మధ్య సిద్దార్ద చేసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. వరసగా 'కొంచెం ఇష్టం, కొంచెం కష్టం', 'బావ', తాజాగా 'అనగనగా ఓ ధీరుడు' ఇటు నిర్మాతలను, అటు బయ్యర్లను నిలువునా ముంచేశాయి. సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న ఈ హీరో గారుతో సినిమా తీస్తే అంతే సంగతి అన్నట్లు తయారైంది. మొదట 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి వేరే హీరోని అనుకున్నా దర్శకుడు ప్రకాష్ పట్టుబట్టి సిద్దార్దని హీరోగా తీసుకున్నారు. అప్పటికీ అతని తండ్రి రాఘవేంద్రరావు హెచ్చరిస్తూనే ఉన్నా పట్టించుకోలేదని, సిద్దార్దతో పెట్టుకుంటే ఇంతేనని ఇప్పటికి తెలిసి ఉంటుందని అంటున్నారు.
పరుచూరి మురళి తో భారీ సెట్ వేయించి ఏమి తెలిదంటున్న అటవి శాఖ [balakrishna hero]
బాలకృష్ణ, పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఈ చిత్రం నిమిత్తం విశాఖ పరిసర ప్రాంతాల్లోని జలాశయం వద్ద ఓ భారీ సెట్ ని వేసారు. విశాఖపట్నం జిల్లాలోని చమురుగడ్డ రిజర్వాయర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టి వేసిన ఈ సెట్ ఇప్పుడు ఎందుకూ ఉపయోగపడకుండా పోతోంది. కారణం..అక్కడ స్ధానిక ప్రజానీక ఈ జలాశయం ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆందోళన ప్రారంభించారు. అక్కడ చెట్లు నరకటానికి వీల్లేదని అంటున్నారు. దాంతో అటవీశాఖ అనుమతి తీసుకుని ఈ సెట్ ప్రారంభించినా ఇప్పుడు షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జలాశయంపై అక్రమ నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇది కేవలం సెట్ అన్నా ఎవరూ వినిపించుకోవటం లేదు.దాంతో తామూ ఏమీ చేయలేమని, పర్మిషన్ దాకా అంటే ఇవ్వగలం కానీ అంతకు మించి ప్రజాభీష్టాన్ని దాటి ముందుకు వెళ్ళలేమని చేతులెత్తేసారు. మరో ప్రక్క యూనిట్ కి అక్కడ రాజకీయంగా కూడా సపోర్టు దొరికేటట్లు కనపడటం లేదు. ఈ స్ధితిలో వేరొక చోట సెట్ వేసి షూటింగ్ ప్రారంభించాలా అంటే దాదాపు కోటి రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆలోచనలో పడుతున్నారు. బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో ఏమీ కలగచేసుకునేది లేదని స్పష్టం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు.పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్, ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: కల్యాణిమాలిక్. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.
దాసరి డైలాగులు తీసేశారు
బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పరమ వీర చక్ర'. తేజా సినిమా పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో అమీషా పటేల్, నేహా ధూపియా, షీలా, జయసుధ, మురళీమోహన్, విజయ్‌చందర్, విజయ్ కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ నటించారు. పదహారు రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 12-1-11న విడుదలై ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్‌గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్ నెం 66) బాంబ్ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.
2. తొమ్మిదవ రీలులో (సీన్ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్', భారత్ కి కుత్తే' పదాలను తొలగించారు.
3. అయిదు ఆరు రీళ్లలో (సీన్ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్‌తో విలన్ అన్న డైలాగ్‌ని కత్తిరించారు.
4. పదిహేనవ రీలులో (సీన్ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్‌ని తొలగించారు.
5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్ కుమారునికి ఎ.కె.47 గన్‌ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.
6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్‌ని తొలగించారు.
'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్‌తో యుఎ సర్టిఫికెట్‌ని ఈ కట్స్‌తో 31-12-2010న జారీ చేసారు
ఏది ఉంచిన ఏది తీసినా సినిమా దొబ్బిందంతే
1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్‌గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్ నెం 66) బాంబ్ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.
