11/11/10
War Between Pavan &Jr.ntr
సెప్టెంబర్ లో కొమరం పులి’, బృందావనం’ చిత్రాలు ఢీకొంటాయని, పవన్, జూ ఎన్టీఆర్ [^] మద్య పోటీలో విజేత ఎవరో తేలిపోతుందని అప్పట్లో మీడియాలో కథానాలు బాగానే వినిపించాయి. అయితే ‘పులి’, బృందావనం’ అయిదు వారాల గ్యాప్ తో విడుదలవడం వల్ల రెండిటి మద్య పోటీ జరగలేదు. బృందావనం వచ్చేసరికే పులి తోక ముడిచేయడంతో ఈ సినిమాల మధ్య కంపేరిజన్ కి ఆస్కారం లేకుండా పోయింది. బృందావనంకి జస్ట్ ఏడో రోజుల ముందు వచ్చిన ఖలేజాతోనే ఎన్టీఆర్ సినిమాకి పోలిక వచ్చింది అయితే పులిని కూడా పోటీలో కౌంట్ చేసి అంతిమ విజేత బృందావనం అని తేల్చేశారనుకోండి.
కానీ నిజానికి దసరా సీజన్ ని ‘రోబో’ ఏలేస్తే, బృందావనం దానిని కనపడకుండా పక్కనెక్కడో ఆడింది. ఏదేయితేనేం రెండో స్థానానికి జరిగిన పోటీలో ఎన్టీఆర్ కే టాప్ ప్లేస్ దక్కింది. అంతకుముందు ‘అన్నవరం’తో ‘రాఖీ’గా పోటీ పడ్డప్పుడు దక్కని పైచేయి ఈ సారి అతనికి లభించింది. ఇదిలా వుంటే మళ్లీ పవన్, జూ ఎన్టీఆర్ ల సినిమాల మద్య పోటీ అనివార్యమనిపిస్తోంది. పవన్ ‘లవ్ లీ’, జూ ఎన్టీఆర్ ‘శక్తి’ ఏప్రిల్ ప్రథమార్థంలోనే విడుదలకి సిద్దపడుతున్నాయి. రెండిటి మధ్య జోనర్ లో చాలా డిఫరెన్స్ ఉన్నా స్టార్ వేల్యూ రిత్యా పోటీ తప్పదనిపిస్తోంది. ఈ లవ్ లీ వార్ లో ఎవరు శక్తి మంతుడనిపిచుకుంటాడో చూడాలి మరి.
Exclusive Interview With Ramcharan
హాలీవుడ్ స్థాయిలో రూపుదిద్దుకుని ప్రేక్షకుల మన్ననలు పొందిన "మగధీర" చిత్రం రామ్‌చరణ్ తేజకు రెండో సినిమా. 78 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన కథానాయకుడుగా రామ్‌చరణ్‌తేజ సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది.
రామ్‌చరణ్ మూడో చిత్రం "ఆరంజ్" మరో వారం పదిరోజుల్లో మనముందుకు రానున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా వెళ్ళేందుకు ముందు మీడియాను కలిసిన చరణ్ పలు విషయాలు వెల్లడించారు.
ప్రశ్న: మీ పేరులో రామ్‌చరణ్‌తేజలో "తేజ" తీసివేయడానికి కారణం?
జ: నాకు రామ్‌చరణ్ అంటేనే ఇష్టం. ఇంట్లో అందరూ అలానే పిలుస్తారు.
ప్రశ్న: 'మగధీర' తర్వాత మీలో వచ్చిన మార్పేంటి?
జ: ఏమీ లేదండి. ఎందుకంటే నా బిగ్గెస్ట్ క్రిటిక్స్ నా ఇంట్లోనే ఉన్నారు. "సాధించింది గోరంత సాధించాల్సింది కొండంత" అనే సిద్ధాంతంతోనే ముందుకు సాగాలన్నది మా నాన్నగారి దగ్గర్నుంచి నేను నేర్చుకున్నాను. కాకపోతే అయిదారు సినిమాల కోసం శ్రమపడినట్లు "మగధీర" కోసం కష్టపడ్డాం. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే సంతృప్తి, ఆనందం మాత్రం ఉంది. అంతకు మించి నాలో మార్పేమీ లేదు. ఈ విషయం నేనేదో ముఖస్తుతి కోసం చెప్పడంలేదు. నిజంగానే చెబుతున్నాను.
ప్రశ్న: ఖాళీ సమయాల్లో మీరేం చేస్తుంటారు?
జ: సినిమాలు చూస్తుంటాను. హీరో అయ్యాక షూటింగ్ బిజీలోనూ, డిస్కషన్స్ బిజీలోనో పడి మిస్సయిన మంచి సినిమాలు చూస్తుంటాను. సినిమాలు కాకుండా మరొక వ్యాపకం గుర్రాలు. గుర్రాలంటే నాకు చాలా ఇష్టం. "మగధీర"లో మీరు చూసే గుర్రం నా స్వంత గుర్రమే. మొన్నటి వరకూ రెండు గుర్రాలే ఉండేవి. ఈ మధ్య మరో రెండు గుర్రాలు కొన్నాను. మొదటి రెండు గుర్రాల్లో ఒక గుర్రం పేరు బాద్‌షా, మరొక గుర్రం పేరు కాజల్. అయితే దీనిని మీరు మరోలా అపార్ధం చేసుకోకండి. నేనా గుర్రాన్ని కొనేనాటికే ఆ గుర్రం పేరు కాజల్. అప్పటికి కాజల్‌తో కనీసం నాకు పరిచయం కూడా లేదు.
ప్రశ్న: ప్రేమ గురించి మీ అభిప్రాయమేమిటి?
జ: ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పంచేదే నిజమైన ప్రేమ. ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమ మనకు మన తల్లిదండ్రుల నుంచి మాత్రమే దొరుకుతుంది. మనం చేసే తప్పులు, మన బలహీనతలు అన్నిటితో సహా మనల్ని వారు ప్రేమిస్తారు.
ప్రశ్న: నేనడిగింది ఆ "ప్రేమ" గురించి కాదు.. యుక్తవయసు వచ్చాక కలిగే ప్రేమ గురించి..?
జ: ప్రేమ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. అయితే ప్రస్తుతానికి నా మనసులో ప్రేమకు చోటు లేదు. నా ధ్యాస, నా శ్వాస అంతా కెరీరే.
ప్రశ్న: అంటే.. ఇప్పట్లో పెళ్ళి చేసుకోరా?
జ: అప్పుడే పెళ్లేమిటండీ బాబూ.
ప్రశ్న: సరే.. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు కుదిర్చిన వివాహాన్ని ఇష్టపడతారా?
జ: ఇప్పుడే చెప్పాను కదా. ఇప్పట్లో ఆ ఆలోచన లేదని. అయితే పెద్దల అంగీకారంతో కూడిన ప్రేమ వివాహం అయితే బాగుంటుందని ప్రస్తుతానికి నా అభిప్రాయం.
ప్రశ్న: మీరు బాగా ఇష్టపడే భారతీయ వంటకం ఏమిటి?
జ: ఆకుకూరలు, కాయగూరలతో చేసే ఇండియన్ ఫుడ్ ఏదైనా సరే నాకిష్టమే.
ప్రశ్న: మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏమిటి?
జ: క్రికెట్
ప్రశ్న: మీ ఫేవరెట్ హాలీడే స్పాట్?
జ: బెంగళూరులో మాకున్న ఫామ్‌హౌస్.
ప్రశ్న: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఈ ముగ్గురిలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏమిటి?
జ: మహేష్ అందం అంటే ఇష్టం (ఆ అందంలో కాస్తంత మాక్కూడా ఇవ్వచ్చు కదా), ఎన్టీఆర్‌లోని ఎనర్జీ అంటే ఇష్టం. బన్నీలోని స్పోర్టివ్‌నెస్, సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇష్టం.
ప్రశ్న: మీ ఫాదర్ చిరంజీవిగార్ని ఒక ఫాదర్‌గా, ఒక హీరోగా, ఒక లీడర్‌గా మీరెలా అభివర్ణిస్తారు?
జ: ఫాదర్‌గా హి ఈజ్ మోస్ట్ అండర్‌స్టాండింగ్ ఫాదర్. హీరోగా ఆయన డైరక్టర్స్ హీరో. లీడర్‌గా హి విల్ క్రియేట్ వండర్స్.
ప్రశ్న: మగధీర సక్సెస్‌లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్, హీరో రామ్‌చరణ్‌తేజలతో ఎవరి పాత్ర ఎక్కువని మీరు భావిస్తారు?
జ: ఈ సినిమాకు పనిచేసిన 300 మందిలో ప్రతి ఒక్కరికీ ఈ "మగధీర" విజయంలో సమాన పాత్ర వుందని నేను భావిస్తాను.
ప్రశ్న: ఫ్లాఫ్.. లవ్ ఫెయిల్యూర్.. ముసలితనం ఈ మూడింటిలో మీరు దేనికి ఎక్కువ భయపడతారు?
జ: ఈ మూడింటిలో నేను దేనికీ భయపడను. నాకు భయమన్నది చాలా తక్కువ. అయితే ఫ్యామిలీలు విడిపోవడమన్నది నన్ను చాలా భయపెడుతుంది. అలా ఎప్పటికీ జరగకూడదని నేను కోరుకుంటాను.
ప్రశ్న: మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో కలిసి నటించేందుకు మీరిష్టపడతారు?
జ: కథను బట్టి ఎవరితో అయినా సరే నాకిష్టమే. నిర్మాత లాభనష్టాలు బేరీజు వేసుకుని ఫలానా హీరోతో కలిసి నేను యాక్ట్ చేస్తే బాగుంటుందని ముందుకొస్తే ఆ సబ్జెక్ట్ నాకు కూడా నచ్చితే నేనెప్పుడూ సిద్ధమే.
ప్రశ్న: మీ బాబాయి పవన్‌కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏం చెబుతారు?
జ: మిస్టర్ పర్‌ఫెక్ట్.
ప్రశ్న: ఇప్పటివరకు మీమీద వచ్చిన అతిపెద్ద గాసిప్ ఏమిటి?
జ: నాకు పెళ్ళయిపోయిందంటూ ప్రచారం జరగడం.
ప్రశ్న: మీరందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
జ: "మగధీర" సినిమాకు నేనందుకున్నవన్నీ బెస్ట్ కాంప్లిమెంట్సే.
ప్రశ్న: మీ నాన్నగారు కాకుండా బయట హీరోల్లో మీరమితంగా అభిమానించే హీరో ఎవరు?
జ: వెంకటేష్‌గారు.
ప్రశ్న: పూరి జగన్నాథ్, రాజమౌళి.. ఇద్దరూ ఒకేసారి వచ్చి మీతో సినిమా చేస్తానంటే మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు..?
జ: రాజమౌళితో మొన్న "మగధీర" చేశాను కాబట్టి పూరి జగన్నాథ్‌తో పనిచేసేందుకు ప్రాధాన్యత ఇస్తాను.
ప్రశ్న: చివరగా.. మీ నాన్నగారు నటించిన చిత్రాల్లో ఏదైనా ఒక చిత్రాన్ని మీతో రీమేక్ చేయాలని మిమ్మల్ని చేస్తే మీరు ఏ సినిమాను ఎంపిక చేసుకుంటారు..?
జ: "జగదేకవీరుడు-అతిలోకసుందరి" సినిమా. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం చాలా రిస్క్ అని తెలుసు. కానీ నాన్నగారి సినిమా ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే నా ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రయారిటీ మాత్రం జగదేకవీరుడు-అతిలోకసుందరికి మాత్రమే.
ప్రశ్న: 150 చిత్రానికి మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారని అన్నారు?
జ: ఎవరైనా అది మా బ్యానర్‌లోనిదే గదా..!.

Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |