Free SMS And Earn Part Time Money







7/15/09

'హారీ పోటర్ అండ్ ద హాఫ్-బ్లడ్ ప్రిన్స్'




హారీ పోటర్ సినిమాల సీక్వెల్స్లో ఆరవ చిత్రమైన 'హారీ పోటర్ అండ్ ద హాఫ్-బ్లడ్ ప్రిన్స్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ హిందీ, ఆంగ్ల భాషలతో పాటు తెలుగులో ' జగదేక వీరుడు' పేరుతో విడుదల చేస్తోంది 1200 కోట్ల వ్యయంతో రుపొందిచిన ఈ చిత్ర అద్బుత గ్రాఫిక్స్ తో హాలీవుడ్ సినిమాలను అన్నింటిని తలదన్నే రీతిలో ఉండబోతోంది ఇప్పటివరకు విడుదలయిన ఐదు చిత్రాలు ఒకదాని మించి ఒకటిగా అద్బుతమైన విజయాలు సాధించి ప్రతి ఒక్కరిని అలరించాయ్ ఈ చిత్రం కూడ అద్బుత విజయం సాధించబోతోంది ఐదు చిత్రాలలో ఎన్నో యుద్దాలలో,ఆటలలో ప్రమాదకరమైన సన్నివేశాలలో అలరించిన హర్రీ పొట్టర్ ఈ చిత్రంలో మరిన్ని సన్నివేశాలలో అద్బుతంగా నటించాడు ప్రతి సన్నివేశం తరువాత ఏమిజరుగుతుందోననే ఉత్కంఠ ఒక సినిమా తరువాత ఒక సినిమాతో అలరిస్తు విజయాలమీద విజయాలతో ముందుకుసాగుతోంది

రాం చరణ్ ఏబౌట్ హిస్ మగధీర


తన మగధీర చిత్రం గురించి హీరో రామ్ చరణ్ తేజ మీడియాతో మాట్లాడారు. 'మగధీర' అనుభవాల్ని చరణ్‌ వివరిస్తూ..."గుజరాత్‌లో తీసిన గుర్రం ఎపిసోడ్స్‌ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే 'బంగారు కోడిపెట్ట...' పాట కూడా. ఒకప్పుడు నాన్నగారు అదరగొట్టేసిన ఈ పాటను ఇప్పుడు నేను చేస్తుంటే చాలా ఉద్వేగపడ్డాను. ఇక కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రాణం. కచ్చితంగా ఈ సినిమా రీ-రికార్డింగ్‌ ట్రాక్స్‌ని ఆడియో సీడీలుగా రిలీజ్‌ చేయొచ్చు. మహామహులైన టెక్నీషియన్స్‌ ఈ సినిమాకి పనిచేశారు. కెమెరామన్‌ సెంథిల్‌కి హేట్సాఫ్‌ చెప్పాలి. అంత బాగా ఫొటోగ్రఫీ సమకూర్చారాయన' అని తెలిపారు.ఇక ఈ సినిమా తనకే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలుస్తుందనే అంచనాలో ఉన్నారు చరణ్‌. నిజంగా ఈ సినిమా చేయడం తన అదృష్టమని చెబుతున్నారాయన. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో...భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది





దర్శకుడు వంశి ఓ శాడిస్టు..తలతిక్క..టార్చర్ పెడతాడు



కమలినీ ముఖర్జీ ప్రముఖ దర్శకుడు వంశి ఓ శాడిస్టు..తలతిక్క..టార్చర్ పెడతాడు..ఇంతకు ముందు భానుప్రియకు నరకం చూపించాడు..కానీ ఆయనతో పనిచేస్తే కెరీర్ బాగుంటుంది అంటూ తనకు చాలా మంది చెప్పారని చెప్పుకొచ్చింది. తాను వంశి తో చేసిన గోపి..గోపిక..గోదావరి షూటింగ్ కు ముందు ఆ డైరక్టర్ గురించి వాకబ్ చేయగా ఇలా నెగిటివ్ గా చెప్పారని,అయితే అటువంటిదేమీ ఆయనలో కనపడలేదని ఆమె సర్టిఫై చేస్తోంది. ఇతని సినిమాలన్ని తన పంధ లో తీసుకెల్తు హిరో హిరోయిన్లు ఎలాంటి వారైన తన కధ కధనంతో సాగుతాడే తప్ప ఎటువంటి హీరో హిరోయిన్ ల ఇమేజ్ లు బట్టి సినిమా తీసే తత్వం కాదని చెప్పింది అతనితో పని చేయడం ద్వార చాల తెలుసుకోవచ్చని చెప్పు కొచ్చింది వేణు, కమిలినీ జంటగా రిలీజైన గోపి..గోపిక..గోదావరి భాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. కుప్పలు కుప్పలుగా సంభంధం లేని డైలాగులు, నస పెట్టే సెంటిమెంట్ ఈ చిత్రాన్ని గోదావరిలో కలపాయని చూసినవారంతా తలనొప్పికి మందులు రాసుకుంటూన్నారు.

బిల్లా తరువాత ప్రభాస్




ప్రభాస్‌, పూరి జగన్నాథ్‌ల కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం 'ఏక్‌నిరంజన్‌'. ఆదిత్యారామ్‌ మూవీస్‌ పతాకంపై ఆదిత్యారామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది.'గత నెలలో 12 రోజుల పాటు స్విట్లర్లాండ్‌లోని పలు అందమైన లొకేషన్లలో హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ కంగనా రనౌత్‌లపై రెండు పాటలలో సినిమా షెడ్యుల్ పూర్తి చేసుకోగా ఈ నెల 12 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుపుతున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తీస్తున్నారు. బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తరువాత హైదరాబాద్‌లో మిగిలిన షూటింగ్‌ను పూర్తిచేస్తారు. సెప్టెంబర్‌ నాటికి మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. ప్రభాస్‌ నటన హైలైట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది' అని అన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ, పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా అత్యున్నత సాంకేతిక విలువలతో దీనిని రూపొందిస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, కంగనా రనౌత్‌, సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్‌, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంగీత, పోసాని కృష్ణమురళి, శ్రావణ్‌ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ,సమర్పణ: పూరి జగన్నాథ్‌, నిర్మాత: ఆదిత్యారామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. వరస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రుతలుగించనుంది మగధీరతో రాంచరణ్,జోష్ తో నాగర్జున తనయుడు నాగచైతన్య,మల్లనతో విక్రం,మరో కొత్త సినిమాతో ఎంటి.ఆర్.,ఆంజనేయులుగా రవితేజ,గోపిచంద్ శంఖం ఇవన్నికాక ప్రభాస్ ఏక్ నిరంజన్ తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలుగించడానికి ముందుకు రాబోతున్నాయె మరి కాసుకోండి
Powered by web analytics software.