2. తొమ్మిదవ రీలులో (సీన్ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్', భారత్ కి కుత్తే' పదాలను తొలగించారు.
3. అయిదు ఆరు రీళ్లలో (సీన్ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్‌తో విలన్ అన్న డైలాగ్‌ని కత్తిరించారు.
4. పదిహేనవ రీలులో (సీన్ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్‌ని తొలగించారు.
5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్ కుమారునికి ఎ.కె.47 గన్‌ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.
6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్‌ని తొలగించారు.
'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్‌తో యుఎ సర్టిఫికెట్‌ని ఈ కట్స్‌తో 31-12-2010న జారీ చేసారు
ఏది ఉంచిన ఏది తీసినా సినిమా దొబ్బిందంతే
రోబో పక్కన దీపికా పదుకొనే
'రోబో' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చేయనున్నారనేది అంతటా ఆసక్తికరమైన విషయం. అయితే తమిళ పరిశ్రమనుంచి వస్తున్న వార్తలను బట్టి ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రకంలో హీరోయిన్ గా దీపికా పదుకొణే ని ఎంపికచేసారు. ఇక ఈ చిత్రం ద్విపాత్రాభినయంతో ఉండనుందని, హాస్య ప్రధానంగా సాగనుందని చెప్తున్నారు. దీపిక కూడా రజనీ ప్రక్కన ఎంపిక కాపవంటో చాలా సంతోషంగా ఉంది. ఆమె హిందీ చిత్రాల్లో పూర్తి బిజీగా ఉన్నా..మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, కాల్షీట్స్ సర్ధుబాటు చేసుకుని నటించటానికి రెడీ అవుతోంది
నా కళ్లు, శరీర కదలికలు నెగిటివ్ రోల్స్ కు సరిపోతాయి.
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ అదరకొట్టిన ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ త్వరలో విలన్ గా దర్శనమివ్వబోతోంది. ఓ కన్నడ చిత్రంలో ఆమె ప్రతినాయకి పాత్రను పోషించేందుకు సైన్ చేసింది.ఈ విషయమై మాట్లాడుతూ..నా కళ్లు, శరీర కదలికలు నెగిటివ్ రోల్స్ కు సరిపోతాయి. అందుకే తమ చిత్రాల్లో లేడీ విలన్ గా నటించమంటూ గతంలో చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఎప్పుడూ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే నటనకు ఏ పాత్ర అయినా ఒకటే...అనిపించి ఓ కన్నడ చిత్రం కమిటయ్యాను. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించగలనను నమ్మకముంది. అతి త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలిపింది. ముమైత్ ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘నేను.. నా రాక్షసి’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది
శంకర్ కి రాం గోపాల్ వర్మ సినిమా గురించి ఎందుకో
"రక్తచరిత్ర సినిమాలా నా సినిమాలో హత్యలు లేవు. కుట్రలు లేవు. ఇతర సినిమాల మాదిరిగా సెక్సీ సీన్లు లేవు. మా సమస్యలపై మేం సినిమా తీస్తే ప్రాంతీయ అభిమానంతో అడ్డుకుంటారా!? ఇదెక్కడి న్యాయం!?'' అంటూ ఎన్ శంకర్ ప్రశ్నిస్తున్నారు. తన తాజా చిత్రం జయబోలో తెలంగాణ గురించి ఆయన రీసెంట్ గా సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటూ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అయితే ఆయన గతంలో తీసిన సినిమాలు...ఎన్ కౌంటర్ ,యమ జాతకుడు, జయం మనదేరా, ఆయుధం, రామ్ చిత్రాలులో హత్యలు ఉన్నాయి..కుట్రలూ ఉన్నాయి...సెక్సీ సీన్స్ ఉన్నాయి అనేది నిజం. ఈ విషయమే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఉద్యమం మీద సినిమా తీసాననని గతంలో తాను తీసిన సినిమాలు మర్చిపోయి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రతోనూ పోలీక తేవటం, మిగతా వాళ్ళ సినిమాలు కుట్రలు కుతంత్రాలు,సెక్స్ తో నిండి ఉంటాయన్నట్లుగా మాట్లాడటం ఎంత వరకూ సబబు అంటున్నారు. ఇక శంకర్ తన చిత్రంలో తెలంగాణ దీన గాథలు, ధర్మ పోరాటాలు మాత్రమే ఉన్నాయన్నారు. సినిమాను అడ్డుకుంటే న్యాయ, ధర్మ పోరాటం చేస్తానని హెచ్చరించారు.
చార్మి అందాలకు పని
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకన్ను ఛార్మిపై పడింది. దాంతో ఆమెకు బాగా కలిసి వచ్చేటట్లు కనపడుతోంది. ప్రస్తుతం ఆమె పెద్ద హీరోల సినిమాలపై ఆశ వదిలేసుకుంటున్న సమయంలో రవితేజ సరసన దొంగల ముఠాలో ఆఫర్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పూరీ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాను నిర్మించనున్న బుడ్డ చిత్రంలోనూ ఆమెను తీసుకున్నారు. మొదట ఈ పాత్రకు తాప్సీని అడిగారు. కానీ తాప్సీ తమిళంలో ధనుష్ తో చేసిన చిత్రం హిట్టవటంతో అక్కడ బిజీగా మారింది. దాంతో ఆమె డేట్స్ లేవంటూ రిజెక్టు చేసింది. వెంటనే ఛార్మి ఆ ప్లేసులోకి దూరిపోయింది. ఇక ఛార్మి ఈ రెండు ప్రాజెక్టులలోనే కాక మరిన్ని వర్మ చిత్రాల్లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఆ తర్వాత మహేష్,పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.
రాంచరణ్ కి ఝలక్ ఇచ్చి పవన్ ని ఓకే చేసింది ఈ హిరోయిన్
పవన్ కళ్యాణ్ తాజాగా సూపర్ హిట్ దబాంగ్ రీమేక్ ని గబ్బర్ సింగ్ టైటిల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దబాంగ్ హిట్టవటానికి సల్మాన్ ఖాన్ వెరైటీ నటన ఎంత ఉపకరించిందో అంతకు రెండు రెట్లు అందులో హీరోయిన్ గా కొత్తగా పరిచయం అయిన సోనాక్షి సిన్హా అంతలా తోడ్పడింది దాంతో ఈ గబ్బర్ సింగ్ కు కూడా ప్రెష్ పేస్ తో ఉండే హీరోయిన్ అవసరమొచ్చింది. . దాంతో హీరోయిన్ గా కాజల్ ని ఈ చిత్రంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆమె అడగ్గానే ఎగిరి గంతేసినట్లుగా డేట్స్ కేటాయించింది. [అయితే అంతుకు ముందు ఆమె రామ్ చరణ్ తాజా చిత్రం మెరుపుకు డేట్స్ లేవని ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఇక ఈ గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ ఈచిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.]మరి అప్పుడు కలిసిరాని డేట్స్ ఇప్పుడెలా కలిసొచ్చాయ్ పవన్ కల్యణ్ కి మాత్రమే కాదండోయ్ మాస్ మహ రాజ్ రవితేజ సరసన నటిస్తోందని సమాచారం
రవితేజ సత్తా ఈ సినిమా తో తేలనుంది
హిట్ మీద హిట్ కొడుతూ ఎప్పటికప్పుడు తన సత్తా చూపిస్తున్న మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘రైడ్’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వీర’. ఇది రవితేజ నటిస్తోన్న మరో పక్కా మాస్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రను చేస్తున్నాడు. మామూలుగా ఆయన ఒక పాత్ర చేస్తేనే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ లభిస్తుంది. ఇక రెండు షేడ్స్ ఉన్న పాత్ర అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. రవితేజ సరసన కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. పరుచూరి వారి కలానికి ఉన్న పవర్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన ‘కిక్, మిరపకాయ్’ చిత్రాలకు హిట్ సాంగ్స్ అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
రోబొ సినిమా తీసిన వంటి నిర్మాతల కోసం కమల్ కధ వెతికాడు అది???
పేరుకే లోకనాయకుడు కానీ ఈ మద్య తన న్యాచురల్ మార్కును కోల్పోతున్న కమల్ హాసన్ మళ్లీ ఓ పాత సినిమాను నెత్తికెత్తుకున్నాడు. సుమారుగా 15ఏళ్ల క్రితం ‘మరుదనాయగం’ అనే భారీ చిత్రాన్ని మొదలు పెట్టి మధ్యలో వదిలేసిన కమల్ ఇప్పడు ఆ కథని బూజు దులిపే పనిలో పడ్డాడట. అప్పటి ఆ సినిమా క్లిప్పింగులు, స్ర్కిప్ట్ లు తెప్పించుకుని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మనిగిపోయాడు. మధురై సంస్థానం, పోలిగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభైకోట్లకు పైగా పెట్టుబడి కావాల్సి రావటంతో అప్పుడు సినిమాను నిలిపేశాడు. రజనీకాంత్ రోబో సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవ్వటంతో మళ్లీ ‘మరుదనాయగం’కు కొత్త ఊపిరి పోసేందుకు సిద్దమయ్యాడు.
కమల్ కూతురికి ట్విట్టర్ బాధలు
సంక్రాంతికి విడుదలైన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన అందం శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైన ఆమె గత కొంత కాలంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ తో సమస్యలు ఎదుర్కోంటోంది. ఎవరో ఓ వ్యక్తి తన కిష్టం వచ్చినట్టు ఆమెను అసభ్యకరమైన, విచిత్రమైన ప్రశ్నలతో వేధిస్తున్నాడట. దాంతో ఏం చేయాలో పాలుపోని శృతి ట్విట్టర్‌లో పోస్టులు రాయటం తగ్గించిందిట. అయితే ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారు కాస్త మనస్సు పెట్టి ఆలోచించాలని, ఇలాంటి పనులు తగదని, ఇంకా ఎక్కువ చేస్తే ఎంక్వైరీ చేసి మరీ మూయించగలనంటూ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం శృతి సూర్య సరసన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ‘7మ్ అరివు’ చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా నటిస్తున్నారు. సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరిగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం విదేశాలు వెళ్ళనున్నారని తెలుస్తోంది. రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు
సిద్దార్ద హీరోగా నిర్మితమయ్యే "ఓహ్..మై ప్రెండ్" చిత్రం release on february
దిల్ రాజు నిర్మాతగా సిద్దార్ద హీరోగా నిర్మితమయ్యే "ఓహ్..మై ప్రెండ్" చిత్రం పిభ్రవరి మూడవ వారంలో విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడుని పరిచయం చేయనున్నారు. బొమ్మరిల్లు తర్వాత దిల్ రాజు, సిద్దార్ధ కాంబినేషన్లో మరో చిత్రం రాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావటంతో మంచి క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. అయితే బావ,అనగనగా ఒక ధీరుడు చిత్ర్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో ఈప్రాజెక్టుపై రకరకాల అనుమానాలు వచ్చాయి. ఇక ఈ చిత్రం నువ్వే కావాలి లాంటి కథతో స్నేహం, ప్రేమ అంశాల చుట్టూ తిరిగే రొమాంటిక్ కామిడిగా ఈ చిత్రం స్క్రిప్టు తయారైందని తెలుస్తోంది. ఈ చిత్రంపై దిల్ రాజు చాలా ఆశలు పెట్టుకున్నట్లు..ఓ ప్రెష్ ధాట్ తో చిత్రం చేయనున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అతిధి ఫేమ్ అమృతారావు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి
చందమామ కధలో హిరో ప్రకాష్
చక్కని చందమామ కథను తీసుకుని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో, విజువల్ ఎఫెక్ట్స్‌తో, మంచి నటనతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రకాశ్ నిజంగా ధీరుడే అంటున్నారు వేదం,గమ్యం చిత్రాల దర్సకుడు క్రిష్. ఆయన రీసెంట్ గా ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాన్ని చూసిన దర్శకుడు క్రిష్ తన అభిప్రాయాలను మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..తెలుగు చిత్ర స్థాయిని చాలా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడు. చందమామ కథను నీట్‌గా, వ్యాపారాత్మక విలువలతో రూపొందించారు. చిత్రానికి నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉన్నతమైన గ్రాఫిక్స్ ఇందులో కనిపించాయన్నారు. సిద్ధార్థ్, శృతి హాసన్ జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో డిస్నీ, కె.రాఘవేంద్రరావు సమర్పించిన చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’ . ఈ చిత్రం భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుం
పవన్ సరసన అనుష్క నటించబోతోందా??ఎమో మరి???
టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ, కుర్రాళ్లలో తనకంటే పొడుగ్గా ఉండేవాళ్లందరితోను నటించేిసన అనుష్క ఇంతదాకా పవన్ కళ్యాణ్ తో మాత్రమే నటించలేదు. గతంలో ఓసారి పవన్ తో నటించే అవకాశం ఆమెకి వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. ఎట్టకేలకు పవర్ స్టార్ తో అనుష్కకి పరిచయం జరగడానికి వేదిక సిద్దమవుతోంది. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో కథానాయికగా నటించే అవకాశముందని తెలిసింది. అనుష్క కి ప్రస్తుతం కాలం కలిసి రాకపోయినా కానీ ఆమె క్రేజ్ కి ఉన్నపళంగా వచ్చిన ఢోకా ఏమీ లేదు కాబట్టి, ఎప్పుడూ హైదరాబాదులోనే, అందుబాటులోనే ఉంటుంది కాబట్టి, షూటింగ్ కి ఎలాంటి అవాంతరం ఏర్సడదు కాబట్టి అనుష్కకే ‘గబ్బర్ సింగ్’ స్టాంప్ వేసే ఛాన్స్ ఉంది.
అయితే ఈ వార్తని ఇంకా గబ్బర్ సింగ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ అవకాశం వచ్చినందుకు త్రిష మాదిరి ఎగిరి గత్తే ఎస్తోందో లేదా ఏకంగా హిట్టే ఇస్తుందో వేచి చూడాల్సిందే.
అయితే ఈ వార్తని ఇంకా గబ్బర్ సింగ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ అవకాశం వచ్చినందుకు త్రిష మాదిరి ఎగిరి గత్తే ఎస్తోందో లేదా ఏకంగా హిట్టే ఇస్తుందో వేచి చూడాల్సిందే.
wanted [కి సినిమా కి సంబంధం లేదు]preview
రాంబాబు (గోపీచంద్) హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఎప్పటికప్పుడు ఈ రోజు గడిచిపోతే చాలు అనుకుటూ ఏ లక్ష్యం లేకుండా తన జీవితం గడుపుతూంటాడు. ఉద్యోగం చేయటానికి కూడా ఇష్టపడడు. అతనికి ఇంట్లోవాళ్లు సపోర్టు ఇచ్చి జాబ్ చేయనివ్వరు . ఇలా పనిపాటా లేకుండా తిరిగే అతని జీవితంలోకి నందిని (దీక్షాసేథ్) ప్రవేశిస్తుంది. ఆమె పరిచయంతో రాంబాబు పూర్తిగా మారిపోతాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం నందిని మనసు గెలుచుకోవడమే. అయితే ఆమె తన ప్రేమని ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెడుతుంది. వాటిని నెరవేర్చి ఆమె చేయి అందుకోవటం కోసం రాంబాబు ఏం చేశాడన్నదే మిగతా కథ.
ఈ కథలో బసివిరెడ్డి (ప్రకాష్‌రాజ్) పాత్ర రాంబాబుకి సరైన సవాల విసురుతుంది.ఇందులో పల్లెటూరి పిల్లగా దీక్షాసేధ్ సోలో హీరోయిన్‌గా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం టైటిల్ గురించి దర్శకుడు బి.వియస్ రవి మాట్లాడుతూ..హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అంటున్నారు. ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు. సంస్థ: శ్రీ భవ్య క్రియేషన్స్ నటీనటులు: గోపీచంద్, దీక్షాసేథ్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, చంద్రమోహన్, జయసుధ తదితరులు. సంగీతం: చక్రి కూర్పు: శంకర్ ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్ నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్ రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |