Free SMS And Earn Part Time Money







12/24/10

నా ముందు బాగోదు నా వెనుకే బాగుంటుంది


అసిన్,జెనిలియా త్రిష...ఈ ముగ్గురూ ఇక జాగ్రత్త పడాల్సిందే...అంటున్నారు ఇలియానా.ఎందుకట...?అనడిగితే నా బాలీవుడ్ ఆగమనంతో వారికి గట్టి పోటి తప్పదు.అందుకే అలా అన్నాను అని సమధానమ్మిచ్చారామె.ఉన్నాట్టుండి బాలివుడ్ పై మనసెందుకు మళ్ళింది...?అన్న ప్రశ్నకు_"ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందనే బాలీవుడ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను.కానీ తెలుగు సినిమాను మాత్రం వదులుకోను "అని చెప్పారు శరీరాకౄతి అజంతా శిల్పంతో పోలుస్తుంటారు ఇది నా తల్లిదండ్రులు నాకిచ్చిన వరం నా శరీరాకౄతి అందాన్ని రెట్టింపు చేసేది నా నడుమే తెలుగులో నన్ను స్టార్ని చేసింది నా నడుమే అలాగే బాలీవుడ్ లో కూడ నా నడుమందమే నన్ను స్టార్ ని చేస్తుందని అందమైన శరీరాకౄతి కోసం నేను రోజు స్విమింగ్ చేస్తానని చెప్పుకొస్తోంది ఈ సుందరి

jab uye met "కండేన్ కాదల్ " priya priyatama


మూడు పద్దతులే నా అందానికి కారణం


ఇమ్రాన్ అష్మి రెడి ఫర్ యనదర్ కిస్



కండల వీరుడు ప్రసంసల వర్షం అసిన్ , ఆమె సాన్నిహిత్యం తనకు ఆనందం కలిగిస్తుందని చెబుతున్నాడు


గజనీ' చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్ ఇప్పుడక్కడ సల్మాన్ ఖాన్ తో తెలుగు 'రెడీ' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ అవకాశాన్ని సల్లుభాయే ఇప్పించాడని కూడా మరో న్యూస్. అంతేకాదు ఈ తారపై కండల వీరుడు ప్రసంసల వర్షం కురిపిస్తూ ఆమె సాన్నిహిత్యం తనకు ఆనందం కలిగిస్తుందని చెబుతున్నాడు.

'లండన్ డ్రీమ్స్' లో ఇద్దరు నటించినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమాయణం కూడా కొనసాగిందని, సల్మాన్ ఆమెపై మనసు పారేసుకున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు 'రెడీ' షూటింగ్ లో కూడా వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలావుంటే 'రెడీ' సినిమాలో ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్ లూ చెట్టుకొమ్మ పట్టుకొని వేలాడుతుంటారు. అదే సన్నివేశాన్ని ఈ జంటపై చిత్రీకరిస్తున్నపుడు అసిన్ గట్స్ చూసి సల్మాన్ తెగ ఇంప్రెస్ అయ్యాడట. ఆమెకు గుండె ధైర్యం ఎక్కువని, ఆమె పక్కన నటించడం తన అదృష్టమని తన స్దాయిని తగ్గించుకొని మరీ సల్మాన్ మాట్లాడారని తెలిసింది.

సల్మాన్ అలా వ్యాఖ్యానించడం చాలా గొప్ప విషయమనీ, ‘రెడీ’ సినిమా తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిపోతుందని అసిన్ థీమా వ్యక్తం చేస్తోంది. కాగా సల్మాన్, అసిన్ లు ఇస్తోన్న స్టేట్ మెంట్స్ బాలీవుడ్ జనానికి బీభత్సమైన జోకులు వేసుకుంటున్నారు.

నన్ను చూడు నా నడుము చూడు


ఇలియానా నడుమందం గురించి కొత్తగా చెప్పేదేముంది..?పిడికెడంత ఆ నడుమే టాలీవుడ్ లో ఆమెకు హీరోయిన్ గా గుర్తింపును తెచ్చిపెట్టిందన్నది నిర్వివాదాంశం. తన శరీరంలో తన నడుమే తనకు ప్లస్ పాయింట్ అని ఇలియానా పదేపదే చెబుతుంటుంది కూడా. బాలీవుడ్ లోనూ తన నడుమందమే తనకు మంచి పొజిషన్ ఇస్తుందని ఇలియానా ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే కాబోలు టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా జూ ఎన్టీఆర్ ‘శక్తి’, ‘రాణా తో నేను నా రాక్షసి’, సినిమాషూటింగ్ లతో బిజిగా వుంటూ రామ్ చరణ్ మెరుపుకు సెలక్ట్ అయ్యిందని సమాచరం.

ఫిగర్ ని ఫెర్ ఫెక్ట్ గా మెయిన్ టెయిన్ చెయ్యడానికి యోగా చేస్తానంటోన్న ఇలియానా, నిత్యం, స్విమ్మింగ్ చేసే నడుము కొలతలు సరిగా వుంటాయని తన గ్లామర్ సీక్రెట్ ని బయట పెట్టింది. బాలీవుడ్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా, అసిన్, త్రిష, జెనీలియా తదితర సౌత్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తానని చెబుతోంది. ప్రస్తుతానికి తెలుగు సినిమాలతో బిజీగా వున్నా, రీచ్ ఎక్కువగా ఉంటుండనే బాలీవుడ్ సినిమాలపై దృష్టిపెట్టిందట ఇలియానా.

వాళ్లిద్దరి మధ్య నిజంగా కెమిస్ట్రీ నడుస్తుందా...?!!


స్టార్ ప్రొడ్యూసర్ మనవడు రానా, సెక్సీ సుందరి శ్రియ మధ్య గత కొంతకాలంగా కెమిస్ట్రీ నడుస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇటీవల వీళ్లద్దరూ తరచూ కలుసుకుంటున్నారట.

ఈ గుసగుసల సంగతి ఎలా ఉన్నా మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్యాంటలూన్ ఫెమినా మిస్ సౌత్ ఇండియా 2011 ఫంక్షన్ కి రానా, శ్రియ హాజరయ్యారు.

ఫంక్షన్ ఆద్యంతం ఇద్దరూ ఒకరికొకరు కలిసి చాలా సరదాగా మాట్లాడుతూ గడిపారు. దీనిపై శ్రియ సన్నిహితులను కదిలిస్తే... అలా ఏదో కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన కెమిస్ట్రీ ఉన్నట్లేనా...? అని ఎదురు ప్రశ్నలు వేశారట.

అమిర్ తో రొమెన్స్ చేయాలని ఉంది :త్రిష


నా తప్పు నాకు తెలిసింది :nayanatara




దారుణ నిజం


అమెరికా సెక్సీ మోడల్, బుల్లి తెర నటీమణి కిమ్ కర్దాషియాన్ తాను నిర్వహిస్తున్నటువంటి రియాలిటీషో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లో ఓనిజాన్ని తన అభిమానులకు చెప్పారు. ఆనిజం ఏమిటంటే తన చెల్లెలు బ్రెస్ట్ మిల్క్ గుక్కెడు తాగానని చెప్పారు. దాంతో కీపింగ్ విత్ ద కర్దాషియాన్స్ లోపాల్గోన్నటువంటి అందురూ ఒక్కసారిగా షాక్ కుగురి అయ్యారు

‘పరమవీర చక్ర’ చిత్రంలో నటిస్తున్న అమీషా పటేల్ మాత్రం దొంగ:నళిన్ రజనీ పటేల్


అమీషా పటేల్ ఈమధ్య సరసయిన అవకాశాలు రాక ఇబ్బందులు పడుతోన్న సంగతి తెలిసిందే. అయితే మరీ ఖర్చులకి కూడా డబ్బులు లేక సొంత అంకుల్ ఇంటికే కన్నం వేసి దొరికిపోయేంతగా ఆమె కష్టాల్లో ఉందన్న సంగతి మాత్రం మనకి తెలీదు. కానీ అమీషా అంకుల్ నళిన్ రజనీ పటేల్ మాత్రం అదే అంటున్నాడు. అమీషాని దొంగ అంటూ అతను గొడవ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే తన ఇంట్లో అమీషాపటేల్ దొంగతనం చేసిందని ఆయన పోలీసులకి కంప్లయింట్ ఇచ్చాడు.

తాము లేనప్పుడు డూప్లికేట్ కీస్ సాయంతో ఇంట్లోకి ప్రవేశించిన అమీషా విలువైన సామాగ్రిని తస్కరించిందని, ఆమె తన స్నేహితులతో కలిసి ఇంటికి రావడం వాచ్ మెన్ కూడా చూశాడని నళిన్ పటేల్ అంటున్నాడు. అమీషా దగ్గర్నుంచి తమ వస్తువులని ఇప్పించాలని ఆయన పోలీసులని కోరుతున్నాడు. బాలకృష్ణ సరసన ‘పరమవీర చక్ర’ చిత్రంలో నటిస్తున్న అమీషా పటేల్ మాత్రం ఈ దొంగ ఆరోపణల మీద స్పందించలేదని తెలుస్తోంది.

బాగా తెలిసినవారికి మాత్రం దమ్ము మీద దమ్ములాగిస్తాడని చెబుతారు మహేష్‌ని


తెలుగు సినిమా ఇండస్ట్రీ స్దాయిని పెంచగల ఒకే ఒక్క నటుడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష అనడంలో ఏమాత్రం సందేహాం లేదు. వినమ్రతకు మారు పేరు ప్రిన్స్ మహేష్. తన పని తాను చేసుకుంటే పోయే స్వభావం కలవాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమాలో నటిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా తమిళ నిర్మాత లింగుస్వామి నిర్మాణ సారధ్యంలో వేట అనే సినిమాలో నటించడానికి అంగీకరించారని సమాచారం. ఈసినిమాలో మహేష్ సరసన అనుష్క నటించనున్నారు. ఇలా వరుసగా సినిమాలు తీస్తూ తన సూపర్ స్టార్ షిప్ నునిలబెట్టుకోవడమే కాకుండా అభిమానులుకు ఇంకా బాగా దగ్గర అవ్వడం కోసం ట్విట్టర్ లోప్రతిరోజూ అభిమానులుకు ట్వీట్స్ అందిస్తుంటారు.

అలాంటి మహేష్‌బాబు ఆరోగ్యం గురించి భార్య నమ్రత చాలా కేర్‌ తీసుకుంటోంది. మహేష్‌ని చూస్తే పొగతాగుతాడని ఎవరూ అనుకోరు. కానీ బాగా తెలిసినవారికి మాత్రం దమ్ము మీద దమ్ములాగిస్తాడని చెబుతారు. అటువంటి మహేష్‌ని నమత్ర చాలా వరుకు కంట్రోల్‌ చేసిందని సమాచారం. పనిలోపనిగా నాన్‌వెజ్‌కూడా తగ్గించేలా ప్లాన్‌ చేసిందంట. ఆరోగ్యం, అలవాట్లు మానుకుంటే ఇండస్ట్రీలో మరింతగా రాణిస్తారని సూక్తులు బోధిస్తుందని వినికిడి. అంతా బాగానే ఉంది కానీ, సినిమాలపై కేర్‌ తీసుకోవడంలేదని సన్నిహితులు అంటున్నారు. బాలీవుడ్‌లో మహేష్‌తో చక్కటి సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉందని తెలిసింది.

ఈ నెల 31 రాత్రి మల్లికా షెరావత్ ని దగ్గరగా చూడాలంటే కేవలం రూ. 12,500


బాలీవుడ్ హాట్ గర్ల్ మల్లికా షెరావత్ ని దగ్గరగా చూడాలంటే కేవలం రూ. 12,500 అవుతుంది. ఆ మొత్తంతో మీకు అక్కడ మంచి డిన్నర్ ‌తో పాటు అన్ని రకాల పానీయాలు కూడా లభిస్తాయి. ఈ వేడుక ముంబైలోని ద సహారా స్టార్‌లో జరుగబోతోంది. ఇందుకు ఆమె తీసుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ. కోటి రూపాయలు. ఇక సెక్స్ బాంబ్ మలైకా అరోరా ఖాన్‌ ను లైవ్‌ లో చూడాలనే ఆసక్తి ఉంటే యాభై ఐదు దగ్గర పెట్టుకుని రెడీ అవమంటున్నారు. పుణె సమీపంలోని ఆంబీ వ్యాలీలో ఈ నెల 31 రాత్రి ఈ పార్టీ జరుగనుంది. నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆమె డాన్స్ లు చూస్తూ గడపాలనుకుంటే ఆ మాత్రం ఖర్చు తప్పదంటున్నారు. అలాగే 55 వేలు ఖర్చు పెట్టి పాస్ తీసుకుంటే జంటగా కూడా వెళ్లవచ్చు. అంతే కాదు బోనస్ గా ఆ వ్యాలీలో రెండు రాత్రులు, మూడు రోజులు గడపొచ్చు. ఇంతకీ మీరు మల్లికాను చూడాలనుకుంటున్నారో, మలైకా అరోరాని పలకరించాలనుకుంటున్నారో త్వరగా తేల్చుకోవాలి.

త్రిష తమ నటన, గ్లామర్ తో లాగుదామని చూసినా భారమైపోయింది.


-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: లక్ష్మి గణపతి ఫిల్మ్స్,రెడ్ జెయింట్ ఫిల్మ్స్
తారాగణం: కమల్ హసన్, త్రిష, మాధవన్, సంగీత, రమేష్ అరవింద్, ఊర్వశి తదితరులు.
కధ: కమల్ హసన్, క్రేజీ మోహన్
మాటలు: వెన్నెలకంటి
ఎడిటింగ్: షాన్ మహ్మద్
కెమెరా: మానుష్ నందన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: ఉదయనిది స్టాలిన్
దర్శకుడు: కె.ఎస్.రవికుమార్
విడుదల తేది: 23/12/2010

కమల్ హాసన్ కామిడి అనగానే తెనాలి, పంచతంత్రం, భామనే సత్య భామనే, మైఖల్ మదన కామరాజు వంటి చిత్రాలు వరసగా గుర్తొచ్చి మనస్సుకు చెక్కిలిగిలి పెడతాయి. దాంతో కమల్ కొత్త కామిడీ చిత్రం వస్తోందనగానే నవ్వటానికి రెడీ అయ్యిపోయి ధియోటర్లలో వాలిపోయారు అభిమానులు. అయితే కమల్ సొంతంగా కథ, స్క్రీన్ ప్లే అందిచిన ఈ చిత్రం ఆ విభాగాలే లోపమై వారి ఎక్సపెక్టేషన్స్ ను కొంచెం కూడా రీచ్ కాలేక చతికిలపడింది. కమల్, త్రిష తమ నటన, గ్లామర్ తో లాగుదామని చూసినా భారమైపోయింది.

మేజర్ గా రిటైరైన ఆర్ భూషణ్ (కమల్ హాసన్) డిటెక్టివ్ గా పనిచేస్తూంటాడు. వృత్తిలో భాగంగా అంబుజాక్షి ఉరఫ్ నిషా(త్రిష)నిఘా వేయటానికి ప్యారిస్ వస్తాడు. ఆ కేసుని అప్పచెప్పింది ఎవరో కాదు...నిషా ప్రేమికుడు మదన్ గోపాల్(మాధవన్). హీరోయిన్ అయిన నిషా తోటి ఆర్టిస్టుతో చనువుగా మెలగటాన్ని అనుమానించిన మదన్ ఆమెతో విడిపోయి..ఎఫైరుందని నిరూపించాలని ఈ డిటెక్టివ్ ద్వారా ప్రయత్నిస్తూంటాడు. నిషాకు ఏ విధమైన ఎఫైర్ లేదని తెలుసుకున్న భూషణ్ ఈ విషయమే మదన్ పాస్ చేస్తాడు. అయితే బిజెనెస్ మ్యాన్ అయిన మదన్ అతి తెలివితో ఆమెకు ఎఫైర్ లేదన్నప్పుడు...ఇక నీ పని లేదు కదా అంటూ ఫీజ్ ఎగ్గొట్టబోతాడు. ఆ ఫీజ్ తో ఓ ప్రాణాన్ని నిలబెట్టాల్సి ఉండటంతో మదన్ రివర్స్ గేమ్ ఆడి..మదన్ కి బుద్ది చెప్పాలనుకుంటాడు. నిషా కు ఓ ఎఫైర్ ఉన్నట్లు డౌట్ మదన్ లో క్రియోట్ చేసి డబ్బులు లాగుతాడు. అప్పుడు మదన్ ఎలా రియాక్ట్ అయ్యాడు. నిషా పరిస్ధితి ఏమైంది, నిషాతో ప్యారిస్ వచ్చిన స్నేహితురాలు దీప్తి(సంగీత)కి ఈ కథకీ సంభంధం ఏమిటీ అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చివరిదాకా చూడాల్సిందే.

దేరీజ్ సమ్ ధింగ్ ఎబౌట్ మేరి(1988) చిత్రాన్ని కేవలం ప్రేరణగానే తీసుకున్న ఈ చిత్రానికి మొదట చెప్పుకున్నట్లుగా కథ,స్క్రీన్ ప్లే నే మైనస్ గా నిలిచి సెకెండాఫ్ ని నసగా మార్చేసాయి. అందులోనూ సినిమా మొదటనుంచీ చివరి వరకూ కమల్ హాసన్..తన బాస్ మాధవన్ తోనూ, తన స్నేహుతుడు తోనూ ఫోన్ లో మాట్లాడుతూ కథ నడుపుతూండటం బోర్ ఎపిసోడ్ లా మారింది. అందులోనూ డిటెక్టివ్ గా చేసిన కమల్ పాత్రకు మొదట్లో తనను నియమించిన వాడు డబ్బు ఎగ్గొట్టడానికి ప్రయత్నించటంతో సమస్యలో పడుతుంది. ఆ తర్వాత తను తన అవసరం కోసం త్రిషకు వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అబద్దం ఆడినప్పుడు అక్కడనుంచి ఆ అబద్దం పెరిగి పెద్దదై కమల్ నే సమస్యలో పడేస్తే కామిడీ బాగా పండేది. కానీ కమల్ అబద్దం ఆడటం వల్ల ఎవరికీ పెద్ద నష్టం కలిగినట్లుందు. అలాగే తను ఆడిన అబద్దం ద్వారా మరింత విడిపోయిన జంటను కలుపుదామని కూడా కమల్ ప్రయత్నించడు. అలా చేసుంటే సెకెండాఫ్ లో పాత్రల మధ్య సంఘర్షణ పుట్టి రాకుండా కామిడీ పండి ఉండేది.

ఇక ఈ చిత్రంలో నీలాకాశం పాటను ఫ్లాష్ బ్యాక్ వేస్తూ రివర్స్ లో చేసిన చిత్రీకరణ ఐడియా ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చాలా డల్ గా ఉంటాయి. దర్శకత్వ పరంగా ఫస్ట్ హాఫ్..గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలిలో స్మూత్ గా సాగుతుంది. నటీనటుల్లో కమల్ ఎప్పుడూ నిరాశపరచడు అన్నది ఈ సారి నిజం అనిపించదు. త్రిష తన రెగ్యులర్ స్మైల్స్, ఎక్సప్రెషన్స్ తో నటించుకుంటూ పోయింది. డైలాగులు చాలా చోట్ల అచ్చ తెలుగులో రాయాలని ప్రయత్నించటం కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలెట్ ఏదన్నా ఉందంటే అదే కెమెరా పనితనం.

ఫైనల్ గా ఈ చిత్రం టైటిల్, కమల్, త్రిషలని చూసి ఓ అధ్భుతమైన రొమాంటిక్ కామిడీ అని ఊహించుకుని వెళితే తీవ్రమైన నిరాశ కలుగుతుంది. అయితే కమల్ హాసన్ ఓ చిత్రాన్ని డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దామనుకున్నవారు మాత్రం ఈ చిత్రం తప్పక చూడాలి. ఎందుకంటే ఆర్టిస్టుల ఎక్సప్రెషన్ దగ్గర్నుండి...అన్నీ కమల్ హాసనే స్వయంగా నిర్ధేసించినట్లు ఈ చిత్రం చూసిన ఎవరైనా చెప్పగలుగుతారు.

సినిమా ఫంక్షన్‌కు యాంకర్‌గా వస్తారు. అతిథుల్నే మీ పేరు ఏమిటి...? మీరు ఏమేమీ చేశారు?Dasari


టీవీ జర్నలిజం వచ్చాక పాత్రికేయుల విలువలు పడిపోయాయనీ, నేటి యాంకర్‌లకు గతం ఏమిటో కూడా తెలీకుండా న్యూస్‌లు చదివేయడం బాధగా ఉందని డా|| దాసరి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా ఫంక్షన్‌కు యాంకర్‌గా వస్తారు. అతిథుల్నే మీ పేరు ఏమిటి...? మీరు ఏమేమీ చేశారు? అంటూ ఈమధ్య చాలా మంది యాంకర్‌లు అడగడం చూశాను. నాకే సిగ్గుగా ఉంది. అందుకే అటువంటివారు గతం గురించి తెలుసుకోండి. మైకులు పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తే ఎలా? ఇంటర్వూ చేస్తుంటే.. దానికి హోంవర్క్‌ చేయాలి..? ఇవన్నీ మర్చిపోయి... ఏవేవో మాట్లాడి. జర్నలిజం విలువలుదిగజారుస్తున్నారంటూ.. దాసరి అన్నారు.

ఇక రాబోయే తరాలవారు రఘుపతి వెంకయ్య ఎవరు? అని అడిగినా అడుగుతారు. అటువంటివారు గత చరిత్రను చదవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీనియర్‌ సినీపాత్రికేయుడు పసుపులేటి రామారావు రచించిన ' నాటి మేటి సినీ ఆణిముత్యాలు' పుస్తకావిష్కరణ గురువారంనాడు డా|| దాసరి నారాయణరావు విడుదల జేయగా తొలిప్రతిని ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షుడు చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... నిబద్ధత గల జర్నలిస్టుగా పసుపులేటి పేరు సంపాదించారనీ, ఓ ఫంక్షన్‌లో తాను పలుకరించకపోతే అలిగాడనీ, ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేసేదాకా శాంతించలేదని గుర్తుచేసుకున్నారు.

"రగడ" రగడచేస్తుందేమో story చూడండి


నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్లభరణి, రఘుబాబు, దేవ్‌గిల్‌, సత్యప్రకాష్‌,న ప్రదీప్‌రావత్‌, సుప్రీత్‌, శ్రీలలిత, సన, మాస్టర్‌ భరత్‌ తదితరులు. కెమెరా: సర్వేష్‌మురారి, సంగీతం: థమన్‌, ఆర్ట్‌: ప్రకాష్‌, నిర్మాత: డి. శివప్రసాద్‌రెడ్డి, దర్శకత్వం: వీరూ పోట్ల.

పాయింట్‌: పెంచిన తల్లికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకునే ప్రతీకారం.

వీరు పోట్ల అనగానే రచయితగా పరిచయం. ఆ తర్వాత దర్శకుడు అయి 'బిందాస్‌' తీసి సక్సెస్‌ చేశాడు. దాంతో స్వతహాగా నాగార్జున ఫ్యాన్‌ కావడంతో ఆ కోణంలో ఆలోచించి రగడ చిత్రాన్ని రూపొందించారు. పూర్తి మాస్‌ మసాలా ఉన్న ఈ చిత్రం వినోదాత్మకంగా సాగింది.

తను చేసిన ఓ హత్యను చూసిన అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు దేవుడు (తనికెళ్ళభరణి). సడెన్‌గా పెద్దన్న (కోటశ్రీనివాసరావు) పంపాడని సుప్రీత్‌ వచ్చి భరణిని చంపేస్తాడు. మొదటి షాట్‌తోనే ఈ చిత్రం ఏ తరహానో దర్శకుడు చెప్పేశాడు. రౌడీరాజ్యంలో హీరో ఎలా డీల్‌చేశాడనేది కథ.

సత్య (నాగార్జున) కడప నుంచి సిటీకి వస్తాడు. సిటీలో ఎక్కడ గొడవలు జరిగినా దానిలో ఇన్‌వాల్వ్‌ అయి వారి భరతం పడతాడు. నచ్చితే చెరకు గడ, నచ్చకపోతే రగడ.. అనే ఫిలాసఫీతో ఉంటాడు. జీకె (దేవగిల్‌)కు ప్రదీప్‌రావత్‌ గ్యాంగ్‌కు సిటీలో వైరం. ఓ సందర్భంలో జీకెను కాపాడతాడు సత్య. దాంతో తమ గ్యాంగ్‌లో కలుపుకుంటాడు. అందుకు కోట్లరూపాయలు ఇస్తాననడంతో తనకు కావాల్సింది డబ్బే అని ఆ గ్యాంగ్‌లో చేరతాడు.

ఆ గ్యాంగ్‌లో షిండే శిరీష(అనుష్క)కు దగ్గరవుతాడు. అలా చేరి ప్రదీప్ రావత్‌ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. దీంతో విషయం అర్థంగాక సత్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకుంటాడు. తనను ఆదరించిన తల్లిని చంపినందుకు ప్రతీకారంగా సత్య ఇవన్నీ చేస్తున్నాడని గ్రహిస్తాడు ప్రదీప్‌రావత్‌. ఆతర్వాత సత్యపై ఎలా దాడి జరిపాడు? దాన్ని కడప ఉరఫ్‌ సత్య ఎలా డీల్‌ చేసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేది కథ.

కథ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. మొదటి భాగం చాలా జోవియల్‌గా ఉంటుంది. రెండోభాగంలో కథ కాస్త సీరియస్‌గా ఉన్నా అదీ సరదాగా సాగుతుంది. పక్కామాస్‌ మసాలాతో తీసిన చిత్రమిది. పొగరు, గుండె ధైర్యంగల వ్యక్తిగా నాగ్ బాగానే చేశాడు. ఫాన్స్‌కు నచ్చేవిధంగా హావభావాలు, రాయలసీమ యాసను దర్శకడు వీరుపోట్ల చక్కగా మలిచాడు. సంభాషణలు పొందికగా రాశాడు. అనుష్క వయ్యారాలు ఒలకపోస్తూ మాస్‌ను ఆకట్టుకుంది.

ఆమె స్నేహితురాలిగా వచ్చే విధానం అష్టలక్ష్మి(ప్రియమణి) సన్నివేశం బాగుంది. వీరిద్దరు ఫ్రెండ్స్‌ అనే విషయం చివర్లో సత్య బయటపెట్టడం ట్విస్ట్‌. ఇలాంటివి రెండు, మూడు ఉండటంతో సెకండాఫ్‌లో కథ రక్తికడుతుంది. బ్రాహ్మాణ యువతిగా ప్రియమణి చేసిన పద్ధతి సరదాగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులుగా ధర్మవరపు, సన, సోదరునిగా మాటకు 'నారాయణ' అంటూ సంబోధించే మాస్టర్‌ భరత్‌ సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయి.

ఎమోషనల్‌ పాత్రల్లో ప్రదీప్‌రావత్‌, దేవ్‌గిల్‌, కోట శ్రీనిసరావు పాత్రలకు న్యాయం చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు బాగున్నాయి. 'మీసమున్న మన్మథుడా..' పాటలో ఛార్మి అలరిస్తుంది. ఒకరకంగా డాన్స్‌ను ఇరగదీసింది. కాకపోతే సాహిత్యంలో స్పష్టత లోపించింది. మిగిలిన పాటలు బాగున్నాయి. 'రగడ రగడ... అనే టైటిల్‌ సాంగ్‌ సీరియస్‌ క్లైమాక్స్‌లో రొటీన్‌ పాటలా ఉన్నా అభిమానులకోసం తీసినట్లుంది. బ్రహ్మానందం పాత్ర పాత ధోరణిలో ఉన్నా కొత్తగా ఉంటుంది. అనుష్కను డాలింగ్‌ అంటూ లైనువేసే క్రమం మాస్‌ను ఆకట్టుకుటుంది. మిగిలిన పాత్రలు కధలో వచ్చి పోతుంటాయి.

సర్వేష్‌ మురారి తన కెమెరా నైపుణ్యంతో నాగ్‌ను గ్లామర్‌గా చూపాడు. సంగీతపరంగా థమన్‌ బాగానే చేసినా యాక్షన్‌లో నేపథ్య సంగీతం 'పోకిరి'ని తలపిస్తుంది. చార్మినార్‌ సెట్‌వేసి ఆర్ట్‌ప్రకాష్‌ వేసిన పాట పర్వాలేదు. ఇలా అందరి కృషితో మాస్‌మసాలాతో నాగ్‌ ముందుకు వచ్చాడు. ఇండస్ట్రీ బంద్‌ జరుగుతున్న తరుణంలో సినిమాలు రిలీజ్‌లు పెద్దగా లేకపోవడంతో "రగడ" రగడచేస్తుందేమో చూడాలి.
Powered by web analytics software.